Telangana Police: ప్రవళిక ఆత్మహత్య..13 మంది రాజకీయ నాయకులపై కేసులు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Telangana Police: ప్రవళిక ఆత్మహత్య ఘటనలో పలువురు రాజకీయ నాయకులు, విద్యార్థి నేతలపై చిక్కడపల్లి పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది. ఇటీవల పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న ప్రవళిక అశోక్ నగర్ ఆర్టీసీ క్రాస్ రోడ్డులోని తన హాస్టల్ గదిలో ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడిన విషయం తెలిసిందే. ప్రవళిక ఆత్మహత్య చేసుకుందన్న విషయం తెలుసుకున్న విద్యార్థులు పెద్ద సంఖ్యలో సంఘటనా స్థలానికి చేరుకుని ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ ధర్నాకు దిగారు. అయితే విద్యార్థులకు మద్దతుగా అక్కడికి చేరుకున్న రాజకీయ నేతలు, విద్యార్థి నాయకులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
ప్రవళిక చనిపోవడానికి కారణం గ్రూప్ టు పోస్ట్పోన్డ్ కారణమంటూ రాజకీయ నాయకులు ఆందోళన చేసిన మొత్తం 13 మందిపై కేసులు నమోదు చేసినట్లు తెలిపారు. వారిపై ఐపిసి సెక్షన్స్ 143, 148, 341, 332 R/W 149 కింద కేసులు నమోదు చేసినట్లు వెల్లడించారు. రాజ్యసభ సభ్యుడు డాక్టర్ లక్ష్మణ్, అనిల్ కుమార్ యాదవ్, ఫిరోజ్ ఖాన్, కార్పొరేటర్ విజయ రెడ్డి, ఓయూ నేత సురేష్ యాదవ్, భాను ప్రకాష్, నీలిమ, జీవన్ లపై కేసులు నమోదు చేసిన్లు తెలిపారు. పోలీసులపై రాళ్లు రువ్వారని అభియోగాలపైన కేసులు నమోదైనట్లు తెలిపారు.
Also Read
- Revanth Reddy: మానేరు ఇసుక కొల్లగొట్టి రవీందర్రావు, సంతోష్ రావు, కేటీఆర్ రూ.కోట్లు దోచుకున్నారు: సీఎం రేవంత్
- Revanth Reddy: గత పదేళ్లు సిరిసిల్లను ఉరిసిల్లగా మార్చారు: సీఎం రేవంత్ రెడ్డి
- Veeramachineni Ramakrishna: వీరమాచినేని రామకృష్ణపై క్రిమినల్ కేసు నమోదు..
- Election Commission: వివాదం వేళ ఎన్నికల సంఘం సంచలన నిర్ణయం.. ఇక, Form-6తో ఇక Annexure-D అవసరం లేదు!
ప్రవళిక ఆత్మహత్య కేసులో నిందితుడు శివరాం రాథోడ్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వరంగల్ జిల్లా దుగ్గొండి మండలం బిక్కాజి పల్లి గ్రామానికి చెందిన ప్రవల్లిక ఈ నెల 13వ తేదీ రాత్రి హైదరాబాద్‌లోని ఓ హాస్టల్‌లో ఆత్మహత్యకు పాల్పడిన విషయం తెలిసిందే. ఈ ఘటన రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ప్రియుడి మోసం వల్లే మర్రి ప్రవల్లిక ఆత్మహత్యకు పాల్పడిందని హైదరాబాద్ చిక్కడపల్లి పోలీసులు నిర్ధారించి కేసు దర్యాప్తు చేపట్టారు. ఈ కేసులో నిందితుడిగా ఉన్న మహబూబ్ నగర్ జిల్లాకు చెందిన శివరాం తనను మోసం చేశాడని ప్రవళిక తన సోదరుడు ప్రణయ్‌కు వాట్సాప్ సందేశాల ద్వారా తెలిపింది. ఈ మేరకు ప్రణయ్ పోలీసులకు వాంగ్మూలం ఇచ్చాడు.
Minister KTR: ప్రవళిక ఫ్యామిలీ నన్ను కలిసింది.. ఆమె తమ్ముడికి ఉద్యోగం ఇస్తాం..
తాజావార్తలు
-
Shai Hope: ఇంతకంటే ఏం చేయాలి..? చాలా బాధగా ఉంది: వెస్టిండీస్ కెప్టెన్
-
Ind Vs WI: భారీ లక్ష్య ఛేదనలో చరిత్ర సృష్టించిన గిల్ సేన.. విండీస్‌పై టీమిండియా ఘన విజయం.. సిరీస్ కైవసం..
-
Shubhman Gill: డబుల్ ధమాకా.. వన్డే కెరీర్లో రెండో డబుల్ సెంచరీ బాదిన శుభ్‌మన్ గిల్..
-
Range Rover Sport Electric: రేంజ్ రోవర్ స్పోర్ట్ ఎలక్ట్రిక్ బుకింగ్స్ ఓపెన్.. ఒక్క ఛార్జ్‌తో 609 కి.మీ..
-
Team India Record: టీమిండియా రికార్డుల మోత.. 20 ఏళ్ల రికార్డు చెల్లాచెదురు..
ట్రెండింగ్
-
John Campbell Record: భారత్‌పై శివాలెత్తిన జాన్ క్యాంప్‌బెల్.. మొదటి బ్యాటర్‌గా అరుదైన రికార్డు!
-
రూ.1,100కే కొత్త ఫీచర్ ఫోన్.. 1,000mAh బ్యాటరీ, USB-C ఛార్జింగ్ తో HMD 106 Pure లాంచ్.!
-
Diwali Crackers: దీపావళి టపాసులపై సుప్రీం కీలక వ్యాఖ్యలు.. నిర్దిష్ట సమయంపై నిర్ణయం.!
-
Japanese Cleaning Tips: ఇల్లు ఎప్పుడూ నీట్‌గా ఉండాలంటే.. జపాన్ వాళ్ల ఈ 6 అలవాట్లు ఫాలో అవ్వండి..!
-
Gold Medal For India: పతకాల జోరు.. కాంపౌండ్ మిక్స్డ్ టీమ్‌లో చరిత్ర.. ఆసియా గేమ్స్‌లో భారత్‌కు మరో స్వర్ణం..!