Viral Love Story: తైవాన్ అబ్బాయి.. భారత్ అమ్మాయి.. రాత్రికి రాత్రే ఇండియాలో సెన్సేషన్.. కట్‌చేస్తే..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Viral Love Story: మనందరిలోనూ ఎక్కడో ఒక మూల ఓ చిన్న ‘హోప్లెస్ రొమాంటిక్’ దాగి ఉంటాడు. మన దేశంలో ఈ రొమాంటిక్ ఆలోచనలకి, ఊహలకి ఊపిరిపోసింది మన బాలీవుడ్ సినిమాలు అనడంలో ఎలాంటి సందేహం లేదు. సరిగ్గా అలాంటి ఒక డ్రామాటిక్, రొమాంటిక్ బాలీవుడ్ తరహా కథే ఇప్పుడు సోషల్ మీడియాను ఊపేస్తోంది. అది కూడా మన దేశ సరిహద్దులు దాటి వెళ్లిన ఒక సరికొత్త ఊహాజనిత “లవ్ స్టోరీ”. ఈ కథలోని కథానాయకుడు చెంగ్ చాంగ్ ఫాన్. ఈయన తైవాన్‌కు చెందిన ప్రముఖ నటుడు, మోడల్, మ్యుజీషియన్. రీసెంట్గా ఈయన ఒక ఇండియన్ అమ్మాయితో ఉన్న పాత వీడియోలు, ఫొటోలు నెట్టింట ప్రత్యక్షమవ్వడమే ఆలస్యం.. రాత్రికి రాత్రే భారతీయ సోషల్ మీడియాలో ఒక పెద్ద సెన్సేషన్ అయిపోయాడు. అసలు ఈ జంట ఎవరు? ఎప్పుడు కలిశారు? ఏం జరిగింది? అని నెటిజన్లు ఎంతో ఆసక్తిగా ఆరా తీయడం మొదలుపెట్టారు.
ఈ ప్రచారానికి ప్రధాన కారణం చెంగ్ స్వయంగా ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసిన ఒక ఫొటోల గ్యాలరీ. ఆ ఫొటోల్లో ఒక ఇండియన్ అమ్మాయితో కలసి కనిపించిన చెంగ్, క్యాప్షన్‌లో భారతీయ మహిళల గొప్పతనాన్ని ఎంతో వివరంగా రాసుకొచ్చాడు. వాళ్ల ఆప్యాయత, భావోద్వేగాలను పంచుకునే తీరు, పరిచయం లేని వ్యక్తులను కూడా సొంత మనుషుల్లా ఆదరించే గుణం తనకు ఎంతగానో నచ్చాయని కొనియాడాడు. అంతేకాదు, తాను ఇండియాలో అడుగుపెట్టినప్పుడు ఒక హోటల్లో మొదటిసారి చూసిన ఆ అమ్మాయిని గుర్తుచేసుకున్నాడు. ఇంకేముంది, మన నెటిజన్ల డిటెక్టివ్ బుర్రలకి పని దొరికింది!
Also Read
వెంటనే చెంగ్ ఇన్స్టాగ్రామ్ అకౌంట్లో ఒక సంవత్సరం కిందటి రీల్‌ని బయటకి తీసి వైరల్ చేయడం మొదలుపెట్టారు. కథ ప్రకారం 2025లో చెంగ్ ఇండియాకు వచ్చినప్పుడు, ఒక హోటల్ లాబీలో అక్కడి మహిళా సిబ్బంది ఆయనకు హారతి ఇచ్చి, తిలకం దిద్ది సాంప్రదాయబద్ధంగా స్వాగతం పలికింది. మొదటి చూపులోనే ప్రేమలో పడిపోయినట్లుగా చెంగ్ ఆ క్షణంలో ఆ అమ్మాయి వైపు చూసిన చూపులు నెటిజన్లను విపరీతంగా ఆకట్టుకున్నాయి. సినిమా సీన్‌ను తలపించేలా ఉన్న ఆ క్షణంలో వారిద్దరి మధ్య ఉన్న కెమిస్ట్రీ చూసి, జనాలు వీరిద్దరినీ ఒక జంటగా ఊహించుకోవడం ప్రారంభించారు. “అతడు ఖచ్చితంగా ఆమె ప్రేమలో పడిపోయాడు” అని ఒకరంటే, “నన్ను కూడా ఎవరైనా ఇలాగే చూస్తే బాగుండు” అంటూ మరొకరు కామెంట్లు కురిపించారు. మరికొందరైతే ఈ సీన్‌ను మాజీ క్రికెటర్ ఎమ్ఎస్ ధోని, సాక్షిల హోటల్ లవ్ స్టోరీతో పోల్చుతూ వీరికి కూడా శుభం కార్డు పడాలని కోరుకున్నారు.
అయితే, సోషల్ మీడియాలో ఎంత రచ్చ జరుగుతున్నా, ఫొటోలు, ఫీలింగ్స్ షేర్ చేసుకున్నా.. చెంగ్ మాత్రం ఆమె తన గర్ల్‌ఫ్రెండ్ అని ఎక్కడా అధికారికంగా ప్రకటించలేదు. అటు ఆ అమ్మాయి కూడా దీనిపై ఎలాంటి స్పందనా ఇవ్వలేదు. కాబట్టి ప్రస్తుతానికి ఇది కేవలం ఒక “రూమర్” గానే మిగిలిపోయింది. అసలు ఈ విషయాన్ని జనాలు ఎందుకు ఇంతగా వైరల్ చేస్తున్నారు? అని ఆలోచిస్తే.. నెట్లో వైరల్ అవ్వడానికి ఇప్పుడు పెద్దగా విషయాలు అవసరం లేదు! కొద్దిగా ఆశ, ఒక అపరిచిత వ్యక్తి, తీపి జ్ఞాపకం, మళ్లీ కలవడం, రొమాంటిక్ క్యాప్షన్.. ఇవి చాలు ఒక కథ రూపుదిద్దుకోవడానికి. పైగా ఆ కథలో ఉన్న స్పష్టత లేని ఆసక్తికరమైన అంశమే అందరినీ కట్టిపడేసింది. కానీ ఈ నాణేనికి మరో వైపు కూడా ఉంది. కొన్ని కామెంట్ల ప్రకారం చెంగ్ ఓపెన్‌గా గే (Gay) అని, 2020లో తను నటించిన ‘క్రేవింగ్ ఫర్ యు’ అనే వెబ్ సిరీస్ సమయంలో తన భావాలను వ్యక్తపరిచాడని నెటిజన్లు గుర్తుచేస్తున్నారు. మరోవైపు ఈ మధ్య వస్తున్న వీడియోలు, ఫొటోలు అసలైనవేనా లేక ఏఐ (AI) ద్వారా రూపొందించినవా అనే సందేహాలు కూడా వ్యక్తమవుతున్నాయి. పైగా ఆ హోటల్లో కలిసిన అమ్మాయే ఈమెనా? ఆమె పేరు ఏంటి? ఎక్కడి నుంచి వచ్చింది? అనే నిజమైన వివరాలు ఎవరికీ తెలియవు. సంగతి ఏంటంటే, నిజాలు ఎలా ఉన్నా సరే.. ఒక మంచి రొమాంటిక్ లవ్ స్టోరీని ఊహించుకోవడానికి నెటిజన్లకు ఆ నిజాలతో పనేముంది? అందుకే అందరూ కలిసి ఈ కొత్త ప్రేమకథకు తదుపరి చాప్టర్లు రాసే పనిలో పడిపోయారు!
తాజావార్తలు
-
RaviTeja – VivekAthreya : రవితేజ ‘తులాభారం’లో తూగబోయే నటీనటులు వీరేనట
-
Captain Changes: ఆసియా గేమ్స్‌లో ఓటమి.. పాకిస్థాన్ కెప్టెన్ పై వేటు..! కొత్త కెప్టెన్ ఎవరంటే.?
-
Kavitha: సిరిసిల్లకు సీఎం ఏం ఇచ్చారు?.. సర్కార్‌పై కవిత విమర్శలు..!
-
Cash Withdrawal Surges: ఏటీఎంల నుంచి నగదు ఉపసంహరణలో కొత్త రికార్డు.. ఏకంగా రూ.2.24 లక్షల కోట్లు డ్రా!
-
APSRTC: ‘స్త్రీ శక్తి’లో చారిత్రాత్మక మైలురాయి.. 100 కోట్లు దాటిన ఉచిత ప్రయాణాలు
ట్రెండింగ్
-
WCL 2026 నుంచి పాకిస్థాన్ ఛాంపియన్స్ ఔట్.. NOC ఇవ్వని PCB.!
-
Kakarakaya Vepudu: అన్నంలోకి ‘కాకరకాయ వేపుడు’.. ఇలా చేస్తే ప్లేట్ ఖాళీ అవ్వాల్సిందే.!
-
Harmanpreet Kaur: హర్మన్‌ప్రీత్ కౌర్ సంచలన నిర్ణయం!
-
Suryakumar Yadav: సూర్యకుమార్ యాదవ్‌కు బిగ్ షాక్.. టీమ్‌లో నో ప్లేస్.. టీనేజర్‌కు వైస్ కెప్టెన్సీ!
-
Big Billion Days Offers: రూ.20,000 లోపు లభించే టాప్ స్మార్ట్‌ఫోన్ డీల్స్ ఇదిగో.. అస్సలు మిస్ కావద్దు.!