Harish Rao: కేన్సర్ మహమ్మారి నుండి ప్రజల్ని కాపాడేందుకు ప్రభుత్వం మూడంచెల వ్యూహం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Harish Rao: కేన్సర్ మహమ్మారి నుండి ప్రజల్ని కాపాడేందుకు ప్రభుత్వం మూడంచెల వ్యూహం అనుసరిస్తున్నామని ఆర్థిక, వైద్య ఆరోగ్యశాఖ మంత్రి హరీష్ రావు అన్నారు. నెక్లెస్ రోడ్ లోని జలవిహార్ వద్ద వరల్డ్ బ్రెస్ట్ కేన్సర్ నెల సందర్బంగా నిర్వహిస్తున్న అవగాహన వాక్, మారథాన్ జెండా ఊపి మంత్రి హరీష్ రావు ప్రారంభించారు. మారిన జీవిన శైలి, మారిన ఆహార అలవాట్లు తదితర కారణాల వల్ల చిన్న తనంలోనే రోగాల బారిన పడుతున్నారు. ప్రపంచాన్ని భయపెడుతున్న రొమ్ము కేన్సర్ విషయంలో ఇదే జరుగుతుందని అన్నారు. ఒకప్పుడు పెద్ద వయస్సులో మాత్రమే కనిపించే ఈమహమ్మారి నేడు 30 – 40 ఏళ్ల వయస్సు వారి లోనూ ఇది కనిపిస్తుందని తెలిపారు. గత పదేళ్ళలో చూస్తే మన దేశంలో బ్రెస్ట్ క్యాన్సర్ కేసులు ఎక్కువగా పెరుగుతున్నాయి. గర్భాశయ క్యాన్సర్ కంటే ఇవే ఎక్కువగా ఉంటున్నాయని హరీష్ రావ్ అన్నారు. 40 – 50 సంవత్సరాల మధ్య వయస్సు గల మహిళలు ఎక్కువగా రొమ్ము కేన్సర్ బారిన పడుతున్నారని తెలిపారు. వ్యాధికి సంబంధించిన అవగాహన లేకపోవడం కారణంగా అడ్వాన్స్డ్ స్టేజ్ లో నిర్ధారణ జరుగుతున్నది. దీంతో చికిత్స అందించడం కష్టంగా ఉంటున్నది. 70 శాతం కేసుల విషయంలో ఇలా జరుగుతున్నట్లు గణాంకాలు చెబుతున్నాయి. ముందుగా గుర్తిస్తే వంద శాతం ప్రాణాలు కాపాడవచ్చు. భారతదేశంలో ప్రతి సంవత్సరం లక్షా 80 వేల కొత్త కేసులు నమోదవుతున్నాయని అంచనా ఉండగా, ఆలస్యంగా గుర్తించడం, సకాలంలో చికిత్స అందక పోవడం కారణంగా ఇందులో 50 శాతం దాకా మంది ప్రాణాలు కోల్పోతున్నారు.
అమెరికాలో అయితే జీవిత కాలంలో ప్రతి 8 మంది మహిళల్లో కనీసం ఒకరు రొమ్ము కేన్సర్ బారిన పడుతున్నట్లు అధ్యయనాలు చెబుతున్నాయన్నారు. బయటికి వెళ్తే జంక్ ఫుడ్, విస్తృతంగా ప్లాస్టిక్ వినియోగం, శారీరక శ్రమ లేకపోవడం.. ఇలా అనేక అంశాలు కారణం అవుతున్నాయి. మహిళల్లో కాన్సర్ వ్యాప్తి ఎక్కువగా ఉన్నట్లు పలు అధ్యయనాలు చెబుతున్నాయి. బ్రెస్ట్, సర్వైకల్ క్యాన్సర్ బారిన ఎక్కువ మంది పడుతున్నారు. తెలంగాణలోని కేన్సర్ కేసులు పెరుగుతున్నాయన్నారు. పట్టణ జనాభాలో రొమ్ము క్యాన్సర్, ఊపిరితిత్తులు, గర్భాశయం,అన్నవాహిక క్యాన్సర్లు పెరుగుతున్నాయని అన్నారు. అయితే ఈ మహమ్మారి నుండి కాపాడుకోవడం మన చేతుల్లోనే ఉందని, ఈ భయంకరమైన వ్యాధి నుండి మరింత మంది ప్రాణాలను కాపాడటానికి ముందస్తు నిర్ధారణ ఒక్కటే మార్గం. ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దెన్ క్యూర్ అని హరీష్ రావ్ అన్నారు. ముఖ్యంగా రొమ్ము కేన్సర్ విషయంలో, ఆలస్యంగా పెళ్లి చేసుకోవడం, బిడ్డకు పాలివ్వకపోవడం, కుటుంబ ఆరోగ్య చరిత్ర, అధిక బరువు కలిగి ఉండటం, దూమపానం, మద్య పానం వంటి చెడు అలవాట్లు కారణంగా మహిళలో రొమ్ము కేన్సర్ వస్తున్నట్లు అధ్యయనాలు చెబుతున్నాయి. రొమ్ము కేన్సర్ పై అవగాహనతో ఉండటం, మామో గ్రామ్ పరీక్షలు చేయించుకోవటం, కనీస వ్యాయామం, మంచి జీవన శైలి అలవాటు చేసుకోవటం వల్ల దీని బారి నుండి కాపాడుకోవచ్చు.
Also Read
- CM Revanth Reddy: గోవాలో బీజేపీపై రేవంత్ రెడ్డి ఫైర్.. ‘ప్రాపర్టీ సావంత్’ అంటూ సెటైర్లు!
- El Nino : తెలంగాణలో కరువు ముప్పు.. రెండో పంట వేయొద్దంటూ మంత్రి కీలక విజ్ఞప్తి
- Indigo : పవర్ బ్యాంక్‌లో మంటలు.. శంషాబాద్‌లో ఇండిగో విమానం ఎమర్జెన్సీ ల్యాండింగ్
- Brilliance AI : విద్యార్థుల చదువుకు ఏఐ సాయం.. హైదరాబాద్‌లో కొత్త సాఫ్ట్వేర్
Read also: Madhya Pradesh: బిర్యానీతో పార్టీ బలం పెంచుకునేందుకు ఎంఐఎం ప్లాన్..
ప్రాథమిక దశలోనే రోగ నిర్ధారణ జరగటం వల్ల త్వరగా చికిత్స పొంది వంద శాతం రోగం నయం చేసుకోవటం సాధ్యం అవుతుంది. కాన్సర్ నియంత్రణ పట్ల ప్రత్యేక శ్రద్ధ వహించింది. ముందుగా గుర్తించడం, క్యాన్సర్ వచ్చిన వారికి మెరుగైన చికిత్స అందించడం.. వారిని కాపాడుకోవడం లక్ష్యంగా పని చేస్తుందని తెలిపారు. కేన్సర్ మహమ్మారి నుండి ప్రజల్ని కాపాడేందుకు ప్రభుత్వం మూడంచెల వ్యూహం అనుసరిస్తున్నది. ఇందులో భాగంగా.. మొబైల్ స్క్రీనింగ్ ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో నిర్ధారణ పరీక్షలు నిర్వహిస్తున్నాం. లక్షణాలు ఉన్నవారిని గుర్తించి చికిత్స అందిస్తున్నాం. ఒక్కో నెలలో సగటున 6 క్యాంపులు పెడుతూ, సగటున 600 నుండి 800 మందికి పరీక్షలు చేస్తున్నాము. నిర్ధారణ అయినా వారిని మెరుగైన చికిత్స కోసం MNJ ఆసుపత్రికి పంపిస్తున్నాము. ఇక చికిత్స విషయంలో ప్రభుత్వం పెద్ద మొత్తంలో ఖర్చు చేస్తున్నది. క్యాన్సర్ చికిత్స పై తెలంగాణ ఏర్పడినప్పటి నుండి ఇప్పటి వరకు ప్రభుత్వం రు. 750 కోట్లు ఖర్చు చేసిందని తెలిపారు. తెలంగాణ ప్రభుత్వం అన్ని రకాల కేన్సర్ లకు సమగ్రమైన కేన్సర్ చికిత్సలు అందిస్తున్నది.
సర్జికల్, రేడియేషన్, మెడికల్ ఆంకాలజి, బ్లడ్ కేన్సర్, బోన్ మారో ట్రాన్స్ ప్లాంట్, పాలియేటివ్, మొబైల్ స్క్రీనింగ్.. ఇలా 10 రకాల కార్యక్రమాలు చేస్తున్నది. MNJ, నిమ్స్ ఆసుపత్రులు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న క్యాన్సర్ రోగులకు అవసరమైన చికిత్స అందించుతున్నాయి. కేన్సర్ రోగులకు మెరుగైన, అధునాతనమైన వైద్యం అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం పెద్ద పీట వేస్తున్నది. ఇందులో భాగంగా MNJ లో కొత్తగా 30 కోట్లతో 8 మాడ్యులర్ థియేటర్లు ప్రారంభించుకున్నం. ఇందులో ఒకటి రోబోటిక్ థియేటర్ కావడం విశేషం. MNJ ఆసుపత్రినీ రు. 120 కోట్లతో స్టేట్ కాన్సర్ సెంటర్ గా అభివృద్ది చేసేందుకు చర్యలు తీసుకుంటున్నాము. పేషెంట్లు పెరుగుతున్న నేపథ్యంలో పడకల సంఖ్యను 450 నుండి 750 కి పెంచుకుంటున్నము. నాలుగు ఎకరాల స్థలంలో 5 అంతస్తుల కొత్త భవనం ఏర్పాటు చేసుకున్నము. త్వరలో ప్రారంభించుకోబోతున్నాం. ప్రైవేటులో 20 లక్షల దాకా విలువ చేసే బోన్ మారో ట్రాన్స్ ప్లాంట్ చికిత్సలను ప్రభుత్వం ఆరోగ్య శ్రీ కింద ఉచితంగా అందిస్తున్నది. రేడియో థెరపీ, కీమో థెరపీ చికిత్సలను ఉచితంగా అందిస్తుందని మంత్రి హరీష్ రావ్ అన్నారు.
Rajinikanth: పదేళ్ల తర్వాత యంగ్ హీరో సినిమాలో రజనీ గెస్ట్ రోల్
తాజావార్తలు
-
Nitish Reddy: మా కెప్టెన్ వికెట్ తియ్యొద్దన్నాడు.. నితీష్ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు!
-
T20I World Record: వెస్టిండీస్ సరికొత్త వరల్డ్ రికార్డు.. చరిత్రకు మూడు సిక్సర్ల దూరంలో భారత్.!
-
India Plan: అదిరిపోయిన గంభీర్, శ్రేయస్ అయ్యర్ ప్లాన్.. రెండో టీ20 ఓటమి నుంచి మూడో టీ20లో గెలుపుకు పాటించిన సూత్రం ఇదే..
-
Monday Horoscope: సోమవారం దిన ఫలాలు.. ఆ రాశుల వారికి అన్ని శుభాలే, ఊహించని..!
-
INDIA Bloc: నేడు సుప్రీం కోర్టుకు విపక్ష నేతలు పాదయాత్ర.. భద్రత కట్టుదిట్టం
ట్రెండింగ్
-
Boat Sinks: ఘోర పడవ ప్రమాదం.. 15 మంది చిన్నారులు సహా 109 మంది మృతి.!
-
Wife for Hire : అద్దె భార్యలు.. లక్షల నుంచి కోట్ల వరకు ఒప్పందాలు
-
Most Intelligent: 12 ఏళ్ల వయసుకే 180 IQ.. ఐన్‌స్టీన్‌ను మించిన భారతీయ బాలమేధావి..
-
Lunch Recipes: ఇంటికి చుట్టాలొస్తే కంగారేలా.? చిటికెలో సులువుగా చేసుకోగల రకరకాల కమ్మని కూరలు ఇదిగో..!
-
EPFO Update: పీఎఫ్ డబ్బుల డ్రాపై ఈపీఎఫ్ఓ కొత్త రూల్.. ఇకపై ఆ ఫారమ్‌లు పనిచేయవు!