కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా నేడు తెలంగాణలో పర్యటించారు. ఈ సందర్భంగా ఆదిలాబాద్ బీజేపీ ఏర్పాటు చేసిన బహిరంగ సభలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా అమిత్ షా మాట్లాడుతూ బీఆర్‌ఎస్ ప్రభుత్వం, సీఎం కేసీఆర్‌పై విమర్శలు గుప్పించారు. అయితే.. అమిత్ షా వ్యాఖ్యలకు తెలంగాణ మంత్రి కేటీఆర్ కౌంటర్ ఇచ్చారు. మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ.. అబద్దాల అమిత్ షా పార్టీకి తెలంగాణలో గుణపాఠం తప్పదన్నారు. అమిత్ షా ప్రసంగం ఆసాంతం అబద్ధాలే అని మంత్రి కేటీఆర్ అన్నారు. అమిత్ షా మోడీ ఎన్ని అబద్ధాలు ఆడిన తెలంగాణలో బీజేపీకి ప్రజల చేతుల్లో తిరస్కారం తప్పదన్నారు మంత్రి కేటీఆర్.
Also Read : Koona Ravikumar: ఎప్పుడు ఎన్నికలు వచ్చినా జగన్ని ఇంటికి సాగనంపడం కాయం
మళ్లీ ఎన్నికల్లోను 110 స్థానాల్లో డిపాజిట్లు గల్లంతు అవడం ఖాయమని కేటీఆర్ ఉద్ఘాటించారు. పరివార్ వాద్ అంటూ అమిత్ షా మాట్లాడితే ప్రజలు పరిహాసం చేస్తున్నారని, అమిత్ షా కొడుకు ఎప్పుడు క్రికెట్ ఆడారో దేశ ప్రజలకు స్పష్టం చేయాలన్నారు మంత్రి కేటీఆర్. ప్రజల ఆశీర్వాదంతో పదేపదే గెలుస్తున్న పార్టీలను, నాయకులను ప్రశ్నించే నైతికత అమిత్ షాకు లేదని, పది సంవత్సరాల్లో తెలంగాణ రాష్ట్రానికి ఒక్క విద్యాసంస్థను ఇవ్వని పార్టీ బీజేపీ అని మంత్రి కేటీఆర్ మండిపడ్డారు. మా కార్ స్టీరింగ్ మా చేతుల్లోనే ఉంది… మీ పార్టీ స్టీరింగే అదానీ చేతిలో ఉందంటూ కేటీఆర్ కౌంటర్ ఇచ్చారు. తెలంగాణలో మత రాజకీయాలు చెల్లవని, రైతు ఆత్మహత్యల్లో తెలంగాణ అగ్రస్థానం అంటూ అమిత్ షా పచ్చి అబద్ధమన్నారు. రైతు సంక్షేమంలో దేశంలోనే తెలంగాణ అగ్రస్థానంలో ఉందన్న కేటీఆర్.. ప్రజలను భావోద్వేగాలు రెచ్చగొట్టేందుకే అమిత్ షా అబద్ధాలు మాట్లాడరన్నారు. ఇదే అమిత్ షా అయిదేళ్ల కింది అదిలాబాద్ సీపీఐ ప్రారంభానికి ఇచ్చిన హమీకి అతీగతీ లేదని మంత్రి కేటీఆర్ చురకలు అంటించారు.
Also Read : Nandyala: 18 రోజుల పసివాడిని గొంతు కొరికి హత్య చేసిన కన్నతల్లి