Indra Karan Reddy : ఆయా రామ్ – గాయ రామ్ లతో తెలంగాణకు ఒరిగేదేమి లేదు
బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలతో గత రెండు రోజులగా హైదరాబాద్ నగరం బీజేపీ జెండాలతో కాషాయమయంగా మారింది. అయితే ఈ నేపథ్యంలోనే నేడు పరేడ్ గ్రౌండ్‌లో నిర్వహించిన భారీ బహిరంగ సభకు ప్రధాని మోడీ సహా వివిధ రాష్ట్రాల సీఎంలు, కేంద్రమంత్రులు, జాతీయ నాయకులు హాజరయ్యారు. అయితే గత మోడీతో బీజేపీ అధిష్టానం మొత్తం హైదరాబాద్‌కు వస్తున్న నేపథ్యంలో టీఆర్‌ఎస్ నేతలు పలు ప్రశ్నలు గుప్పించారు. వాటికి సమాధానం చెప్పాలన్నారు. అయితే అలాంటిదేమి లేకుండా సభ నిర్వహించారు బీజేపీ శ్రేణులు. దీనిపై తాజాగా మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి స్పందిస్తూ.. ఆయా రామ్ – గాయ రామ్ లతో తెలంగాణకు ఒరిగేదేమి లేదంటూ విమర్శలు గుప్పించారు. బీజేపీ ఇలాంటి పది సభలు పెట్టినా తెలంగాణ ప్రజలు నమ్మరని, పదే పదే రాష్ట్ర విభజనపై మాట్లాడుతూ తెలంగాణపై విషం కక్కుతోంది బీజేపీ అని ఆయన మండిపడ్డారు.
బీజేపీని తెలంగాణ సమాజం క్షమించదని, నీళ్లు, నిధులు, నియామకాల గురించి పదే పదే మాట్లాడడం హాస్యాస్పదంగా ఉందని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏటా రెండు కోట్ల ఉద్యోగాలిస్తామన్న మోడీ ప్రభుత్వం ఈ ఎనిమిదేళ్ళలో ఎన్ని ఉద్యోగాలు ఇచ్చిందని ఆయన ప్రశ్నించారు. ఈ ఎనిమిది ఏళ్లలో కేంద్రం తెలంగాణకు చేసింది ఏమిటో చెప్పలేదని, తెలంగాణ అభివృద్దికి ఏం చేస్తారో చెప్పకుండా బీజేపీ స్వంత డప్పుకొట్టుకుందని ఆయన విమర్శించారు. ధాన్యం కొనుగోళ్లపై పీయూష్ గోయల్ మొసలి కన్నీరు కారుస్తున్నారన్నారు.
Also Read
- TG EAPCET-2026 : షెడ్యూల్ విడుదల.. హాల్ టికెట్ల డౌన్‌లోడ్ ఎప్పుడంటే.?
- Free Bus Journey: సమ్మె వేళ వారికి భారీ ఊరట.. పురుషులకు కూడా ఉచిత బస్సు ప్రయాణం..
- TG Cabinet Meeting : రేపు తెలంగాణ కేబినెట్ భేటీ.. హైకోర్టు తీర్పుపై చర్చ
- KTR: “పీసీ ఘోష్ కాదు, ఇది పీసీసీ నివేదిక”.. బీఆర్ఎస్ వాదనే నిజమైందన్న కేటీఆర్..
తాజావార్తలు
-
Vivo X300 Ultra, Vivo X300 FE: కెమెరా కింగ్‌గా రాబోతున్న Vivo X300 సిరీస్.. రిలీజ్ డేట్ ఫిక్స్
-
CM Chandrababu: వర్మ తీరుపై ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు అసహనం..
-
Katte Pongali Recipe : టెంపుల్ స్టైల్ కట్టె పొంగలి రహస్యం ఇదే.. ఒక్కసారి తింటే వదిలిపెట్టరు.!
-
Google: గూగుల్ గురించి మీకు తెలియని క్రేజీ ఫ్యాక్ట్స్ ఇవే!
-
Tollywood Pan World Movies: అందరికీ ‘పాన్ వరల్డ్ మూవీ’నే కావాలా?
ట్రెండింగ్
-
Kitchen Cleaning Hacks: మెరిసే పాత్రల కోసం చిట్కాలు.. పింగాణీ పాత్రలపై పసుపు మరకలను వదిలించుకోండిలా.!
-
Mirchi Bajji Recipe: పర్ఫెక్ట్ గా, బండిమీద టేస్ట్ రావాలంటే మిరపకాయ బజ్జీ పిండి ఇలా కలిపి వేయండి.. లొట్టలేసుకుంటూ తినాల్సిందే.!
-
భారీ బ్యాటరీ + స్లిమ్ డిజైన్, రఫ్ & టఫ్ ఫోన్ Motorola Edge 70 Pro లాంచ్.. ధర ఎంతంటే.?
-
200MP+200MP కెమెరాలు, IP66, IP68, IP69 రేటింగ్స్, 7025mAh బ్యాటరీతో ప్రీమియం ఫోన్ OPPO Find X9s Pro లాంచ్.. ధర ఎంతంటే.?
-
కాంపాక్ట్ డిజైన్, 8000mAh బ్యాటరీతో OPPO Pad Mini లాంచ్.. ధర ఎంతంటే.?