Charles Sobhraj: నేపాల్ లో జీవిత ఖైదు అనుభవిస్తున్న సీరియల్ కిల్లర్ చార్లెస్ శోభరాజ్ విడుదల పై ఆయన అత్త, న్యాయవాది శకుంతలా తాపా సంతోషం వ్యక్తంచేశారు. చార్లెస్ విడుదలకు కోర్టు ఇచ్చిన ఆదేశాలతో తనకు నేపాల్ సుప్రీంకోర్టుపైన, న్యాయవ్యవస్థపైన గౌరవ మర్యాదలు పెరిగాయని చెప్పారు. 2003 నుంచి చార్లెస్ శోభరాజ్ జైలులో బందీగా ఉన్నాడు. తాను తీవ్ర అనారోగ్యంతో ఇబ్బంది పడుతున్నానని వెంటనే విడుదల చేయాలని కోర్టుకు విన్నవించాడు. 15 రోజుల్లో స్వదేశానికి పంపించాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. జైలులో సత్ప్రవర్తన కలిగి ఉన్నందుకు రిలీజ్ చేసేందుకు అక్కడి కోర్టు పర్మిషన్ ఇచ్చింది. సీనియర్ సిటిజన్లకు ఉన్న మినహాయింపులు తనకు కూడా వర్తింప చేయాలని కోరాడు కోర్టును ఛార్లెస్ శోభరాజ్. విచిత్రం ఏమిటంటే శోభరాజ్ తండ్రి ఇండియాకు చెందిన వారు. తల్లి వియత్నాంకు చెందినది. ఫ్రాన్స్ లో పెరిగాడు. నేర ప్రవృత్తి చిన్నప్పటి నుంచే ప్రారంభమైంది.
Read Also: Omicron BF7: కరోనా విజృంభనపై ప్రపంచ ఆరోగ్య సంస్థ ఆందోళన
చార్లెస్ శోభరాజ్ 1970లో బ్యాంకాకు వెళ్లాడు. అక్కడ బికినీలు ధరించిన టూరిస్టులను టార్గెట్ చేసేవాడు. వారితో పరిచయం పెంచుకోవడం, మత్తు మందులు ఇచ్చి లోబర్చు కోవడం, ఆపై దారుణంగా హత్య చేయడమే పనిగా పెట్టుకున్నాడు. ఈ క్రమంలో చార్లెస్ శోభరాజ్ నేపాల్‌లో ఫ్రాన్స్‌కు చెందిన ఇద్దరు టూరిస్టులను హత్యచేశాడు. ఈ కేసులో 2003లో నేపాల్ పోలీసులు అతడిని అరెస్ట్ చేసి జైలుకు పంపారు. అప్పటి నుంచి నేపాల్ జైళ్లలోనే అతను శిక్ష అనుభవిస్తున్నాడు. అయితే, ఇటీవల జైళ్లలో ఖైదీల విడుదలకు సంబంధించి నేపాల్ ప్రభుత్వం కొత్త నియమం చేసింది. సత్ప్రవర్తన కలిగిన ఖైదీలను 75 శాతం శిక్ష పూర్తయితే చాలు విడుదల చేయాలని నిర్ణయించింది.
Read Also: Dhamaka Movie Controversy : ముగిసిన ధమాకా వివాదం.. క్షమాపణలు చెప్పిన డైరెక్టర్
ఈ కొత్త నియమం ప్రకారం.. చార్లెస్ తనను విడుదల చేయాలని నేపాల్ సుప్రీంకోర్టులో పిటిషన్ వేశాడు. దాంతో సుప్రీంకోర్టు చార్లెస్ విడుదలకు ఆదేశాలు జారీచేసింది. అదేవిధంగా విడుదలైన తర్వాత 15 రోజుల లోపల ఇతర ఫార్మాలిటీస్ ఏమైనా ఉంటే పూర్తిచేసి దేశం నుంచి పంపించి వేయాలని ఆదేశాల్లో పేర్కొన్నది. నేపాల్ సుప్రీంకోర్టు ఆదేశాలపై చార్లెస్ అత్త శకుంతలా సంతోషం వ్యక్తంచేశారు.
#WATCH | Kathmandu, Nepal: On the release of French serial killer Charles Sobhraj, lawyer and Mother in law of Charles, Sakuntala Thapa says "I'm happy and have a great respect and response for our judiciary & Supreme court" pic.twitter.com/u77bsACSTd
— ANI (@ANI) December 22, 2022