కరోనా కట్టడికి నాయకులు, అధికారులు కలిసి పని చేయాలి: మంత్రి హరీష్రావు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కరోనాను ఎదుర్కొనేందుకు రాష్ట్రవ్యాప్తంగా ఫీవర్ సర్వేను రాష్ట్రప్రభుత్వం చేపట్టిన సంగతి తెల్సిందే.. సిద్ధిపేట పట్టణంలోని పలువార్డుల్లో ఇంటింటి ఫీవర్ సర్వేలో ఆరోగ్య శాఖ మంత్రి హరీష్ రావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రతి ఇంటిలోని అదరిని టీకా తీసుకున్నారా లేదా అని మంత్రి హరీష్ రావు అడిగి తెలుసుకున్నారు. కరోనా కట్టడికి నాయకులు, అధికారులు కలిసి పనిచేయాలని మంత్రి సూచించారు. నిన్న ఒక్క రోజే 12 లక్షల మందికి పరీక్షలు చేశారు వైద్యాధికారులు. హోమ్ కిట్ ద్వారా కరోనా లక్షణాలు పోతున్నాయని మంత్రి తెలిపారు. ప్రతిరోజు వారీ ఆరోగ్య స్థితిని తెలుసుకునేందుకు వైద్యులు పరీక్షలు నిర్వహిస్తారన్నారు. అన్ని రకాల వైద్యం చేస్తారన్నారు. 5 నుండి 8 వారాలు ఈ సర్వే చేయిస్తారని మంత్రి తెలిపారు. లైన్ ఎక్కువగా ఉన్న చోట్ల మరిన్ని సెంటర్లను పెంచుతామని హరీష్ రావు పేర్కొన్నారు.
Read Also: ఆర్ఎఫ్సీఎల్లో సాంకేతికలోపం.. కరోనా కారణంగా ఉత్పత్తి నిలిపివేత
Also Read
- CM Revanth Reddy : పాలమూరుకు జలకళ.. పెండింగ్ ప్రాజెక్టులన్నీ పూర్తి చేస్తాం
- CM Revanth Reddy : పాలమూరు వెనుకబాటుతనానికి గత ప్రభుత్వమే కారణం..
- విద్యార్థులకు గుడ్న్యూస్.. విడుదలైన TG PGECET 2026 ఫలితాలు.!
- Bolla Brahmanayudu : గండిపేట భూముల స్కామ్లో బిగ్ ట్విస్ట్.. ప్రధాన నిందితుడు బ్రహ్మనాయుడు అరెస్ట్!
మందుల ద్వారా కరోనాను ఎదుర్కొగలిగినప్పటికీ ప్రతి రోజు సర్వే చేస్తున్నాం, నీతి ఆయోగ్ కూడా తెలంగాణ ప్రభుత్వం చేస్తున్న సర్వే పట్ల సంతోషం వ్యక్తం చేసిందని మంత్రి హారీష్ రావు పేర్కొన్నారు. పిల్లలు కోసం ప్రత్యేక, పెద్దల కోసం ప్రత్యేక వార్డులను లాంఛనంగా ఏర్పాటు చేశామన్నారు.కోటికి పైగా హోమ్ కిట్లను ప్రభుత్వం సిద్ధం చేసిందన్నారు. ప్రతి గ్రామంలో కిట్లను రెడీ చేశాం. ప్రజల ఆరోగ్యం కోసమే ప్రభుత్వం పనిచేస్తుందన్నారు. 370 మెట్రిక్ టన్నుల ఆక్సిజన్ రెడీగా ఉంచాం. రాష్ర్టంలో ఎక్కడ కూడా డాక్టర్లు ఖాళీ లేకుండా ఖాళీలను పూర్తి చేయాలని సీఎం కేసీఆర్ ఆదేశించారని మంత్రి వెల్లడించారు. ప్రజలు ఎవరు నిర్లక్ష్యంగా ఉండొద్దు. ఆశా కార్యకర్తలకు సమాచారం అందించి వారి సేవలను వినియోగించుకోవాలన్నారు. ప్రతి ఒక్కరూ వ్యాక్సిన్ వేసుకోవాలని, దీనివల్ల ఎలాంటి ప్రాణ హాని ఉండదని మంత్రి తెలిపారు. సర్వేలో పాల్గొన్న అధికారులందరికీ మంత్రి కృతజ్ఞతలు తెలిపారు.
తాజావార్తలు
-
Iran: యురేనియం బదిలీపై ఇరాన్ సంచలన నిర్ణయం.. పాక్కు కీలక సమాచారం!
-
Ants Control Tips : ఇంట్లో చీమల దండయాత్రా..? మీకు తెలియకుండానే చేస్తున్న ఈ తప్పులే కారణం.!
-
Arunachal Pradesh: ‘‘ఇది 1962 కాదు’’.. చైనాకు అరుణాచల్ సీఎం హెచ్చరిక..
-
PM Surya Ghar: సోలార్ విద్యుత్ దిశగా దేశం.. 40 లక్షల ఇళ్లకు చేరిన ‘పీఎం సూర్య ఘర్’ పథకం
-
Delimitation Bill: బీజేపీకి ఇదే మంచి సమయం.. టీఎంసీ సంక్షోభం, డీఎంకే అసంతృప్తి.. “డీలిమిటేషన్ బిల్లు” పై ఫోకస్..
ట్రెండింగ్
-
Career Growth : AI ప్రపంచంలో రాణించాలంటే.. ఈ 4 నైపుణ్యాలు నేర్చుకోండి
-
WhatsApp: మీ వాట్సాప్ చాట్స్ సురక్షితమేనా.? ఈ ఒక్క సెట్టింగ్ ఆన్ చేస్తే సేఫ్.!
-
Rajma Chawal: క్విక్ అండ్ హెల్దీ మీల్.. “రాజ్మా రైస్”తో హై ప్రోటీన్ లంచ్.!
-
HONOR Magic V6 లాంచ్.. కేవలం 8.75mm మందం, 6660mAh భారీ బ్యాటరీతో ఫోల్డబుల్ ఫ్లాగ్షిప్.!
-
Healthy Parenting Tips : పిల్లల ఎత్తు పెరగడం లేదా? తల్లిదండ్రులు తప్పక తెలుసుకోవాల్సిన పోషకాహార రహస్యాలు.!