Chikoti Praveen: క్యాసినో కింగ్ చికోటి ప్రవీణ్ మళ్లీ అరెస్ట్ అయ్యాడు. ఇసారి థాయ్ లాండ్ లో పోలీసులు అదుపులో తీసుకున్నారు. జూదం ఆడుతున్నందుకు అరెస్టయ్యాడు. చీకోటితో పాటు హైదరాబాద్‌లో నమోదైన ఈడీ కేసులో ఏ1గా ఉన్న మాధవరెడ్డి, మెదక్ డీసీసీబీ బ్యాంక్ చైర్మన్ చిట్టి దేవేందర్ రెడ్డి ఉన్నారు. పెద్ద మొత్తంలో గ్యాంబ్లింగ్ నిర్వహిస్తున్న 93 మందిని థాయ్ లాండ్ పోలీసులు అరెస్ట్ చేశారు. అరెస్టయిన వారిలో 71 మంది పురుషులు, 16 మంది మహిళలు ఉన్నారు. సుమారు రూ.20 కోట్ల విలువైన గేమింగ్ చిప్‌లను స్వాధీనం చేసుకున్నారు. జూదంలో కీలక పాత్ర పోషించిన మహిళ సితార్నన్ కెల్వెల్కర్‌ను థాయ్‌లాండ్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
Read also: Supreme Court: ఇద్దరికీ ఇష్టం లేకుంటే విడిపోవచ్చు.. సుప్రీం కోర్టు చారిత్రాత్మక తీర్పు
గ్యాబ్లింగ్ కోసం ఒక్కో భారతీయుడి నుంచి రూ.50 వేలు వసూలు చేశారు. మొత్తం రూ.3 లక్షలు వసూలు చేసినట్లు గుర్తించారు పోలీసులు. 93 మందిలో నలుగురు మయన్మార్ జాతీయులు కాగా, ఆరుగురు థాయ్ దేశస్థులు. థాయ్ పోలీసులను చూసి జూదరులు పారిపోయేందుకు ప్రయత్నించారు. నిందితులను థాయ్‌లాండ్‌లోని పట్టాయాలో అదుపులోకి తీసుకున్నారు. చికోటి ప్రవీణ్ ఏప్రిల్ 27 నుంచి ఓ హోటల్‌లో కాన్ఫరెన్స్ హాల్ అద్దెకు తీసుకున్నాడు. ఖరీదైన హోటల్ లో గ్యాంబ్లింగ్ డెన్ ఏర్పాటు చేసిన చికోటీ.. థాయ్ లాండ్ మహిళలతో కలిసి హోటల్ లో క్యాసినో ఏర్పాటు చేసి.. అత్యాధునిక టెక్నాలజీని ఉపయోగించి జూదం నిర్వహిస్తున్నాడు. చీకోటి ప్రవీణ్ కొంతమంది భారతీయులను కూడా జూదం కోసం అక్కడికి తీసుకెళ్లాడు. థాయిలాండ్‌లో జూదం నిషేధించబడింది. పేకాట ఆడుతున్న వారిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. సోమవారం తెల్లవారుజామున పట్టాయాలోని ఒక విలాసవంతమైన హోటల్‌పై దాడి చేసి 80 మంది భారతీయ జూదగాళ్లను అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు. బ్యాంగ్ లాముంగ్ జిల్లాలోని టాంబోన్ నాంగ్ ప్రూలోని సోయి ఫ్రా తమ్నాక్ 4లోని ఆసియా పట్టాయా హోటల్ వద్ద అర్ధరాత్రి దాడి జరిగింది. ఏప్రిల్ 27-మే 1వ తేదీ వరకు పలువురు భారతీయులు హోటల్‌లో గదులు బుక్ చేసుకున్నారని.. గ్యాంబ్లింగ్ కోసం సంపావో అనే కాన్ఫరెన్స్ రూమ్‌ను అద్దెకు తీసుకున్నారని డిటెక్టివ్‌ల నుంచి అందిన సమాచారం మేరకు దాడి చేసినట్లు పోలీసులు తెలిపారు. మొత్తం 100 కోట్లు జూదం ఆడుతూ పట్టుబడినట్లు పోలీసులు తెలిపారు.