Mahesh Babu – Anil Ravipudi :వారణాసి తర్వాత అనిల్ రావిపూడితో మహేష్ సినిమా.. నిజమేనా?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మహేష్ బాబు హీరోగా రాజమౌళి దర్శకత్వంలో రాబోతున్న భారీ పాన్ వరల్డ్ చిత్రం ‘వారణాసి’పై ఇప్పటికే భారీ అంచనాలున్నాయి. అయితే, ఈ భారీ చిత్రం పూర్తయిన తర్వాత మహేష్ బాబు నెక్స్ట్ సినిమా ఎవరితో ఉండబోతుందనే దానిపై నెట్టింట ఓ క్రేజీ న్యూస్ తెగ వైరల్ అవుతోంది. ‘సరిలేరు నీకెవ్వరు’ సినిమాతో మహేష్ కు అదిరిపోయే హిట్టిచ్చిన బ్లాక్ బస్టర్ డైరెక్టర్ అనిల్ రావిపూడితో ముచ్చటగా మరో ప్రాజెక్ట్ ఫిక్స్ అయిందని, సంక్రాంతి 2028 బరిలో ఈ సినిమా దిగబోతోందంటూ వార్తలు షికారు చేస్తున్నాయి. ఈ పుకార్లపై దర్శకుడు అనిల్ రావిపూడి పీఆర్ (PR) టీమ్ సంప్రదించగా ఆ వార్త కేవలం ఫేక్ న్యూస్ మాత్రమేనని వారు తేల్చి చెప్పారు. ఈ రూమర్స్ ని కొట్టిపారేసిన పీఆర్ టీమ్.. ఆ ప్రచారంలో ఏమాత్రం వాస్తవం లేదని స్పష్టం చేసింది.
సూపర్ స్టార్ మహేష్ బాబుతో దర్శకుడు అనిల్ రావిపూడికి చాలా మంచి అనుబంధం ఉన్న మాట వాస్తవమే అయినా.. ప్రస్తుతానికి వాళ్ళిద్దరి కాంబినేషన్ లో ఏ ప్రాజెక్టు సెట్ అవ్వలేదని, సినిమా తీసే ఆలోచనలో ఎటువంటి ముందడుగు పడలేదని టీమ్ వివరణ ఇచ్చింది. దర్శకుడు అనిల్ రావిపూడి ప్రస్తుతం తన పూర్తి ఫోకస్ అంతా విక్టరీ వెంకటేష్, నందమూరి కళ్యాణ్ రామ్ కాంబోలో రాబోతున్న మల్టీస్టారర్ మూవీ ‘జనవరి 12 విడుదల’ పైనే పెట్టినట్లు స్పష్టం చేశారు. సో, ఇప్పటికైతే మహేష్ – అనిల్ రావిపూడి కాంబోపై వస్తున్న వార్తలన్నీ వట్టి పుకార్లేనని క్లారిటీ వచ్చేసింది!
Also Read
- AK 47 Release Date Leaked: 'ఆదర్శకుటుంబం' రిలీజ్ డేట్ లీక్.. పోస్ట్ పెట్టి డిలీట్ చేసినా దొరికిపోయాడుగా!
- Sivakarthikeyan: ‘నీకు ఫ్యాన్స్ వేస్ట్’ అన్న నిర్మాతకు శివకార్తికేయన్ దిమ్మతిరిగే రిప్లై!
- Jim Jim Thara: లీకై వైరల్ అయిన ‘జిమ్ జిమ్ తార’ పాట వెనుక అసలు గుట్టు ఇదే!
- Chiranjeevi: మెగాస్టార్‌కు కార్తీక్ సుబ్బరాజ్ మార్క్ కథ నరేషన్.. కానీ హోల్డ్?
తాజావార్తలు
-
AK 47 Release Date Leaked: ‘ఆదర్శకుటుంబం’ రిలీజ్ డేట్ లీక్.. పోస్ట్ పెట్టి డిలీట్ చేసినా దొరికిపోయాడుగా!
-
Aggipette Maccha : యూట్యూబ్ కమెడియన్ ‘అగ్గిపెట్టె మచ్చ’ మృతి..
-
Sivakarthikeyan: ‘నీకు ఫ్యాన్స్ వేస్ట్’ అన్న నిర్మాతకు శివకార్తికేయన్ దిమ్మతిరిగే రిప్లై!
-
BJP Posters: ‘బొద్దింకలా కాకుండా.. మచ్చర్లా ఉండు’.. పుణెలో వెలసిన బీజేపీ పోస్టర్లు
-
Harish Rao : 5,420 కోట్ల ‘ట్రూ అప్’ భారాన్ని తక్షణమే ఉపసంహరించుకోవాలని డిమాండ్
ట్రెండింగ్
-
Viral Video: రామనామం పవర్ ఇదేనా? మహిళ ‘శ్రీరామ్’ అనగానే కోతి మైండ్ బ్లోయింగ్ రియాక్షన్.. వీడియో వైరల్!
-
Oil Less Vada: చుక్క నూనె లేకుండా, పప్పు నానబెట్టకుండా.. దూదిలాంటి సాఫ్ట్ వడలు చిటికెలో చేయండి ఇలా..!
-
రూ.10,999కే 120Hz డిస్ప్లే, 5,000mAh బ్యాటరీతో Infinix Smart 20 HD లాంచ్..!
-
Woolen Clothes: స్వెటర్లపై చిన్న చిన్న రోమాలు పోవడం లేదా? ఈ 2 నిమిషాల హోమ్ ట్రిక్స్‌తో కొత్తవాటిలా మార్చేయండి!
-
Tollywood Most Eligible Bachelors: పెళ్లా? మాకా?!.. వయస్సు ముదురుతున్న ‘నిత్య బ్రహ్మచారి’ బిరుదును వదలని హీరోలు.!