Asaduddin Owaisi: బాబ్రీ కూల్చివేతలో బీజేపీ, ఆర్ఎస్ఎస్ లాగే కాంగ్రెస్ పాత్ర కూడా ఉంది..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Asaduddin Owaisi: ఎంఐఎం చీఫ్, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ కాంగ్రెస్, బీజేపీపై ఫైర్ అయ్యారు. రాహుల్ గాంధీ టార్గెట్ గా విమర్శలు గుప్పించారు. బాబ్రీ మసీద్ కూల్చివేతలో బీజేపీ, ఆర్ఎస్ఎస్ లాగే కాంగ్రెస్ పాత్ర కూడా ఉందని ఆయన ఆరోపించారు. ఇందుకు మధ్యప్రదేశ్ కాంగ్రెస్ నేత కమల్ నాథ్ వ్యాఖ్యలు రుజువు చేస్తున్నాయని అన్నారు. కాంగ్రెస్‌ది జూటా సెక్యులరిజం అని దుయ్యబట్టారు. ముస్లింలు మందిరాలను కూల్చివేశారని సుప్రీంకోర్టు ఎక్కడా చెప్పలేదని గుర్తు చేశారు. కాంగ్రెస్ పార్టీది కేవలం పొలిటికల్ సెక్యులరిజం అని, కాంగ్రెస్, బీజేపీ పార్టీలు రెండూ ఒక్కటే అని దుయ్యబట్టారు. కాంగ్రెస్ హయాంలో రాష్ట్రంలో 11 సార్లు కర్ఫ్యూ విధించారని, కేసీఆర్ హయాంలో రెండుసార్లు కర్ఫ్యూ విధిస్తే, అందులో ఒకసారి కరోనా సమయంలో అని అన్నారు. 2014 నుంచి అభివృద్ధిలో తెలంగాణ దూసుకెళ్తుందని, ఈ సారి కూడా తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీనే గెలుస్తుందని, దీంట్లో ఎటువంటి డౌట్ లేదని వెల్లడించారు. బీఆర్ఎస్ పార్టీకే మా పూర్తి సపోర్టు ఉంటుందని స్పష్టం చేశారు.
Read Also: CM KCR: ఎన్నికలు రాగానే ఆగం ఆగం అబద్ధాలు చెబుతారు.. ఆలోచించి ఓటు వేయండి
Also Read
- Fake Doctors: హైదరాబాద్‌లో 11 మంది నకిలీ డాక్టర్ల అరెస్ట్..
- Tirumala Special Entry Darshan Tickets: శ్రీవారి భక్తులకు అలర్ట్.. నేడే రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్ల బుకింగ్..!
- NIA Raids : ఆపరేషన్ సిందూర్ ఎఫెక్ట్.. రామగుండంలో NIA మెరుపు దాడులు
- AP Liquor Scam Case: కారుమూరి అరెస్ట్‌పై ఈడీ కీలక ప్రకటన
అజారుద్దీన్ తో నాకు సంబంధం లేదని, ఆయన కాంగ్రెస్ అభ్యర్థి అని, అజారుద్దీన్ సోదరులు నా స్నేహితులని అసద్ వెల్లడించారు. జూబ్లీహిల్స్ లో బీఆర్ఎస్ అభ్యర్థిని ఓడిస్తామని, ఎంఐఎం గెలుస్తుందని తెలిపారు. అంబర్ పేట నుంచి కిషన్ రెడ్డి పోటీ చేయకుండా ఎందుకు పారిపోయారని ప్రశ్నించారు. బండి సంజయ్‌ని అధ్యక్ష పదవి నుంచి తప్పించి ఇప్పుడు బీసీ సీఎం అంటున్నారని బీజేపీని విమర్శించారు. కాళేశ్వరం ప్రాజెక్టుపై డ్యాం సేఫ్టి అథారిటీ ఇచ్చిన నివేదిక చదవలేదని, మరమ్మతులకు అయ్యే ఖర్చు నిర్మాణ సంస్థ భరిస్తుందని కేటీఆర్ చెప్పారని, రాష్ట్ర ఖజానాపై ఎలాంటి నష్టం ఉండదని ఓవైసీ వ్యాఖ్యానించారు.
అంతకు ముందు రోజు ఎంఐఎం, బీజేపీ నుంచి డబ్బులు తీసుకుని వివిధ రాష్ట్రాల్లో కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా అభ్యర్థులను నిలబెడుతుందని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ విమర్శించడంపై అసదుద్దీన్ స్పందించారు. 2019 లోక్‌సభ ఎన్నికల్లో అమేథి నుంచి ఓడిపోవడానికి ఎన్ని డబ్బులు తీసుకున్నానని రాహుల్ గాంధీని ప్రశ్నించారు. 2014, 2019లో ఓడిపోవడానికి మీరు బీజేపీ నుంచి డబ్బులు తీసుకున్నారా.? అని అడిగారు.
తాజావార్తలు
-
Mojtaba Khamenei: మోజ్తబా ఖమేనీ అరుదైన వీడియో విడుదల.. అనుమానాల వేళ వైరల్
-
Shiva Nirvana: డ్యాన్స్ మాస్టర్ శివ నిర్వాణ గురించి మీకు తెలుసా? ‘ఇరుముడి’ సినిమాలో ఆయన కొరియోగ్రఫీ చేసిన పాట ఇదే!
-
Mahesh Babu – Anil Ravipudi :వారణాసి తర్వాత అనిల్ రావిపూడితో మహేష్ సినిమా.. నిజమేనా?
-
Prasidh Krishna: మేము బాగా బౌలింగ్ చేస్తే సరిపోదు.. ప్రసిద్ధ్ కృష్ణ కీలక వ్యాఖ్యలు!
-
Balloon Stuck in Throat: బెలూన్ ఊదుతుండగా విషాదం.. గొంతులో ఇరుక్కుని ఆరేళ్ల బాలుడు మృతి
ట్రెండింగ్
-
Medhavi Bidhuri: ‘6-7’ సెలబ్రేషన్‌తో వైరల్.. ఇప్పుడు వికెట్ల వేటలో తోపు.. ఎవరు ఈ ‘మెధావి బిధూరి’.?
-
Viral Love Story: తైవాన్ అబ్బాయి.. భారత్ అమ్మాయి.. రాత్రికి రాత్రే ఇండియాలో సెన్సేషన్.. కట్‌చేస్తే..
-
144Hz డిస్‌ప్లే, కొత్త కలర్ ఆప్షన్లతో సెప్టెంబర్ 4న రాబోతున్న Infinix Hot 70 Pro 5G.!
-
ఆరేళ్ల సెక్యూరిటీ అప్డేట్స్, 2TB వరకు స్టోరేజ్, 50MP కెమెరాతో Sony Xperia 10 VIII లాంచ్..!
-
Green Chillies Plant Grow: కుండీలో పచ్చిమిరపకాయలు విరగకాయాలంటే ఇలా చేయండి.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి!