V Hanumantha Rao: పప్పు అన్నారు, ఇప్పుడదే రాహుల్ పప్పా అయ్యాడు.. వీహెచ్ ఘాటు వ్యాఖ్యలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
V Hanumantha Rao Interesting Comments In Congress OBC Public Meeting: ఇన్నాళ్లూ పప్పు అంటూ ఎవరినైతే అవహేళన చేశారో, ఇప్పుడదే రాహుల్ గాంధీ అందరికీ పప్పా అయ్యాడంటూ కాంగ్రెస్ సీనియర్ నేత వీ హనుమంతరావు వ్యాఖ్యానించారు. దేశంలో రాహుల్‌గాంధీ గ్రాఫ్ పెరిగిందని చెప్పారు. సంగారెడ్డిలో కాంగ్రెస్ పార్టీ OBC నాయకుల సమావేశంలో వీహెచ్ మాట్లాడుతూ.. గట్టిగా కష్టపడితే కాంగ్రెస్ తప్పకుండా అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేశారు. కాంగ్రెస్‌లో చిన్న చిన్న కోపాలు, గొడవలు ఉన్నాయన్న మాట వాస్తవమేనని అన్నారు. సీనియర్లు, జూనియర్ల మధ్య విభేదాలున్నాయని పేర్కొన్నారు. సీనియర్‌పై జూనియర్ పెత్తనం చెలాయిస్తానంటే ఊరికే ఉంటారా? తమ పార్టీలోని లొల్లి కూడా అలాంటిదేనని వివరణ ఇచ్చారు.
MP Margani Bharat: పవన్ కల్యాణ్ ఊసరవెల్లి.. ఢిల్లీలో యాక్టింగ్ చేస్తున్నాడు..
Also Read
- Telangana Drought: తెలంగాణలో కరవు టెన్షన్.. ఎల్‌నినో ప్రభావంపై సీఎం రేవంత్ రెడ్డి ఫోకస్
- Bathukamma : రంగురంగుల పువ్వులతో విరబూసిన మార్కెట్లు.. భగ్గుమంటున్న ధరలు
- RIMS infant Deaths : రిమ్స్‌లో ఐదుగురు శిశువుల మృతి.. ఎలుకలు ఏసీ వైర్లు కొరకడంతోనే ప్రమాదం..
- Uppal T20 Match : ఉప్పల్ టీ20 టికెట్ల గోల్మాల్.. ఆన్లైన్లో సోల్డ్ ఔట్, హెచ్‌సీఏ ఏమంటోంది.?
కాంగ్రెస్ నేతలను కేసీఆర్ బంగాళాఖాతంలో వేస్తానని అంటున్నారని.. జనం నిన్నే బంగాళాఖాతంలో వేస్తారని వీహెచ్ పేర్కొన్నారు. సోనియా గాంధీ తెలంగాణ రాష్ట్రం ఇవ్వకుంటే.. నాంపల్లి దర్గా దగ్గర ‘అల్లాకే బాబా దేదో’ అంటూ అడుక్కునేవాడివి అని ఎద్దేవా చేశారు. అన్నం పెట్టినోనికి కేసీఆర్ సున్నం పెడతాడని విమర్శించారు. ఈసారి రాహుల్ గాంధీ తప్పకుండా ప్రధాని అవుతాడని, లేకపోతే తన పేరు హనుమంతరావు కాదని ఛాలెంజ్ చేశారు. ఏడాదికి 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తానన్న మోడీ.. ఒక్క ఉద్యోగం కూడా ఇవ్వలేదని దుయ్యబట్టారు. అదానికి, మోడీకి సంబంధం ఏంటని ప్రశ్నిస్తే.. రాహుల్‌పై కక్ష సాధింపు చర్యలు తీసుకున్నారని మండిపడ్డారు. నేతలు కాంగ్రెస్‌లో ఉంటే అవినీతిపరులు, బీజేపీలో చేరితే సత్యహరిశ్చంద్రులా? అని నిలదీశారు. త్వరలోనే బీసీ గర్జన పెడతామని.. ఇందుకు థాక్రే, రేవంత్ రెడ్డి, భట్టి విక్రమార్క ఒప్పుకున్నారని తెలిపారు.
Uttarakhand: ఉత్తరాఖండ్లో పేలిన ట్రాన్స్‌ఫార్మర్.. 16 మంది మృతి
కేవలం అగ్ర కులాలకే కాదు, రిక్షా తొక్కేవాడికి కూడా టాలెంట్ ఉంటుందని వీహెచ్ చెప్పారు. అగ్రకులాల వాళ్ళు OBCలను అణగదొక్కుతున్నారని ఆరోపించారు. రాహుల్ తన జోడో యాత్రలో భాగంగా అన్ని వర్గాల వారిని కలిశారన్నారు. కొందరు లేస్తే బీసీలకు 50 శాతం రిజర్వేషన్ అంటున్నారని.. మొదట 20 శాతం తెచ్చుకొని, ఆ తర్వాత 50 శాతం గురించి ఆలోచిద్దాం హితవు పలికారు. ప్రతి పార్లమెంట్ పరిధిలో మూడు ఎమ్మెల్యే సీట్లు ఇవ్వాలని అడుగుతున్నామన్నారు. తానెవ్వరికీ వ్యతిరేకం కాదని, తమ హక్కుల కోసం తాము పోరాడుతున్నామని స్పష్టం చేశారు. ఫైనల్‌గా తాను సోనియాగాంధీ, రాహుల్ గాంధీ మాట మాత్రమే వింటానన్నారు. ఆప్ కీ బార్ కిసాన్ సర్కార్ అని చెప్పే కేసీఆర్, అదే రైతుల్ని జైల్లో వేయిస్తున్నాడని ఆరోపించారు.
తాజావార్తలు
-
3D ఎఫెక్ట్‌తో మెకానికల్ లుక్.. లిక్విడ్ కూలింగ్ సిస్టమ్‌తో భారత్‌లోకి Infinix GT 50 Pro..!
-
Ranabaali Trailer: ‘రణబాలి’ ట్రైలర్‌పై మంత్రి లోకేష్ రివ్యూ!
-
కొత్త అల్లాయ్ వీల్స్, అప్డేటెడ్ లుక్ తో Toyota Fortuner 2026 Leader ఎడిషన్ లాంచ్.. ధర ఎంతంటే.?
-
AP Cabinet Meeting: ఏపీ కేబినెట్ ప్రత్యేక భేటీ.. పవన్ కల్యాణ్ సహా జనసేన మంత్రుల డుమ్మా..
-
IPL 2027-CSK: సీఎస్కేలో ఏం జరుగుతోంది.. మొన్న ఇద్దరు, ఇవాళ మరొక కోచ్ అవుట్!
ట్రెండింగ్
-
IND vs WI: 249 పరుగులు చేసినా ఓటమి తప్పలేదు.. భారత్ కొంపముంచిన 5 కారణాలు ఇవే!
-
Hair Combs Cleaning: ₹1 ఖర్చుతో దువ్వెనలను ఇలా క్లీన్ చేయండి.. మీ జుట్టుకు చేరే మురికి, బ్యాక్టీరియా మాయం.!
-
Crispy Snacks: నూనెను ఎక్కువగా పీల్చుకోకుండా బొంబాయి రవ్వతో ‘క్రిస్పీ బైట్స్’.. తినడం మొదలు పెడితే గిన్నె ఖాళీ కావాల్సిందే.!
-
How to Get Rid of Lizards at Home: ఇంట్లో బల్లులు ఎక్కువగా ఉన్నాయా? ఈ సింపుల్ చిట్కాలతో తరిమేయండి!
-
50MP కెమెరా, 32MP సెల్ఫీ షూటర్, 10,200mAh బ్యాటరీతో Vivo Y600s Pro లాంచ్.!