Harish Rao: మీటర్లు పెట్టలేదని 30వేల కోట్ల రూపాయలు ఇవ్వడం లేదు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Harish Rao: మీటర్లు పెట్టలేదని 30వేల కోట్ల రూపాయలు ఇవ్వడం లేదని మంత్రి హరీష్ రావు మండిపడ్డారు. సిద్దిపేట జిల్లా నంగునూర్ మండలం సిద్దన్నపేట మార్కెట్ యార్డ్ లో వడ్ల కొనుగోలు కేంద్రాన్ని జిల్లా కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్ తో కలిసి ఆయన ప్రారంభించారు. ఢిల్లీలోని బీజేపి ప్రభుత్వం వడ్లు కొనమంటే కొంటలేదని ఆరోపించారు. నూకలు బుక్కమని ఉచిత సలహా ఇస్తుందని మండిపడ్డారు. లక్ష మెట్రిక్ టన్నుల వరి ధాన్యం తెలంగాణలో పండుతున్నాయని గుర్తు చేశారు. దేశానికి అన్నం పెట్టే ధాన్యగారంగా తెలంగాణ మారిందని హరీష్ రావ్ అన్నారు.
read also: Twitter: ట్విట్టర్ యూజర్లకు ఎలాన్ మస్క్ మరో షాక్.. ఈ 3 ఫీచర్ల కోసం ఛార్జీలు చెల్లించాలి..!
Also Read
- TPCC Mahesh Goud : ఉప ఎన్నికలైనా గెలుపు మనదే.. మహేష్ గౌడ్ ధీమా
- Bhatti Vikramarka : తెలంగాణ టార్గెట్ ఫిక్స్.. 2047 నాటికి $3 ట్రిలియన్..!
- HMWSSB: తాగునీటిని వృథా చేస్తే ఫైన్.. ఫిర్యాదు చేయడానికి వాట్సాప్ నంబర్ ఇదే..
- Kishan Reddy: కాంగ్రెస్, బీఆర్ఎస్కు హైకోర్టు తీర్పు చెంపపెట్టు.. కేంద్ర మంత్రి కీలక వ్యాఖ్యలు..
బీజేపీ బోర్ బావుల వద్ద మీటర్లు పెట్టమని చెపితే పెట్టలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. మీటర్లు పెట్టలేదని 30వేల కోట్ల రూపాయలు ఇవ్వడం లేదని కేంద్రంపై నిప్పులు చెరిగారు. FCI నుంచి రావాల్సిన డబ్బులు రాకున్నా వరి ధాన్యాన్ని రాష్ట్రం కొంటుందని అన్నారు. ఇక రైతులకు కొనుగోలు కేంద్రాల్లో ఇబ్బందులు లేకుండా అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామన్నారు. ఇక, క్వింటాల్‌కు రూ. 2,060 గా నిర్ణయించామని, ధాన్యం కొనుగోలు చేసిన రెండు రోజుల్లో రైతుల ఖాతాల్లో డబ్బులు జమ చేస్తామని చెప్పారు. గతంలో ఎప్పుడు కూడా ఇంత పంట పండలేదన్నారు. వడ్లు కొనమంటే బీజేపీకి చేతకాదు కానీ, రూ. 100ల కోట్లు పెట్టి ఎమ్మెల్యేలను కొంటోందని మండిపడ్డారు. అయితే.. ఆయిల్ పామ్ సాగుకు రైతులు ముందుకు రావాలని ఈ సాగు లాభదాయకంగా ఉంటుందని మంత్రి హరీశ్‌రావు చెప్పారు.
ఆ సినిమాల కోసం బరువు పెరిగిన హీరోయిన్లు వీరే..
తాజావార్తలు
-
Imran Khan: ‘‘బ్రిటన్ జోక్యం చేసుకోవాలి’’.. ఇమ్రాన్‌ఖాన్‌పై యూకే మాజీ ప్రధాని కీలక వ్యాఖ్యలు..
-
Polavaram District: పోలవరం జిల్లాలో తీవ్ర విషాదం.. పురాతన బావిలో మృతదేహం..
-
Netherlands: విమానం గాల్లో ఉండగా పేలిన పవర్ బ్యాంక్.. షాకైన ప్రయాణికులు.. ఆ తర్వాత ఏమైందంటే..!
-
Asian Games 2026 : ఆసియా క్రీడలు షురూ.. త్రివర్ణ పతాకంతో మెరిసిన మను భాకర్, పవన్ సెహ్రావత్!
-
DUSU Elections 2026: చెప్పులు లేకుండా ప్రచారం.. ABVP, NSUIలను చిత్తుగా ఓడించిన దీపాంశు షోకీన్..
ట్రెండింగ్
-
Curd in Fridge: ఫ్రిజ్‌లో పెరుగు పెట్టారా? ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు తినొద్దు..
-
Pat Cummins: కోహ్లీ, రోహిత్ కాదు.. అతడే వెరీ టఫ్.. వికెట్ ఇవ్వకుండా విసిగించేవాడు!
-
Gautam Gambhir: నా కోచింగ్ కెరీర్లోనే అదే కఠిన నిర్ణయం.. అతడు చాలా ఏడ్చాడు.. గంభీర్ షాకింగ్ కామెంట్స్!
-
iPhone 18 India Sales: ఐఫోన్ 18 కోసం 12 గంటల పాటు స్టోర్ల వద్ద క్యూ.. తొలి రోజే రికార్డ్ స్థాయి అమ్మకాలు..!
-
బడ్జెట్లో Kia Carens Clavis ఆటోమేటిక్.. కొత్త వేరియంట్స్ వచ్చేశాయి.!