Erravalli Lands : ఎర్రవల్లి భూములపై సీఎం రేవంత్ ఫోకస్.. 45 ఎకరాలు ఏమయ్యాయి?
- ఎర్రవల్లి సర్వే నంబర్ 325లో 45 ఎకరాల మిస్సింగ్
- కేసీఆర్ కుటుంబానికి రెవెన్యూ రికార్డులపై నోటీసులు
- అర్హులైన పేద రైతులకు భూముల పంపిణీకి నిర్ణయం
- అమరవీరుల కుటుంబాల కోసం తెలంగాణ అమరవీరుల కాలనీ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
సిద్దిపేట జిల్లా మర్కూక్ మండలం ఎర్రవల్లి, దాని శివారు వెంకటాపురం గ్రామాల భూముల అంశంపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉన్నత స్థాయి సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సదరు గ్రామాల్లో చేపట్టిన సర్వే వివరాలను అధికారులు ముఖ్యమంత్రికి నివేదించారు. ఎర్రవల్లి గ్రామ పరిధిలోని సర్వే నంబర్ 325లో రెవెన్యూ రికార్డుల ప్రకారం మొత్తం 388 ఎకరాల భూమి ఉండాల్సి ఉండగా, ఇటీవల అధికారులు నిర్వహించిన క్షేత్రస్థాయి సర్వేలో కేవలం 343 ఎకరాలు మాత్రమే ఉన్నట్లు తేలింది. ఈ సర్వే నంబర్లో మిస్సయిన 45 ఎకరాల భూమి ఎక్కడికి పోయిందో తక్షణమే తేల్చాలని అధికారులను సీఎం ఆదేశించారు. ల్యాండ్ రికార్డులను పక్కాగా సరిచూసి భూమిని గుర్తించడం కోసం ఎర్రవల్లి, వెంకటాపురం గ్రామాల్లో సర్వే నోటిఫికేషన్ విడుదల చేయనున్నట్లు అధికారులు వెల్లడించారు.
కేసీఆర్ కుటుంబానికి నోటీసులు.. అర్హులైన రైతులకు భూముల పంపిణీ
మిస్సయిన భూమి సరిహద్దుల్లో మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు (కేసీఆర్)తో పాటు ఆయన కుటుంబ సభ్యుల భూములు ఉన్నందున, వారికి సంబంధిత రెవెన్యూ రికార్డులను సమర్పించాలని కోరుతూ నోటీసులు జారీ చేయాలని అధికారులు నిర్ణయించారు. రికార్డులు పరిశీలించి, భూ సరిహద్దులను లెక్క తేల్చనున్నారు. కాగా, సర్వే నంబర్ 325 పరిధిలో గుర్తింపు పొందే సరిహద్దు భూమిని స్థానికంగా ఉన్న అర్హులైన పేద రైతులకు పంపిణీ చేయాలని ప్రభుత్వం సూత్రప్రాయంగా నిర్ణయించింది.
Also Read
- Scrap Shop Explosion: రామంతాపూర్ స్క్రాప్ దుకాణంలో భారీ పేలుడు.. ఒకరి పరిస్థితి విషమం
- TGSRTC: ప్రయాణికులకు ఆర్టీసీ ధమాకా ఆఫర్.. సరికొత్త పథకానికి శ్రీకారం.. కేవలం రూ.600లకే..
- Telangana Rice Mill Scam: రైస్ మిల్లర్ల ‘మాయా’జాలం.. ఖజానాకు భారీ గండి!
- Hyderabad: భాగ్యనగరంలో గన్ కల్చర్ కలకలం.. పంజాగుట్ట బార్లో రివాల్వర్‌తో బెదిరింపులు..
తెలంగాణ అమరవీరుల కాలనీగా నిర్మాణం.. హౌసింగ్ బోర్డుకు బాధ్యతలు
తెలంగాణ మలిదశ ఉద్యమంలో ప్రాణాలు అర్పించిన అమరుల కుటుంబాల కోసం అదే సర్వే నంబర్ 325లో ‘తెలంగాణ అమరవీరుల కాలనీ’ నిర్మించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. ఈ కాలనీలో అమరుల కుటుంబాలకు ఇళ్ల స్థలాలను కేటాయించడంతో పాటు, సకల మౌలిక వసతులతో సమగ్ర రూపురేఖలు దిద్దాలని సూచించారు. ఈ కాలనీ నిర్మాణ బాధ్యతలను తెలంగాణ హౌసింగ్ బోర్డుకు అప్పగించాలని ఆదేశించిన సీఎం, వచ్చే జూన్ 2వ తేదీ (తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం) నాటికి నిర్మాణ పనులన్నీ పూర్తి చేసి ప్రారంభానికి సిద్ధం చేయాలని స్పష్టమైన గడువు విధించారు.
తాజావార్తలు
-
Catholic Church : చర్చిలో లైంగిక వేధింపులు.. బాధితులకు రూ.7 వేల కోట్ల పరిహారం
-
Naslen: ‘ప్రేమలు’ నస్లేన్ చేస్తున్నది డేరింగ్ స్టెప్పా? లేక పెద్ద తప్పా?
-
Scrap Shop Explosion: రామంతాపూర్ స్క్రాప్ దుకాణంలో భారీ పేలుడు.. ఒకరి పరిస్థితి విషమం
-
Cyclone Arnab : కోస్తాంధ్రను వణికించనున్న ‘అర్నాబ్’.. హైఅలర్ట్ జారీ చేసిన ఐఎండీ
-
Mann Ki Baat: ‘‘మన్ కీ బాత్’’కి 12 ఏళ్లు.. ప్రధాని మోడీ భావోద్వేగ వ్యాఖ్యలు
ట్రెండింగ్
-
All-Time India Test XI: ఓ.. డ్యామిట్.. ఆ జట్టులో కూడా కోహ్లీ, రోహిత్‌లకు దక్కని చోటు..!
-
2G ఫోన్‌తోనూ UPI పేమెంట్స్.. ఇంటర్నెట్ లేకుండానే itel 2165Cలో UPI పేమెంట్స్..!
-
How To Make Butter: మార్కెట్లో దొరికే కల్తీ వెన్నకు చెక్.. ఇంట్లోనే ఈజీగా తయారు చేసుకోండిలా..
-
Humanoid Robot : కత్తి దాడినే అడ్డుకుంది.. చైనా రోబో విన్యాసాలు చూస్తే మైండ్ బ్లాక్
-
Incredible India : ప్రపంచ రికార్డుల ఖజానా.. భారత్‌లో ఈ ప్రదేశాలు చూశారా.?