కొల్లాపూర్ కు చెందిన పలు పార్టీలకు చెందిన నేతలు మంత్రి హరీష్ రావు సమక్షంలో బీఆర్ఎస్ పార్టీలో జాయిన్ అయ్యారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్ రెడ్డి, గువ్వల బాలరాజు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి హరీశ్ రావు మాట్లాడుతూ.. తెలంగాణ కాంగ్రెస్ డిక్లరేషన్లకు విలువ లేదు అని ఆయన పేర్కొన్నారు. కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలు అమలు చేయడం లేదు అని ఆయన అన్నారు.
Read Also: Nandamuri Tarakaratna: ఈ సంతోష సమయంలో మీరు ఉంటే .. తారకరత్న భార్య ఎమోషనల్
2009 ఎన్నికల్లో పెట్టిన ఏ ఒక్క హామీని కాంగ్రెస్ అమలు చేయలేదు అని మంత్రి హరీశ్ రావు అన్నారు. అంబేద్కర్ ను ఓడించిన పార్టీ కాంగ్రెస్ పార్టీ.. దళితులపై కాంగ్రెస్ పార్టీది కపట ప్రేమ ఆయన తెలిపారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే మూడు గంటల కరెంట్ ఇస్తారు అని మంత్రి చెప్పుకొచ్చారు. కాంగ్రెస్ ఉచిత కరెంట్ అని.. ఉత్త కరెంట్ చేశారు.. మ్యానిఫెస్టోలో చెప్పనవి.. చెప్పినవి చేసింది కేసీఆర్ మాత్రమే అని మంత్రి హరీశ్ రావు అన్నారు.
Read Also: Mukesh Ambani: డిసెంబర్ నాటికి దేశమంతా జియో 5జీ.. “జియో ఎయిర్ ఫైబర్” లాంచింగ్ డేట్ ఫిక్స్..
కొల్లాపూర్ లో గులాబీ జెండా ఎగురేయాలి.. పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్ట్ తో ఈ సీజన్ లో సాగునీరు అందిస్తామని మంత్రి హరీశ్ రావు అన్నారు. మళ్ళీ వచ్చేది బీఆర్ఎస్ గవర్నమెంట్ అంటున్నారు.. ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో ఇప్పుడు ఐదు మెడికల్ కాలేజీలు ఉన్నాయి.. కేసీఆర్ హయాంలో కొల్లాపూర్ అభివృద్ధి చెందింది అని మంత్రి హరీశ్ రావు అన్నారు. తెలంగాణ ప్రజల కోసమే కేసీఆర్ కష్టపడుతున్నాడని ఆయన పేర్కొన్నారు.