KTR: అవును మాది కుటుంబ పాలనే.. రాష్ట్రంలోని నాలుగు కోట్ల మంది మా కుటుంబమే
- Follow Us :
-
-
Add as a preferred
source on google
KTR: అవును మాది కుటుంబ పాలనే.. రాష్ట్రంలోని నాలుగు కోట్ల మంది మా కుటుంబమే అన్నారు. కుటుంబ పెద్ద కేసీఅర్ అని కేటీఆర్ తెలిపారు. పోడు భూముల విషయంలో తప్పు పట్టాల్సి వస్తె అది కాంగ్రెస్ సర్కార్ నే అన్నా మంత్రి కేటీఆర్ మోడీ పనితీరు గురించి మాట్లాడాలని అన్నారు. ముప్పై ఏళ్ళలో అత్యంత ఎక్కువగా నిత్యావసర ధరలు పెరిగాయని అన్నారు. 45 ఏళ్ళలో ఎన్నడూ లేనంతగా దేశంలో నిరుద్యోగం పెరిగిందని తెలిపారు. ప్రపంచంలో అత్యంత ఖరీదైన సిలిండర్ ధర భారతదేశంలో ఉందని అన్నారు. పెట్రోల్ ధర కూడా భారత్ లో ఎక్కువ అన్నారు. తెలంగాణలో వేట కుక్కలు తిరుగుతున్నాయ.. ఏమైనా దొరుకుతుంది ఏమో చూస్తున్నారని మంత్రి కేటీఆర్ తెలిపారు. బీజేపీ నేత, తెలంగాణ ఎమ్మెల్యే ఈటెల రాజేందర్ పై మండిపడ్డారు. ఇటువైపు ఉన్నప్పుడు బాగున్న ఈటల అటు వెళ్లాక పూర్తిగా మారిపోయారు అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు.
Read also: Telangana Jobs: గుడ్ న్యూస్.. 9 మెడికల్ కాలేజీల్లో మరో 313 పోస్టులు
Also Read
- World Cotton Day: నేల నుంచి నేత వరకు.. తెల్ల బంగారం తెలంగాణ గుండెచప్పుడు..!
- Erravalli Lands : ఎర్రవల్లి భూములపై సీఎం రేవంత్ ఫోకస్.. 45 ఎకరాలు ఏమయ్యాయి?
- TGSRTC : ఎయిర్పోర్ట్ ప్రయాణికులకు గుడ్‌న్యూస్.. పుష్పక్ ఛార్జీలు భారీగా తగ్గింపు
- Uday Krishna Reddy : ట్రైనీ ఐపీఎస్ ఉదయ్ కృష్ణారెడ్డికి షరతులతో కూడిన బెయిల్
తెలంగాణ పల్లెలు ప్రగతిపథంలో నడుస్తున్నాయన్నారు. నాబార్డు, ఎఫ్‌సీఐ నివేదికలను కూడా నమ్మరా? అంటూ ప్రశ్నించారు. తెలంగాణ కోటి ఎకరాల మాగాణిలా మారిందని గుర్తు చేశారు. సద్విమర్శలు చేయండి కానీ రాష్ట్రాన్ని కించపరచకండి అంటూ మండిపడ్డారు. ధాన్యం ఉత్పత్తిలో పంజాబ్, హర్యానాతో పోటీపడుతున్నామన్నారని అన్నారు. గుజరాత్లో పరిశ్రలకు పవర్ హాలీడేలు ప్రకటిస్తున్నారు అన్నారు. మేము రైతురాజ్యం కావాలంటే.. బీజేపీవాళ్లు కార్పోరేట్ రాజ్యం కావాలని అంటున్నారని మండిపడ్డారు. అబ్ కీ బార్ కిసాన్ సర్కార్ అని దేశం మొత్తం ప్రచారం చేస్తాం అన్నారు. విదేశీ పెట్టుబడుల ఆకర్షణలో నెంబర్ వన్ గా ఉన్నామన్నారు మంత్రి. ఇంత దుర్మార్గమైన ప్రధాని ప్రపంచంలో ఎక్కడా లేరంటూ మండిపడ్డారు. దేశప్రజల చూపు కేసీఆర్ వైపు ఉందన్నారు. కేసీఆర్ అంటే మెచ్చని నేత లేరు ఆర్థికవేత్త లేరు అన్నారు మంత్రి. రోజుకు మూడు డ్రస్ లు మార్చడం కాదు.. ఓ విజన్ ప్రకారం నాయకులు పనిచేయాలన్నారు. యాద్రద్రి పవర్ ప్రాజెక్టు ను అడ్డుకునే ప్రయత్నం కేంద్రం చేస్తుందని అన్నారు. PFC, REC లకు ఫోన్ చేసి రుణాలు ఇవ్వొద్దని బెదిరిస్తారని అన్నారు. తెలంగాణ పై కేంద్రం కు కక్ష్య చూపిస్తుందన్నారు. దక్షతతో మేము పని చేస్తుంటే…కేంద్రం బ్లాక్ మెయిల్ చేస్తుందని మండిపడ్డారు. నల్ల చట్టాలను తెచ్చి 750 మంది రైతుల ప్రాణాలు తీసింది ఎవరు? అంటూ ప్రశ్నించారు.
MLA Jaggareddy: నేను స్పీచ్ రాసుకుని వచ్చా.. ఆయన మాట్లాడితే మర్చిపోయా
తాజావార్తలు
-
World Cotton Day: నేల నుంచి నేత వరకు.. తెల్ల బంగారం తెలంగాణ గుండెచప్పుడు..!
-
Shai Hope: భారత్‌ను ఎదుర్కోవాలంటే ఆ స్కోర్ సరిపోదు.. ఓటమికి ప్రధాన కారణం ఇదే: వెస్టిండీస్ కెప్టెన్
-
Earthquake : ఉత్తరాఖండ్‌లో భూకంపం.. ఢిల్లీ-ఎన్సీఆర్ వరకు ప్రకంపనలు!
-
Shreyas Iyer: సెంచరీతో శ్రేయాస్ అయ్యర్ వీర విహారం.. వెస్టిండీస్ చిత్తు చిత్తు.. భారత్ ఘన విజయం..
-
Wife Kills Husband: ప్రియుడితో కలిసి భర్తను చంపిన భార్య.. ఫోన్ చాట్‌తో వెలుగులోకి దారుణం..
ట్రెండింగ్
-
Hong Kong Sixes 2026: మరోసారి భారత్-పాకిస్థాన్ మ్యాచ్.. కెప్టెన్‌గా భువీ..!
-
Smriti Mandhana: బీసీసీఐ కీలక నిర్ణయం.. భారత మహిళల కొత్త కెప్టెన్‌గా స్మృతి మంధాన..!?
-
Captain Changes: ఆసియా గేమ్స్‌లో ఓటమి.. పాకిస్థాన్ కెప్టెన్ పై వేటు..! కొత్త కెప్టెన్ ఎవరంటే.?
-
WCL 2026 నుంచి పాకిస్థాన్ ఛాంపియన్స్ ఔట్.. NOC ఇవ్వని PCB.!
-
Kakarakaya Vepudu: అన్నంలోకి ‘కాకరకాయ వేపుడు’.. ఇలా చేస్తే ప్లేట్ ఖాళీ అవ్వాల్సిందే.!