ప్రపంచంలో ఉన్న టాప్ బెస్ట్ సిటీల్లో హైదరాబాద్ ఒకటి.. మూడు వేల యాక్టివ్ వైఫై హాట్ స్పాట్స్ హైదరాబాద్‌ని గ్లోబల్ స్మార్ట్ సిటీగా మార్చడానికి పనిచేస్తున్నాయని తెలిపారు తెలంగాణ ఐటీ శాఖ మంత్రి కేటీఆర్.. ప్రభుత్వం ప్రారంభించిన హై-ఫై ప్రాజెక్ట్‌లో భాగంగా హైదరాబాద్‌లో 3000కు పైగా పబ్లిక్ వై-ఫై హాట్‌స్పాట్‌లు ఏర్పాటు చేసిన సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ.. ఫైబర్ నెట్‌తో ప్రజలు స్పీడ్ ఇంటర్నెట్ పొందుతున్నారు.. ఫైబర్ నెట్‌తో ప్రభుత్వం భాగస్వామ్యం అవ్వడం సంతోషంగా ఉందన్నారు.. ఇండియాలోనే అతిపెద్ద ఫ్రీ పబ్లిక్ వైఫై నెట్వర్క్ గా హైదరాబాద్ మారందని గుర్తుచేశారు కేటీఆర్.. లార్జెస్ట్ పబ్లిక్ ఇంటర్నెట్ కనెక్టెడ్ సిటీగా హైదరాబాద్ అవతరించిందన్నారు.
ప్రతి ఒక్కరూ ఇంటర్నెట్ ని ఉపయోగిస్తున్నారు.. పిల్లలు సైతం డిజిటల్ డివైజ్ ఉపయోగిస్తున్నారని తెలిపారు మంత్రి కేటీఆర్.. మనం ఇప్పుడు 4జీలో ఉన్నాం.. త్వరలోనే 5 జీ కూడా రాబోతుందని వెల్లడించారు. ఇక, కరోనా సమయంలో ఫైబర్ నెట్ కీలకంగా పని చేసిందని వెల్లడించారు మంత్రి కేటీఆర్… నెట్‌ని ఉపయోగించి ఆస్పత్రులు, మెడికల్స్ ని కనెక్ట్ చేయొచ్చన్న ఆయన.. మానవ జీవితంలో ఇంటర్నెట్ భాగస్వామ్యం అయ్యిందన్నారు. ఈ సందర్భంగా ఆక్ట్ ఫైబర్ నెట్ టీంకి కంగ్రాట్స్ చెప్పారు కేటీఆర్.. గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ కూడా ఫైబర్ నెట్ కోసం పని చేస్తోందని.. భవిష్యత్‌లో మరింత ముందుకు వెళ్తామని ప్రకటించారు.