Twitter: ట్విట్టర్ యూజర్లకు ఎలాన్ మస్క్ మరో షాక్.. ఈ 3 ఫీచర్ల కోసం ఛార్జీలు చెల్లించాలి..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Twitter’s Elon Musk plans to charge you for 3 major and basic features: ట్విట్టర్‌ని హస్తగతం చేసుకున్న తర్వాత షాకుల మీద షాక్‌లు ఇస్తున్నాడు కొత్త బాస్ ఎలాన్ మస్క్. 44 బిలియన్ డాలర్ల భారీ డీల్ తో ట్విట్టర్‌ని సొంతం చేసుకున్న తర్వాత పూర్తిస్థాయిలో ప్రక్షాళన చేసేందుకు సిద్ధం అయ్యారు. టేకోవర్ చేసుకున్న గంటల వ్యవధిలో కీలకమైన నలుగురు ఉద్యోగులకు ఉద్వాసన పలికారు. ఇందులో సీఈఓ పరాగ్ అగర్వాల్, పాలసీ చీఫ్ విజయగద్దెలలో పాటు పలువురిని తొలగించారు. మొత్తం ట్విట్టర్ బోర్డును రద్దు చేశారు. ఇదిలా ఉంటే 50 శాతం మంది ట్విట్టర్ ఉద్యోగులను ఇంటికి పంపించే పనిలో ఉన్నాడు ఎలాన్ మస్క్. ఇప్పటికే శుక్రవారం నుంచి ఉద్యోగుల తొలగింపు ప్రక్రియ ప్రారంభం అయింది. దాదాపుగా 3800 మంది ట్విట్టర్ నుంచి తొలగించనున్నారు.
Read Also: Twitter: నా ఉద్యోగం పోయింది.. భారతీయుడి ట్వీట్ వైరల్
Also Read
ఇదిలా ఉంటే ఇప్పటి వరకు ట్విట్టర్ నుంచి ఉచితంగా పొందిన కొన్ని ఫీచర్లకు ఛార్జీలు విధించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. 3 రకాల సేవలకు ఛార్జీలు విధించే అవకాశం ఉందని సమాచారం. 1) హై ప్రొఫైల్ యూజర్లకు ప్రైవేట్ మెసేజులు పంపించాలంటే ఛార్జీలు వసూలు చేసే అవకాశం ఉంది. 2) కొన్ని వీడియోలను చూడాలంటే యూజర్ల నుంచి ఛార్జీలు వసూలు చేయనున్నారు. 3) బ్లూ టిక్ మార్క్ కోసం నెలకు 8 డాలర్ల చెల్లించాల్సిందే అని ఇప్పటికే మస్క్ స్పష్టం చేశాడు.
ట్విట్టర్ లో హై ప్రొఫైల్ వినియోగదారులకు ప్రైవేట్ మెసేజ్ లు పంపాలనుకుంటే డబ్బు చెల్లించాల్సిందే అని న్యూయార్క్ టైమ్స్ నివేదించింది. అయితే హై ప్రొఫైల్ యూజర్ల కిందికి ఎవరెవరు వస్తారనే దానిపై స్పష్టత లేదు. బ్లూ టిక్ మార్క్ కోసం ఇకపై నెలకు 8 డాలర్లు(సుమారుగా రూ. 600) వసూలు చేస్తామని ఎలాన్ మస్క్ స్పష్టం చేశారు. అయితే ఇతర దేశాలకు ఎంతెంత సబ్‌స్క్రిప్షన్ ధర ఉంటుందో వెల్లడించలేదు. వినియోగదారులు నిర్ధిష్టమైన వీడియోలను చూడాలంటే డబ్బులు చెల్లించేలా ప్లాన్ చేస్తున్నారు. వీడియోలను అప్ లోడ్ చేయడానికి, సెర్చ్ చేయాలంటే ఛార్జీలు వసూలు చేయనున్నట్లు తెలుస్తోంది.
తాజావార్తలు
-
Singeetam Srinivasa Rao: టాలీవుడ్లో విషాదం.. ప్రముఖ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు కన్నుమూత
-
Story Board : తెలుగు రాష్ట్రాల్లో కమ్ముకొస్తున్న తాగునీటి కొరత
-
Akbaruddin Owaisi : వచ్చే ఎన్నికల్లో పోటీ చేయను.. ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీ సంచలన వ్యాఖ్యలు
-
OTR: కౌన్ బనేగా ఎమ్మెల్సీ? ఆ లక్కీ లీడర్ ఎవరు?
-
Mad Sandhu: ప్రముఖ పంజాబీ ఇన్ఫ్లుయెన్సర్ దారుణహత్య.. నడిరోడ్డుపై కాల్చి చంపిన దుండగులు..
ట్రెండింగ్
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!