హరీష్ రావు మీ గొప్ప దార్శనికతను అమల్లో చూపించండి అంటూ చురకలంటించారు బీజేపీ ఎమ్మెల్యే ఈటెల రాజేందర్. అసెంబ్లీ మీడియా పాయింట్ వేదికగా ఆయన మాట్లాడుతూ..బడ్జెట్ అంత అంకెల గారడే అంటూ విమర్శించారు. 70-80 శాతం నిధులు విదులుకావాలన్నారు
అవును మాది కుటుంబ పాలనే.. రాష్ట్రంలోని నాలుగు కోట్ల మంది మా కుటుంబమే అన్నారు. కుటుంబ పెద్ద కేసీఅర్ అని కేటీఆర్ తెలిపారు. పోడు భూముల విషయంలో తప్పు పట్టాల్సి వస్తె అది కాంగ్రెస్ సర్కార్ నే అన్నా మంత్రి కేటీఆర్ మోడీ పనితీరు గురించి మాట్లాడాలని అన్నారు.
కేంద్రం బోర్లకు మీటర్లు పెడతామని ఎప్పుడూ చెప్పలేదని బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ అన్నారు. అయితే.. రైతులకు సబ్సిడీ ఇవ్వొద్దని చెప్పలేదని వివరించారు. తెలంగాణ పేదలకు సబ్సిడీ పథకాలు అమలు చేసేందుకు కేంద్రం ఎప్పుడు ముందుంటుందన్నారు. కానీ.. సీఎం కేసీఆర్ శాసనసభలో కేంద్రంపై తప్పుడు ప్రచారం చేసి లబ్దిప