Hyderabad: యూట్యూబ్ చూసి ఇంట్లోనే వైన్ తయారీ.. వృద్ధుడి అక్రమ దందా బట్టబయలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Hyderabad: యూట్యూబ్ (YouTube) వేదికగా వైన్ తయారీ నేర్చుకుని, ఇంట్లోనే అక్రమంగా వైన్ తయారు చేస్తున్న ఓ వృద్ధుడి గుట్టును మల్కాజ్గిరి డీటీఎఫ్ (DTF) పోలీసులు రట్టు చేశారు. వృద్ధాప్యంలో స్వయం ఉపాధి మార్గం అన్వేషించే క్రమంలో ఈ అక్రమ దందాకు తెరలేపిన ఆంటోనీ పీటర్ అనే వ్యక్తిని ఎక్సైజ్ అధికారులు అరెస్ట్ చేశారు. విశ్వసనీయ సమాచారం అందుకున్న మల్కాజ్గిరి డీటీఎఫ్ సీఐ భరత్ కుమార్, ఎస్సై శ్రీనివాసరెడ్డి, సిబ్బంది కలిసి ఉమ్మడిగా ఈ దాడులు నిర్వహించారు. నిందితుడు ఆంటోనీ పీటర్ గత ఏడాది కాలంగా ఒకటి కాదు రెండు కాదు.. ఏకంగా ఏడు రకాల ఫ్లేవర్లలో వైన్ తయారు చేస్తూ, 750 ML బాటిల్‌ను రూ. 300 చొప్పున విక్రయిస్తూ భారీగా లాభాలు ఆర్జిస్తున్నట్లు డీటీఎఫ్ సీఐ వెల్లడించారు. గ్రేప్స్ (ద్రాక్ష), పైనాపిల్, జామ, మోసంబి, సపోటా, బనానాలతో పాటు ఆఖరికి తమలపాకు ఫ్లేవర్‌తో కూడా ఇతడు వైన్ తయారు చేస్తుండటం గమనార్హం.
వైన్ తయారీ విధానం, విక్రయాలు
వివిధ రకాల పండ్లను దాదాపు 15 రోజుల పాటు సహజ సిద్ధంగా ఫార్మెంటింగ్ (పులియబెట్టడం) చేసి.. ఆ రసంలో పంచదార, గోధుమలు కలిపి వడకట్టి వైన్‌గా మారుస్తున్నాడు. పండ్లను 15 రోజుల పాటు పులియబెట్టడం వల్ల ఆ రసంతో పాటు సహజంగానే అందులో ఆల్కహాల్ శాతం కూడా వస్తుందని అధికారులు తెలిపారు. ఇలా నిబంధనలకు విరుద్ధంగా ల్యాబ్ పరీక్షలు లేకుండా తయారు చేసిన వైన్‌ను నిందితుడు నేరేడ్మెట్, సికింద్రాబాద్, కాప్రా (NHO) పరిసర ప్రాంతాల్లోని కస్టమర్లకు విక్రయిస్తున్నట్లు విచారణలో తేలింది. ఈ ఆకస్మిక దాడిలో అధికారులు నిందితుడి వద్ద నుంచి సుమారు 377.7 లీటర్ల వైన్‌ను, దాన్ని ప్యాక్ చేయడానికి సిద్ధంగా ఉంచిన 502 ఖాళీ బాటిళ్లను స్వాధీనం చేసుకున్నారు. పట్టుబడిన ఈ అక్రమ వైన్ నిల్వల విలువ మార్కెట్లో సుమారు రూ. 1.50 లక్షల వరకు ఉంటుందని అధికారులు అంచనా వేశారు. ఎక్సైజ్ శాఖ ఆదాయానికి భారీగా గండి కొడుతున్న ఈ వైన్ తయారీ వ్యవహారాన్ని చాకచక్యంగా ఛేదించిన డీటీఎఫ్ బృందాన్ని మల్కాజ్గిరి ఎక్సైజ్ డిప్యూటీ కమిషనర్ ప్రణవి, ఈఎస్ బి. హన్మంతరావు ప్రత్యేకంగా అభినందించారు. అనంతరం స్వాధీనం చేసుకున్న వైన్ నిల్వలతో పాటు నిందితుడు ఆంటోనీ పీటర్‌ను తదుపరి చట్టపరమైన చర్యల నిమిత్తం కాప్రా ఎక్సైజ్ పోలీస్ స్టేషన్‌కు అప్పగించారు.
Also Read
- CJP vs Congress: ‘‘బీజేపీ కన్నా దారుణం’’.. సీజేపీ-కాంగ్రెస్ మధ్య మాటల యుద్ధం.!
- CJP: ‘‘రక్షణ కవచాలు’’గా మైనర్లు.. CJP నిరసనలపై NHRC నోటీసులు..
- Flydubai Terror Attack: ‘‘ఇది టెర్రర్ అటాక్’’.. ఫ్లైదుబాయ్ ఘటనపై యూఏఈ కీలక ప్రకటన!
- UP Election 2027: ‘‘150 కాదు.. కాంగ్రెస్‌కు 50 సీట్లే ఎక్కువ’’.. ఎస్పీ-కాంగ్రెస్ మధ్య ముదురుతున్న విభేదాలు!
తాజావార్తలు
-
CJP vs Congress: ‘‘బీజేపీ కన్నా దారుణం’’.. సీజేపీ-కాంగ్రెస్ మధ్య మాటల యుద్ధం.!
-
RC 17: సుకుమార్ ట్రాక్ రికార్డ్.. చరణ్ ఫాన్స్ కి కొత్త టెన్షన్!
-
Harish Rao : సీఎం రేవంత్‌పై హరీశ్ రావు ఫైర్.. ఫీజు రీయింబర్స్‌మెంట్‌పై సవాల్
-
CJP: ‘‘రక్షణ కవచాలు’’గా మైనర్లు.. CJP నిరసనలపై NHRC నోటీసులు..
-
Flydubai Terror Attack: ‘‘ఇది టెర్రర్ అటాక్’’.. ఫ్లైదుబాయ్ ఘటనపై యూఏఈ కీలక ప్రకటన!
ట్రెండింగ్
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!