Prasidh Krishna: మేము బాగా బౌలింగ్ చేస్తే సరిపోదు.. ప్రసిద్ధ్ కృష్ణ కీలక వ్యాఖ్యలు!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
శ్రీలంకతో కొలంబోలో జరుగుతున్న రెండో టెస్టులో టీమిండియా ఆధిపత్యం కొనసాగుతోంది. భారత్ 503/9 వద్ద తొలి ఇన్నింగ్స్‌ను డిక్లేర్ చేయగా.. మూడో రోజులో రెండో సెషన్లో శ్రీలంక 181/7 స్కోరుతో నిలిచింది. లంక ఇంకా 322 పరుగులు వెనుకబడి ఉంది. టీమిండియా పేసర్ ప్రసిద్ధ్ కృష్ణ మూడు కీలక వికెట్స్ పడగొట్టి.. లంకను ఒత్తిడిలో పడేశాడు. ఈరోజు మీడియాతో ప్రసిద్ధ్ మాట్లాదుతూ తన ప్రణాళికలను వెల్లడించాడు. ఈ క్రమంలో పిచ్, స్లిప్ క్యాచింగ్, తన బౌలింగ్ విధానం గురించి ఆసక్తికర విషయాలు వెల్లడించాడు. బౌలర్లు బాగా బౌలింగ్ చేస్తే సరిపోదని, స్లిప్ ఫీల్డర్లు క్యాచ్ అందుకోవడం మరింత ముఖ్యం అని పేర్కొన్నాడు.
‘శ్రీలంక ఓపెనర్ లాహిరు ఉదారాను ఔట్ చేసిన సమయంలో బంతి పిచ్‌పై కొద్దిగా ఆగి, స్వల్పంగా సీమ్ అయింది. బంతి బ్యాట్ ఎడ్జ్ తీసుకుంది. యశస్వి జైస్వాల్ అద్భుతమైన క్యాచ్ అందుకున్నాడు. ప్రాక్టీస్‌లో ఫీల్డింగ్‌పై టీమ్ ఎంతో శ్రమిస్తోంది. అందుకు తగిన ఫలితం ఈ క్యాచ్ రూపంలో వచ్చింది. బౌలర్ ఎడ్జ్ అయ్యేలా బంతిని సరైన ప్రదేశంలో వేయడం ఎంత ముఖ్యమో.. వచ్చిన అవకాశాన్ని స్లిప్ ఫీల్డర్లు క్యాచ్ అందుకోవడం కూడా అంతే ముఖ్యం. జట్టు ఈ విషయంలో బాగా శ్రమిస్తోంది. మ్యాచ్‌లో పెద్ద విషయాల కంటే చిన్న చిన్న అంశాలను సరిగ్గా చేయడమే విజయానికి దోహదపడుతుంది’ అని ప్రసిద్ధ్ చెప్పుకొచ్చాడు.
Also Read
- Shubman Gill Record: శుభ్‌మన్ గిల్ అరుదైన రికార్డు.. అప్పుడే ధోనీ, గంగూలీ, యువరాజ్ సరసన ప్రిన్స్!
- Shai Hope: ఎంఎస్ ధోనీ సలహాతోనే భారత్‌ను ఓడించాం.. వెస్టిండీస్ కెప్టెన్ ఆసక్తికర వ్యాఖ్యలు!
- Shubman Gill: అదే మా కొంపముంచింది.. ప్రపంచ కప్‌కు ముందు ఇలా ఆడితే..!
- Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
‘నా బౌలింగ్‌లో దూకుడుకు ప్రాధాన్యం ఇస్తా. అయితే బౌలర్ దూకుడు అనేది మాటలు లేదా శరీర భాషలోనే కనిపించాల్సిన అవసరం లేదు. నేను బంతులు వేసే విధానంలో అది కనిపిస్తుంది. పిచ్‌పై ఏమాత్రం స్పందన లేకపోయినా బౌలర్ దృష్టి మాత్రం మారకూడదు. ఎక్కడ బంతి వేయాలనుకుంటున్నాడనే దానిపైనే దృష్టి ఉండాలి. పూర్తి శ్రమతో అనుకున్న ప్రాంతాల్లో బౌలింగ్ చేయడమే నా లక్ష్యం. నేను ఒకే లెంగ్త్‌లో బౌలింగ్ చేసే బౌలర్ ని కాదు. పిచ్ స్వభావాన్ని బట్టి బౌలింగ్ లెంగ్త్‌ను మార్చుకుంటా. ఇందుకోసం విశ్లేషకులు, కోచ్‌లతో కలిసి చర్చించి.. ఏ లెంగ్త్‌లో బౌలింగ్ చేయాలనే దానిపై నిర్ణయం తీసుకుంటా’ అని ప్రసిద్ధ్ వెల్లడించాడు. దేశానికి ఆడక ముందు తనకంటూ ఒక సహజ లెంగ్త్ ఉండేదని.. కానీ అంతర్జాతీయ స్థాయిలో టీమ్‌కు అవసరమైన ఏ లెంగ్త్లోనైనా బౌలింగ్ చేయడం నేర్చుకోవాల్సి ఉంటుందని ప్రసిద్ధ్ పేర్కొన్నాడు.
తాజావార్తలు
-
VIVO Smart Phones: 6.59 అంగుళాల OLED డిస్ప్లే, 7000mAh బ్యాటరీ, 90W ఫాస్ట్ ఛార్జింగ్.. VIVO నుంచి రెండు స్మార్ట్ ఫోన్స్..
-
Telangana Rain Alert: తెలంగాణలో వాన మోత.. ఈ జిల్లాలకు పిడుగుల ముప్పు
-
Oppo F35 Series: 8000mAh బ్యాటరీ, 80W ఫాస్ట్ ఛార్జింగ్.. మార్కెట్లోకి Oppo నుంచి రెండు స్మార్ట్ ఫోన్స్..
-
Adarsha Kutumbam: రూ.300 కోట్ల హీరో.. తోపు డైరెక్టర్.. అయినా ‘ఆదర్శ కుటుంబం’పై ఇంత సైలెన్స్ ఏంటి?
-
Special Train: శ్రీశైలం, తిరుమల భక్తులతో సోమనాథ్‌కు ప్రత్యేక రైలు.. పూర్తి వివరాలు ఇవే
ట్రెండింగ్
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!