భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలంలో విషాదం చోటుచేసుకుంది. రామాలయం సమీపంలోని ప్రైవేట్ లాడ్జిలో పురుగుల మందు తాగి ప్రేమ జంట ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. లాడ్జి సిబ్బంది వారిని వెంటనే భద్రాచలం ఏరియా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ ఆరోగ్యం విషమించి యువకుడు మృతిచెందాడు. యువతీ ప్రాణాపాయ స్థితిలో చికిత్స పొందుతోంది. మృతుడు వెస్ట్ గోదావరి జిల్లా కి చెందిన నడిపింటి రవి(35)గా గుర్తించారు. చికిత్స పొందుతున్న యువతి భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వాపురం మండలం…
శ్రీరామనవమి ఉత్సవాలకు భద్రాచలం ముస్తాబవుతోంది. శ్రీసీతారామచంద్రస్వామి వారి కళ్యాణం ఈ ఏడాది అంగరంగ వైభవంగా నిర్వహించేందుకు తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. దేశంలోనే రెండో అయోధ్యగా పేరొందిన భద్రాచలంలో స్వామివారి కల్యాణ మహోత్సవాన్ని చూసేందుకు వేలాది మంది భక్తులు వస్తుంటారు. ఈ మేరకు ఏప్రిల్ 2 నుంచి 16 వరకు శ్రీరామనవమి తిరుకల్యాణ బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తున్నారు. ఏప్రిల్ 10న శ్రీరాముల వారి కల్యాణం, 11న పట్టాభిషేకం నిర్వహించనున్నారు. కరోనా కారణంగా గత రెండేళ్లుగా స్వామి వారి కల్యాణానికి పరిమిత…
భద్రాచలంలో నిర్వహించే శ్రీసీతారాముల కల్యాణోత్సవానికి సంబంధించి గురువారం ఆన్‌లైన్‌లో టికెట్లు విడుదల చేయనున్నారు. ఈ మేరకు కల్యాణం టిక్కెట్లను పలు సెక్టార్‌లలో ఆలయ అధికారులు విక్రయించనున్నారు. కల్యాణోత్సవానికి రూ.7,500, రూ.2,500, రూ.2వేలు, రూ.వెయ్యి, రూ.150 విలువ గల టిక్కెట్లతో పాటు పట్టాభిషేకం కోసం రూ.వెయ్యి విలువ గల టిక్కెట్లను అందుబాటులో ఉంచనున్నారు. కాగా కరోనాతో గత రెండేళ్లుగా భక్తులు లేకుండానే సీతారాముల కల్యాణోత్సవం నిర్వహిస్తున్నారు. కరోనా వ్యాప్తి తగ్గిన నేపథ్యంలో భక్తుల మధ్య అంగరంగ వైభవంగా ఏప్రిల్…
దక్షిణ అయోధ్యగా ప్రసిద్ధి గాంచిన భద్రాచలంలో సీతారాముల కల్యాణ మహోత్సవానికి ముహూర్తం ఖరారైంది. ఈ మేరకు బ్రహ్మోత్సవాల షెడ్యూల్‌ను ఆలయ అధికారులు విడుదల చేశారు. ఏప్రిల్ 2 నుంచి 16 వరకు వసంత పక్ష ప్రయుక్త శ్రీరామనవమి తిరు కళ్యాణ బ్రహ్మోత్సవాలు నిర్వహించాలని వైదిక కమిటీ నిర్ణయించింది. ఏప్రిల్ 10న ఉదయం 10:30 గంటల నుంచి మధ్యాహ్నం 12:30 గంటల వరకు శ్రీ సీతారాముల కల్యాణం నిర్వహించనున్నట్లు ప్రకటించింది. ఏప్రిల్ 2న ఉగాది పర్వదినం సందర్భంగా పంచాంగ…
భద్రాచలంలోని రామయ్యను సోమవారం సాయంత్రం ఏపీ మంత్రి కొడాలి నాని కుటుంబసమేతంగా దర్శించుకున్నారు. ఈ సందర్భంగా అర్చకులు మంత్రి కొడాలి నాని కుటుంబంతో ప్రత్యేక పూజలు నిర్వహించి తీర్థప్రసాదాలను అందజేశారు. అనంతరం మంత్రి కొడాలి నాని శ్రీరాముడికి రూ.13 లక్షలు విలువ చేసే బంగారు కిరీటాన్ని కానుకగా ఇచ్చారు. ఈ మేరకు కిరీటాన్ని ఆలయ అర్చకులకు అందించారు. Read Also: సైబర్ నేరగాళ్ల వలలో డిప్యూటీ తహసీల్దార్ ప్రత్యేక పూజల అనంతరం మంత్రి కొడాలి నాని మీడియాతో…