Balloon Stuck in Throat: బెలూన్ ఊదుతుండగా విషాదం.. గొంతులో ఇరుక్కుని ఆరేళ్ల బాలుడు మృతి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Balloon Stuck in Throat: చిన్న పిల్లలు తరచూ బెలూన్ కావాలని మారం చేస్తుంటారు.. జాతర, ఇతర ప్లేసుల్లో వాళ్లకు గాలి బుడగలు ఇప్పిస్తుంటారు.. ఇక, ఇంట్లో జరిగే బర్త్ డే పార్టీలు.. చిన్న ఫంక్షన్లలో కూడా బెలూన్లు వాడుతుంటారు.. అంతేకాదు.. కొన్నిసార్లు.. సమీప షాపుల్లో తీసుకొని ఆడుకుంటారు.. కానీ, అవి కొన్నిసార్లు ప్రాణాల మీదకు తెస్తుంటాయి.. తాజాగా, తమిళనాడులోని పచ్చూరులో విషాద ఘటన చోటుచేసుకుంది. బెలూన్ ఊదుతుండగా అది గొంతులో ఇరుక్కోవడంతో ఆరేళ్ల బాలుడు మృతి చెందాడు. ఆడుకుంటూ ప్రమాదానికి గురైన చిన్నారి మృతితో కుటుంబంలో తీవ్ర విషాదం నెలకొంది.
వస్త్ర వ్యాపారి సత్యకుమార్ దంపతులకు ఇద్దరు మగ కవల పిల్లలు ఉన్నారు. సోమవారం సాయంత్రం ఇంటి వద్ద ఆరేళ్ల సోమనాథ్ బెలూన్‌తో ఆడుకుంటూ దానిని ఊదుతున్నాడు. ఈ క్రమంలో ప్రమాదవశాత్తు బెలూన్ ఒక్కసారిగా బాలుడి గొంతులో ఇరుక్కుంది. దీంతో ఊపిరి ఆడక అపస్మారక స్థితిలోకి వెళ్లాడు. వెంటనే కుటుంబ సభ్యులు బాలుడిని ఆసుపత్రికి తరలించారు. అయితే అప్పటికే చిన్నారి మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. బాలుడి గొంతులో ఇరుక్కున్న బెలూన్ను వైద్యులు బయటకు తీశారు. ఆడుతూ పాడుతూ బెలూన్‌తో సరదాగా గడిపిన చిన్నారి అనూహ్యంగా మృత్యువాత పడటంతో కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. ఈ ఘటనతో పచ్చూరులో విషాద ఛాయలు అలుముకున్నాయి.
Also Read
- Firecracker Shop Fire: వ్యాపార ప్రచారం కోసం రీల్.. బాణసంచా దుకాణంలో మంటలు, యజమాని మృతి
- Gang R*ape Case: మద్యం తాగించి, తుపాకీతో బెదిరించి సామూహిక అత్యాచారం..! బీజేపీ మాజీ ఎమ్మెల్యే సహా ఇద్దరిపై కేసు
- Vinayaka Immersion Accident: వినాయక నిమజ్జనంలో విషాదం.. ఇద్దరు మృతి.. ముగ్గురికి సీరియస్..
- Anakapalli Tragedy: అనకాపల్లిలో విషాదం.. బాలిక, యువకుడి మృతితో విషాదం.. అసలేం జరిగింది?
తాజావార్తలు
-
B35 Bullet Train: 2030 నాటికి భారత్ 350KM వేగంతో బుల్లెట్ ట్రైన్.. జపాన్ E10 సిరీస్‌కు పోటీగా స్వదేశీ B35
-
Karivepaku Kaaram Podi: ముద్దగ కాకుండా.. పొడిపొడిగా, పర్ఫెక్ట్గా “కరివేపాకు కారప్పొడి” కావాలా.? ఇంకెందుకు ఆలస్యం ఇలా ఫాలో అవ్వండంతే..!
-
Saiyaara Jodi : మళ్లీ జోడీ కడుతున్న బాలీవుడ్ బ్లాక్ బస్టర్ ‘సైయారా’ జోడి
-
Raaka Glimpse: డిసెంబర్లోనే అసలైన గ్లింప్స్.. రేపు అల్లు అర్జున్ ‘రాకా’ నుంచి వచ్చే సర్ప్రైజ్ ఇదేనా?
-
India Matches: 3 నెలలు, 28 మ్యాచ్‌లు.. టీమిండియా బిజీ షెడ్యూల్ మాములుగా లేదుగా..!
ట్రెండింగ్
-
11,000mAh బ్యాటరీ, IP68+IP69+IP69K రేటింగ్స్, 108MP కెమెరాతో వచ్చేస్తున్న Honor X9e ప్రో..!
-
Curd in Fridge: ఫ్రిజ్‌లో పెరుగు పెట్టారా? ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు తినొద్దు..
-
Pat Cummins: కోహ్లీ, రోహిత్ కాదు.. అతడే వెరీ టఫ్.. వికెట్ ఇవ్వకుండా విసిగించేవాడు!
-
Gautam Gambhir: నా కోచింగ్ కెరీర్లోనే అదే కఠిన నిర్ణయం.. అతడు చాలా ఏడ్చాడు.. గంభీర్ షాకింగ్ కామెంట్స్!
-
iPhone 18 India Sales: ఐఫోన్ 18 కోసం 12 గంటల పాటు స్టోర్ల వద్ద క్యూ.. తొలి రోజే రికార్డ్ స్థాయి అమ్మకాలు..!