అన్ని హంగులతో సమీకృత కలెక్టరేట్ కార్యాలయాన్ని తీర్చిదిద్దాలని అటవీ, పర్యావరణ శాఖ మంత్రి ఇంద్రకకరణ్ రెడ్డి అధికారులను ఆదేశించారు. సోమవారం నిర్మల్ జిల్లా నూతన సమీకృత కలెక్టరేట్ సముదాయ భవన నిర్మాణ పనులు జరుగుతున్న తీరును మంత్రి పరిశీలించారు. పనుల పురోగతి ఏ దశలో ఉన్నాయనేదానిపై అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఐడీఓసీ భవన నిర్మాణంలో భాగంగా ఉద్యాన పనులను, అప్రోచ్ రోడ్, కాంపౌండ్ వాల్, ఆర్చి పనులు వేగవంతం చేయాలని ఆదేశించారు. కార్యాలయంలో ఉద్యోగులకు, ఆయా పనుల…