IndrakaranReddy:అన్ని హంగులతో సమీకృత కలెక్టరేట్ కార్యాలయం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
అన్ని హంగులతో సమీకృత కలెక్టరేట్ కార్యాలయాన్ని తీర్చిదిద్దాలని అటవీ, పర్యావరణ శాఖ మంత్రి ఇంద్రకకరణ్ రెడ్డి అధికారులను ఆదేశించారు. సోమవారం నిర్మల్ జిల్లా నూతన సమీకృత కలెక్టరేట్ సముదాయ భవన నిర్మాణ పనులు జరుగుతున్న తీరును మంత్రి పరిశీలించారు. పనుల పురోగతి ఏ దశలో ఉన్నాయనేదానిపై అధికారులతో సమీక్ష నిర్వహించారు.
ఐడీఓసీ భవన నిర్మాణంలో భాగంగా ఉద్యాన పనులను, అప్రోచ్ రోడ్, కాంపౌండ్ వాల్, ఆర్చి పనులు వేగవంతం చేయాలని ఆదేశించారు. కార్యాలయంలో ఉద్యోగులకు, ఆయా పనుల నిమిత్తం వచ్చే ప్రజలకు ఇబ్బందులు కలగకుండా అవసరమైన సౌకర్యాలన్ని కల్పించాలన్నారు. తాగునీటి వసతి, టాయిలెట్స్ తదితర వసతులన్నీ కల్పించాలని ఆయన సూచించారు.
Also Read
కలెక్టరేట్ ఆవరణలో పచ్చదనం కోసం మొక్కలు నాటాలన్నారు. ఆగస్టు 15 లోగా పనులన్ని పూర్తి చేయాలని అధికారులకు లక్ష్యాన్ని నిర్దేశించామన్నారు. సీఎం కేసీఆర్ చేతుల మీదుగా ఐడీఓసీ భవనాన్ని ప్రారంభించనున్నట్లు మంత్రి తెలిపారు.
అప్రోచ్ రోడ్, ఇతర సుందరీకరణ పనులు పూర్తయితే నిర్మల్ పట్టణానికి దీని వల్ల అదనపు హంగులు వస్తాయని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో రోడ్లు భవనాల శాఖ ఇంజినీర్ ఇన్ చీఫ్ గణపతి రెడ్డి, కలెక్టర్ ముషారఫ్ ఫారూఖీ అలీ, తదితరులు పాల్గొన్నారు.
తాజావార్తలు
-
డిజైన్, ఫీచర్లలో భారీ అప్డేట్స్ తో సెప్టెంబర్ 5న రాబోతున్న Maruti Baleno Facelift..!
-
PM Modi’s Saptdhara Vision: వికసిత్ భారత్ కోసం ‘సప్తధార’.. మోడీ చెప్పిన 7 కీలక శక్తులివే..
-
Venky Atluri: త్రివిక్రమ్ ఛాయలు.. వెంకీ అట్లూరి రైటింగ్‌పై సోషల్ మీడియాలో ప్రశంసల జల్లు
-
కొత్త పికప్ ట్రక్ Mahindra Scorpio Lifestyler వచ్చేస్తోంది.. ధర, ఫీచర్లు ఇవే!
-
Red Fort: ఎర్రకోట ఎందుకు అంత ముఖ్యమైంది? మొఘలుల నుంచి బ్రిటిష్ వరకు.. చరిత్రలోని ఆసక్తికర నిజాలు
ట్రెండింగ్
-
48dB ANC, AI మీటింగ్ సమ్మరీ.. భారత్‌లో POVA AI Buds Pro లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే!
-
Healthy Snacks : నల్లగా మారిన అరటిపండ్లు పారేయొద్దు.. ఇలా చేస్తే అదిరిపోయే టేస్టీ డెజర్ట్స్.!
-
Nagarjuna Akkineni: నేను సైబర్ క్రైమ్ బాధితుడినే.. నాలుగేళ్ల క్రితం మోసపోయా.. ఆసక్తికర విషయాలు చెప్పిన కింగ్!
-
Shridhar Chillal: మూడు అంతస్తుల భవనం కంటే పొడవైన గోర్లు.. గిన్నిస్ బుక్ లో స్థానం.!
-
Income Tax Refund 2026: ఐటీఆర్ రీఫండ్ ఇంకా రాలేదా?.. వెంటనే ఈ 3 అంశాలు సరిచూసుకోండి..