Minister Harish Rao: వాళ్లు మీవైపు వస్తే చెరువులో ముంచేయండి.. హరీష్‌రావు పిలుపు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ప్రతిపక్షాలపై ఓ రేంజ్లో ఫైర్ అయ్యారు మంత్రి హరీష్‌రావు… కాళేశ్వరం ప్రాజెక్టుతో చుక్క నీళ్లు రాలేదని కేంద్ర మంత్రులు అంటున్నారు, ఒక్క ఎకరానికి నీళ్లు ఇవ్వలేదని కాంగ్రెస్ నేతలు చెబుతున్నారు… వాళ్లు మీ వైపు వస్తే మీ చెరువులో ముంచండి.. కాళేశ్వరం నీళ్లు వచ్చాయో లేదో తెలుస్తుందని వ్యాఖ్యానించారు.. సిద్దిపేట జిల్లా నంగునూర్ మండలం సిద్దన్ పేటలో నూతన ఆసరా పెన్షన్స్ ను పంపిణీ చేసిన మంత్రి.. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. యాసంగిలో బోరు బండ్లు కనిపిస్తలేవు.. బోర్లు వెళ్లబోయబట్టే, ఇది మన కాళేశ్వరం పుణ్యమే అన్నారు.. ఒకరు ఢిల్లీలో కూర్చొని మాట్లాడుతారు,.. కాంగ్రెస్, బీజేపీ వాళ్లను ఓక్కసారి పట్టుకొచ్చి పేట చెరువులో ముంచుమన్న.. కాళేశ్వరం నీళ్లు వచ్చాయా? లేవో తెలుస్తుందన్నారు.
Read Also: MLC Kavitha: పెట్రోల్ బంకుల్లో, గ్యాస్ సిలిండర్లపై మోడీ ఫొటోలు పెడతాం..!
Also Read
- CM Revanth Reddy: భవిష్యత్ తరగతి గదుల్లోనే ఉంది.. విద్యతోనే సమాజ మార్పు సాధ్యం.!
- Pawan Kalyan: అభిమాని కష్టంలో ఉన్నాడని తెలిసి ఇంటికే వెళ్లిన పవన్ కళ్యాణ్.. కుటుంబానికి భరోసా!
- Telangana Public School: విద్యా విప్లవానికి నాంది.. తెలంగాణ పబ్లిక్ స్కూల్‌ను ప్రారంభించిన సీఎం రేవంత్ రెడ్డి.!
- Rajanna Sircilla: పానీపూరి ఫుడ్ పాయిజన్ కలకలం.. 10 మందికి పైగా చిన్నారులకు అస్వస్థత.!
మనం నాట్లు వేయాలంటే ఇతర రాష్ట్రాల నుంచి మగ మనుషులు వచ్చి నాట్లు చేస్తున్నారు.. వడ్లు లారీలో ఎక్కించడానికి బీహార్ హమాలీలు వస్తున్నారని తెలిపారు హరీష్‌రావు… కర్ణాటకలో డబుల్ ఇంజన్ అంటున్నారు.. మరి అక్కడ పెన్షన్ రూ. 200లే.. బీజేపీ ప్రభుత్వం ఎక్కడైనా 24 గంటల కరెంట్ ఉచితంగా ఇస్తున్నారా? ఇస్తే చెప్పమనండి అని సవాల్ విసిరారు.. కొంత మంది నోటికి వచ్చినట్లు మాట్లాడుతున్నారని ఫైర్ అయిన మంత్రి… తెలంగాణలో ఒక గుంట భూమి కొని, పైపు లైన్ ద్వారా నీళ్లు మహారాష్ట్రకు తీసుకెళ్తున్నారని తెలిపారు.. ఇక, సీఎం కేసీఆర్ సారుకు మీ అందరూ చల్లని దీవెనలు ఇవ్వాలని పిలుపునిచ్చారు మంత్రి హరీష్‌రావు.. ఇచ్చిన ప్రతి మాటను నిలుపుకున్న వ్యక్తి కేసీఆర్ అన్నారు.. చేపలు పట్టుకోవడానికి చెరువుల నుంచి నీరు తీయాలని మత్స్యకారులు అడిగే పరిస్థితి వచ్చింది.. కాళేశ్వరంతో అన్ని చెరువులు నీళ్లతో కలకలలాడుతున్నాయని తెలిపారు. కాగా, వరుసగా తెలంగాణలో పర్యటిస్తున్న కేంద్ర మంత్రులు.. అధికార టీఆర్ఎస్ పార్టీని టార్గెట్ చేస్తూ వస్తున్నారు.. మరోవైపు కాంగ్రెస్ నుంచి కూడా టీఆర్ఎస్పై మాటల దాడి జరుగుతోంది.. ఈ నేపథ్యంలో.. మంత్రి హరీష్‌రావు చేసిన వ్యాఖ్యలు ఆసక్తికరంగా మారాయి.
తాజావార్తలు
-
Sing Geetham : బాలకృష్ణ, కమల్ హాసన్ వేరు.. గుట్టు విప్పిన లెజెండరీ డైరెక్టర్ సింగీతం!
-
Sanhay Raut: ఒక్కో ఎంపీని రూ. 50 కోట్లతో కొన్నారు.. సంజయ్ రౌత్ సంచలన ఆరోపణలు..
-
Sing Geetham :ఇంట్లో కూర్చునే 94 ఏళ్ల వయసులో డైరెక్షన్.. అద్భుత టెక్నాలజీని బయటపెట్టిన సింగీతం!
-
UP: సమాజ్‌వాదీ పార్టీలో రాజకీయ అలజడి.. కమలం వైపు చూస్తోన్న ఎంపీలు!
-
Pawan Kalyan: “ఒకవేళ OG2 తీస్తే.. దానికి స్పెషల్ గెస్ట్ నువ్వే!”.. హన్మకొండ అభిమానికి పవన్ కళ్యాణ్ ప్రామిస్!
ట్రెండింగ్
-
Vaibhav Sooryavanshi Controversy: వైభవ్ అవుట్‌పై వివాదం.. థర్డ్ అంపైర్ నిర్ణయంపై అఫ్గాన్ ప్లేయర్స్ అసంతృప్తి!
-
Ragi Bun Dosa: ఆరోగ్యం, రుచి రెండూ ఒకేచోట.. స్పాంజీ లాంటి ‘రాగి బన్ దోస’ ఇంట్లోనే చేసేయండి ఇలా.!
-
Wedding Expenses: పెళ్లి ముహూర్తాలకు వేళాయే.. తక్కువ టైమ్ ఉండటంతో తెలుగు ఇళ్లల్లో బడ్జెట్ టెన్షన్!!
-
Ayodhya Ram Mandir: రాముడికి ప్రసాదంగా ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన మామిడి పండ్లు.!
-
Historical Day: నేడు ట్రిపుల్ ధమాకా.. టీమిండియా ఫ్యాన్స్‌కు పండగే.. 12 గంటల పాటు నాన్‌స్టాప్ ఎంటర్టైన్మెంట్!