తెలంగాణలో మీట్ ప్రాసెసింగ్ రావాలని.. మీట్ ఇండస్ట్రీ భారతదేశానికే కాక ఇతర దేశాలకు కూడా మాంసం ఎగుమతి చేసే స్థాయికి రావాలని మంత్రి కేటీఆర్ అన్నారు. రాష్ట్రంలో గొర్రెల పెంపకం ఎక్కువగా చేపట్టాలని ఆయన సూచించారు. రాష్ట్రంలో కురమ, గొల్ల సోదరులకు గొర్లు పంపిణీ చేస్తున్నామని కేటీఆర్ వెల్లడించారు. మన రాష్ట్రంలో ఎక్కువగా వరి పండిస్తున్నామని.. దీనికి ప్రత్యామ్నాయంగా పంటలు పండించాలని అన్నారు. రాబోయే రోజుల్లో 20 లక్షల ఎకరాల్లో ఆయిల్ ఫామ్ సాగు కోసం కృషి…