తెలంగాణలో మీట్ ప్రాసెసింగ్ రావాలని.. మీట్ ఇండస్ట్రీ భారతదేశానికే కాక ఇతర దేశాలకు కూడా మాంసం ఎగుమతి చేసే స్థాయికి రావాలని మంత్రి కేటీఆర్ అన్నారు. రాష్ట్రంలో గొర్రెల పెంపకం ఎక్కువగా చేపట్టాలని ఆయన సూచించారు. రాష్ట్రంలో కురమ, గొల్ల సోదరులకు గొర్లు పంపిణీ చేస్తున్నామని కేటీఆర్ వెల్లడించారు. మన రాష్ట్రంలో ఎక్కువగా వరి పండిస్తున్నామని.. దీనికి ప్రత్యామ్నాయంగా పంటలు పండించాలని అన్నారు. రాబోయే రోజుల్లో 20 లక్షల ఎకరాల్లో ఆయిల్ ఫామ్ సాగు కోసం కృషి చేస్తున్నామని అన్నారు.
రాష్ట్రం ఏర్పడిన తర్వాత 5 రంగాల్లో విప్లవాత్మక మార్పులు వచ్చాయని ఆయన అన్నారు. మొదటిది హరిత విప్లవం వల్ల వ్యవసాయ రంగం పండుగగా మారిందని.. దీనికి అనుబంధంగా ఫుడ్ ప్రాసెసింగ్ 10 ఎకరాల్లో రావాలని అన్నారు. ఒకప్పుడు తెలంగాణలో చేపలు తక్కువగా దొరికేవని.. కానీ ఇప్పుడు దేశంలోనే నెంబర్ వన్ స్థానానికి ఎదిగామని అన్నారు. కొత్తగా కట్టుకున్న రిజర్వాయర్ లు, మిషన్ భగీరథ తో ఇది సాధ్యం అయ్యిందని అన్నారు. మూడోది స్వేత విప్లవం అని.. మూతపడే దిశకు చేరిన విజయ డైరీని ఈ రోజు అభివృద్ధి రంగం లో నడిపించామని అన్నారు. ఇన్వెస్టర్లు సంతోషంగా ఉండాలని..వాళ్లే మన బ్రాండ్ అంబాసిడర్లు అని.. రాష్ట్రంలో ఇన్వెస్టర్లకు వేధింపులు లేవని మంత్రి కేటీఆర్ అన్నారు. హైదరాబాద్ చుట్టుపక్కల ప్రాంతాల్లో పరిశ్రమలు విస్తరించాయని.. రాష్ట్రమంతా పరిశ్రమలు పెట్టేందుకు ప్రయత్నిస్తామని కేటీఆర్ తెలిపారు.
Read Also: Lady Superstar: విజయశాంతి ప్రకటించిన ‘డెడ్ లైన్’!
గతంలో 24 గంటల విద్యుత్ అనేది ఒక కల అని.. ఇందిరా పార్క్ వద్ద కరెంట్ కోసం పారిశ్రామిక వేత్తలు ధర్నాలు చేశారని గుర్తుచేశారు.. ఇప్పుడు ప్రతిపక్షాలు ధర్నా చేస్తున్నాయని అన్నారు. అప్పుడు తెలంగాణ పరిస్థితి ఎలా ఉందో ప్రతిపక్షాలు ఆలోచించుకోవాలని అన్నారు. ఇప్పుడు రాష్ట్రంలో 24 గంటలు కరెంట్ ఇస్తున్నాము.. అన్ని రంగాల్లో ముందు ఉన్నామని.. మహిళా పారిశ్రామికవేత్తలకు అన్ని సౌకర్యాలు కల్పిస్తున్నామని కేసీఆర్ వెల్లడించారు. ఆత్మ నిర్భర్ భారత్ అని కేంద్రం చెబుతోందని.. దానికి అనుగునంగా తెలంగాణ పరిశ్రమలు ఏర్పాటు చేస్తున్నామని అన్నారు.