Minister KTR: గంగుల మీద పోటీ అంటే.. పోచమ్మ గుడి ముందు పొట్టేలు కట్టేసినట్టే..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Minister KTR: కమలాకర్ అన్నపై పోటీ చేసేందుకు అందరూ జంకుతున్నారని మంత్రి అన్నారు. కాంగ్రెస్ వాళ్లు హుస్నాబాద్ పారిపోయారు.. బీజేపీ వాళ్ళు పోటీకి వెన్క ముందాడుతున్నారంటూ మంత్రి తెలిపారు. గంగుల మీద పోటీ అంటే పోచమ్మ గుడి ముందు పొట్టేలు కట్టేసినట్టే అంటూ కేటీఆర్ అన్నారు. కరీంనగర్ జిల్లాలో బీఆర్ఎస్ ప్రజా ఆశీర్వాద సభ మంత్రి మంత్రి మాట్లాడుతూ.. మరోసారి తెలంగాణలో కేసీఆర్ కి అవకాశం ఇవ్వాలని కోరారు. కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణలో ఈ పదేళ్ళలో ఎన్ని మార్పులు వచ్చాయన్నారు. మానేరు నీళ్లకోసం జరిగిన కొట్లాటలు ఇంక కళ్లముందే ఉన్నాయని తెలిపారు. నేడు ఆ పరిస్థితి మారింది..కాళేశ్వరంతో కరీంనగర్ జిల్లా అంత సజీవ జలధారగా మారిందన్నారు. అభివృద్ధికి తోడు సంక్షేమం దీటుగా సాగుతుందని తెలిపారు. కమలాకర్ నాయకత్వంలో బీసీ సంక్షేమం అద్భుతమైన ప్రగతి సాధించామన్నారు. చదువుకునేందుకు గురుకులాలు, విదేశాలకు పోయేవాళ్ళకి కూడా అండగా ఉన్నామన్నారు. హిందూ ముస్లింల మధ్య కొట్లాటలు పెట్టె సన్నాసులు కరీంనగర్ లో ఉన్నారని తెలిపారు. కమలాకర్ చేతిలో చావు దెబ్బ తిని దొంగ ఏడ్పుతో ఎంపీ అయ్యాడంటూ కీలక వ్యాఖ్యలు చేశారు. ఎంపీ అయ్యాక కరీంనగర్ కి ఏం చేశారు? ఓ బడి తేలేదు… కనీసం గుడి అయినా తేలేదు.. అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.
మోడీ దేవుడన్న అంటున్న బండి సంజయ్ చెప్పాలి గ్యాస్ ధర ఎంత పెరిగిందో? అంటూ ప్రశ్నించారు. కేసీఆర్ అందరి నాయకుడు.. హిందూ ముస్లిం అందరికి నేత అన్నారు. కేసీఆర్ గొప్ప హిందువు… యాగాలు యజ్ఞాలు చేశారని, నిజమైన హిందువు ఎవర్ని తిట్టడని అన్నారు. ఇక్కడ ఎంపీ మసీదులు తవ్వుదాం అంటాడు… బొందల గడ్డలు తవ్వడానికా ఎంపీ అయింది సంజయ్ అంటూ మండిపడ్డారు. పునాదులు తవ్వండి.. అభివృద్ధి కోసం పునాదులు వేయండని అన్నారు. చావు నోట్లో తలపెట్టిన కేసీఆర్ ఒకవైపు… తెలంగాణ కోసం రాజీనామా చేయకుండా పారిపోయిన బీజేపీ కిషన్ రెడ్డి, ఓటుకు నోటు దొంగ థర్డ్ క్లాస్ క్రిమినల్ రేవంత్ రెడ్డి ఉన్నారని సంచలన వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్ బీమా పథకం తెస్తున్నాం.. అధికారం ఇవ్వండి.. ఆర్నెళ్లలో అమలు చేస్తామన్నారు. కమలాకర్, కేసీఆర్ కి చెప్పినట్టు… రాష్ట్రంలో సన్నబియ్యం పథకం అమలు చేయబోతున్నామన్నారు. 15 లక్షల పరిమితితో కేసీఆర్ ఆరోగ్య రక్ష ఇస్తామన్నారు. ప్రవళిక అనే అమ్మాయి చనిపోతే కొందరు చిల్లర రాజకీయాలు చేస్తున్నారని మండిపడ్డారు. వారి కుటుంభం నా దగ్గరకు వచ్చారు.. వారి అమ్మాయిని వేధించారని చెప్పారని తెలిపారు. వారికి న్యాయం చేస్తాం.. ఆ అమ్మాయి తమ్మునికి ఉద్యోగం ఇస్తామని చెప్పామని మంత్రి క్లారిటీ ఇచ్చారు. రాహుల్ వస్తాడు.. ప్రియాంక వస్తుంది.. మోసపోకండి… కార్ గుర్తుకు ఓటేసి కేసీఆర్ ని దీవించండి అని మంత్రి కేటీఆర్ అన్నారు.
Telangana Police: ప్రవళిక ఆత్మహత్య..13 మంది రాజకీయ నాయకులపై కేసులు
Also Read
- Thummidihatti Barrage: తెలంగాణ, మహారాష్ట్ర మధ్య తుమ్మిడిహట్టి పంచాయితీ.. నేడు కేంద్రం సమక్షంలో చర్చలు..!
- Cheyutha Pensions: చేయూత పెన్షన్ దరఖాస్తుల గడువు పెంపు.. చివరి తేదీ ఎప్పుడంటే..
- CM Revanth Reddy: ఈ 1000 రోజుల్లో కేసీఆర్ ఒక్కసారైనా జనం కోసం బయటకు వచ్చారా..?: సీఎం రేవంత్‌రెడ్డి
- Maharashtra: ఘోర విషాదం.. జీపు బోల్తా.. నలుగురు తెలంగాణ వాసుల మృతి
తాజావార్తలు
-
Hardik Pandya Injury: హార్దిక్ పాండ్యాకు బిగ్ షాక్.. మరోసారి గాయం.. ఈ గాయాల గోలేందిరా బాబూ!
-
Bigg Boss 10 Telugu: బోల్డ్ పర్సనాలిటీ.. భారీ ఫాలోయింగ్.. హౌస్‌లోకి ఈమె ఎంట్రీ ఇస్తే కుర్రాళ్లు చూపు తిప్పుకోలేరు!
-
Navagraha Pradakshina: నవగ్రహాలకు ప్రదక్షిణలు చేశాక కాళ్లు కడుక్కోవాలా? అసలు రహస్యం ఇదే..!
-
Hindu Temple Demolition: పాకిస్థాన్‌లో 125 ఏళ్ల పురాతన హిందూ ఆలయం కూల్చివేత.. హిందూ సంఘాల ఆందోళన!
-
OG 2 update : OG2 టైమ్ వచ్చింది.. కానీ డౌటే?
ట్రెండింగ్
-
PM Modi: భారత్ ఆర్థిక దూకుడు.. తొలి త్రైమాసికంలో జీడీపీ 7.8%పెరుగుదల.. హర్షించిన ప్రధాని.!
-
Remove Oil Stains: బట్టలపై నూనె మరకలు పొవట్లేదా.? ఇలా చేయండి.. రిజల్ట్ చూసి షాక్ అవుతారంతే.!
-
9000mAh బ్యాటరీ, 1.5K AMOLED డిస్ప్లేతో POCO X8 5G సెప్టెంబర్ 4న లాంచ్..!
-
క్రిస్టల్స్‌తో మెరిసిపోనున్న Motorola కొత్త ఫోల్డబుల్ ఫోన్.. IFA 2026లో సరికొత్త స్వరోవ్స్కీ ఎడిషన్.!
-
Viral Video : గుండెలను పిండేస్తున్న దృశ్యం.. చెల్లెలితో చిన్నారి.. తల్లిదండ్రుల కోసం వెతుకులాట.!