Harish Rao: తెలంగాణ పథకాల్ని కేంద్ర ప్రభుత్వం కాపీ కొట్టట్లేదా?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Minister Harish Rao Again Attacks On BJP Policies: తెలంగాణ మంత్రి హరీష్ రావు మరోసారి బీజేపీపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ఇన్నేళ్ల పాలనలో బీజేపీ చేసింది ఏమన్నా ఉందంటే.. అది గ్యాస్, పెట్రోల్, డీజిల్ ధరల పెంపు మాత్రమేనని ఎద్దేవా చేశారు. బీజేపీ ప్రభుత్వం రాష్ట్రాలకు కోతలు, వాతలు తప్ప.. ఇచ్చిందేమీ లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాల్ని కేంద్రం ప్రభుత్వం కాపీ కొడుతోందని.. అది నిజం కాదా? అని ప్రశ్నించారు. సీఎం కేసీఆర్ పాలనలో.. కాలంతో పని లేకుండా రెండు పంటలు పండే విధంగా ప్రాజెక్టుల్ని నిర్మించుకున్నామన్నారు. బోరు బావుల వద్ద మీటర్లు పెట్టలేదు కాబట్టే.. తెలంగాణ రాష్ట్రానికి రావాల్సిన రూ. 12 వేల కోట్లను కేంద్రం ఆపిందని మండిపడ్డారు. మీటర్ల మాట నిజం కాకపోతే.. రూ. 12 వేల కోట్లు ఎందుకు ఆపారు? ఇందుకు సమాధానం చెప్పాల్సిందేనని డిమాండ్ చేశారు.
పంటకు ఐదు వేలు అందించి, రైతులకు పెట్టుబడి సహాయం చేసిన ఘనత టీఆర్‌ఎస్‌ది కాదా? అని నిలదీశారు. బిజెపి పాలిత రాష్ట్రాల్లో.. తెలంగాణ తరహా రైతు బంధు ఇస్తున్నారా? దమ్ముంటే చెప్పండని ప్రశ్నించారు. అబద్ధాలను కూడా బీజేపీ నాయకులు అందంగా చెప్తారని విమర్శించారు. జై జవాన్-జై కిసాన్ అనే నానుడి లేకుండా.. ఓ వైపు రైతులకు గోస పెడుతూ, మరోవైపు అగ్నిపథ్‌తో దేశ యువతను కేంద్ర ప్రభుత్వం నిర్వీర్యం చేస్తోందని హరీష్ రావు వ్యాఖ్యానించారు. మృతి చెందిన రైతు కుటుంబాలకు రైతుభీమా కింద రూ.5 లక్షల సహాయం అందించిన ఏకైక ప్రభుత్వం టీఆర్ఎస్ అని, ఇప్పటివరకూ 87 వేల మంది రైతు కుటుంబాలకు రూ.4333 కోట్ల సాయాన్ని అందించామన్నారు. దేశంలో ఏ రాష్ట్రంలో కూడా రైతులకు 24 గంటలు ఉచిత కరెంట్ లేదని.. ఒక్క తెలంగాణలో మాత్రమే అమలు అవుతోందని అన్నారు. దుబ్బాక నియోజకవర్గంలో 54 వేల మందికి నెలనెలా ఆసరా పింఛన్లను కూడా అందిస్తున్నామని వెల్లడించారు.
Also Read
- Rain Alert: మళ్లీ వర్షాల జోరు.. 5 జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్.. పిడుగులతో భారీ వర్షాలు!
- Ramnagar Stampede: రాంనగర్ గణేష్ ఆగమన్ ర్యాలీలో విషాదం.. తొక్కిసలాటలో యువకుడు మృతి
- KCR: నేడు బీఆర్ఎస్ఎల్పీ సమావేశం.. ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు కేసీఆర్ దిశానిర్దేశం
- OTR : కాంగ్రెస్‌లో ఇక గీత దాటితే ఎంతటి వారికైనా వేటు తప్పదా?
సిద్ధిపేట జిల్లా దుబ్బాకలో నిర్వహించిన ఆత్మ కమిటీ చైర్మన్, దౌల్తాబాద్ వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్, తొగుట మార్కెట్ కమిటీ చైర్మన్ ప్రమాణ స్వీకారానికి హాజరైన హరీష్ రావు.. పై విధంగా వ్యాఖ్యలు చేశారు. మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి కూడా ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. దేశం కష్టాల్లో ఉందని, దేశ ప్రజల సంక్షేమం కోసం దేశ పౌరుడిగా తన బాధ్యత నెరవేర్చాలన్న ఉద్దేశంతోనే బీఆర్ఎస్ పార్టీని కేసీఆర్ స్థాపించారని చెప్పారు. సీఎం కేసీఆర్, హరీశ్ రావు నేతృత్వంలో నిధుల కొరత లేకుండా దుబ్బాక నియోజకవర్గం అన్నీ రంగాలలో అభివృద్ధి చెందుతోందన్నారు.
తాజావార్తలు
-
Pakistan Cricket Board: వరుస ఓటములతో పాక్ క్రికెట్లో కలకలం.. మూడో టెస్టుకు ముందే సగం జట్టు మార్పు..
-
Explainer: ఇండియాలో కూడా నేపాల్ తరహా విలయం?
-
Delhi Building Collapse: ఢిల్లీలో కుప్పకూలిన 4 అంతస్తుల భవనం.. శిథిలాల కింద 50 మంది విద్యార్థులు..?
-
Vaibhav Sooryavanshi: దులీప్ ట్రోఫీ 2026 ఫైనల్లో వైభవ్ సూర్యవంశీ దూకుడు..
-
Tilak vs Vaibhav: ఏంటిది వైస్ కెప్టెన్.. వైభవ్ సూర్యవంశీని స్లెడ్జ్ చేసిన తిలక్ వర్మ.. వీడియో వైరల్!
ట్రెండింగ్
-
Asia Cup 2026: భారత్ చేతిలో 55 పరుగులకే ఆలౌట్.. అయినా పాక్‌దే ఆసియా కప్ టైటిల్ అంటున్న కోచ్!
-
Harmanpreet Kaur History: హర్మన్‌ప్రీత్ కౌర్ నయా చరిత్ర.. క్రికెట్ హిస్టరీలోనే మొట్టమొదటి కెప్టెన్!
-
Shubman Gill Uncle: అకాయ్‌కు ‘అంకుల్’గా శుభ్‌మన్ గిల్.. వైరల్‌గా స్కూల్ రీల్.. పగలబడి నవ్వుకుంటున్న ఫాన్స్!
-
243 కి.మీ రేంజ్, 90 కి.మీ టాప్ స్పీడ్.. రూ.1.10 లక్షలకే Simple Wave ఎలక్ట్రిక్ స్కూటర్ లాంచ్..!
-
Rohit Sharma Retirement: రిటైర్మెంట్కు అంగీకరించిన రోహిత్ శర్మ.. సంచలన రిపోర్ట్!