Metro Staff: రోడ్డెక్కిన మెట్రో సిబ్బంది.. జీతాలు పెంపుపై అమీర్ పేట్ లో ధర్నా
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Metro Staff: హైదరాబాద్ మెట్రో టికెటింగ్ సిబ్బంది ఈరోజు భారీ నిరసన చేపట్టేందుకు సిద్ధమయ్యారు. గత రెండు రోజులుగా విధులకు హాజరుకాకపోవడంతో ఆందోళన చేస్తున్న యాజమాన్యం తమ డిమాండ్లకు అంగీకరించకపోవడంతో ఈరోజు మళ్లీ ఆందోళనకు దిగనున్నారు. అమీర్ పేట మెట్రో స్టేషన్ వద్ద పెద్ద ఎత్తున ధర్నా నిర్వహించనున్నారు. ఈ నిరసనలో 450 మందికి పైగా మెట్రో టికెటింగ్ సిబ్బంది పాల్గొననున్నారు. ఉద్యోగులకు సంఘీభావంగా, ఇతర కారిడార్లలో కూడా టిక్కెట్ల సిబ్బంది ధర్నా చేయనున్నారు.
Read also: Veera Simha Reddy: ప్రీ-రిలీజ్ ఈవెంట్‌కు అనుమతి నిరాకరణ.. అడ్డా మార్చిన బాలయ్య
Also Read
- Tragedy : ట్యాంక్‌బండ్‌పై విషాదం.. పుట్టినరోజు వేడుకల్లో రెండు ప్రాణాలు బలి..
- Fire Accident : ప్లాస్టిక్ గోదాంలో భగ్గుమన్న మంటలు.. వరుసగా పేలిన కెమికల్ డ్రమ్ములు
- Telangana MLC : తెలంగాణ ఎమ్మెల్సీ రేసులో బిగ్ ట్విస్ట్.. ఆ మూడు సీట్లు ఎవరికి?
- Chanchalguda Jail : చంచల్‌గూడ జైలు సూపరింటెండెంట్‌పై ఆరోపణలు.. జైళ్ల శాఖ క్లారిటీ
తమకు ప్రస్తుతం ఉన్న రూ.11 వేలు నుంచి రూ.20 వేలకు పెంచాలని డిమాండ్ చేస్తున్నారు. గత ఐదేళ్ల నుంచి తమకు జీతాలు పెంచడం లేదని స్టేషన్లలోని టికెట్ కౌంటర్, మెయింటెనెన్స్ విభాగాల్లో పనిచేస్తున్న ఉద్యోగులు వాపోయారు. చాలీచాలని జీతాలు ఇవ్వడమే కాకుండా పని ఒత్తిడి కూడా ఎక్కువగా ఉంటుందన్నారు. ఉద్యోగంలో చాలా ఇబ్బందులు ఉన్నాయని, ఉద్యోగం చేస్తుంటే రిలీవర్ సమయానికి రాకపోతే పట్టించుకోవడం లేదన్నారు. ఒక్కోసారి తినడానికి కూడా సమయం ఉండదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
Read also: Underweight: వయసుకు తగ్గ బరువు లేరా?
2 రోజులుగా ఎల్బీనగర్-మియాపూర్ కారిడార్‌లో విధులకు హాజరుకాకుండా ధర్నా చేస్తున్నా తమ సమస్యలు పరిష్కారం కావడం లేదని మెట్రో సిబ్బంది వాపోతున్నారు. నిన్న కూడా విధులకు హాజరుకాకుండా నాగోల్ మెట్రో డిపో వద్ద నిరసన తెలిపారు. సిబ్బంది ధర్నాతో ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారని భావించిన యాజమాన్యం పది మంది సిబ్బందిని ఆపరేషన్స్ కంట్రోల్ సెంటర్ (ఓసీసీ)కి చర్చల కోసం ఆహ్వానించింది. సంబంధిత కాంట్రాక్ట్ ఏజెన్సీ సంస్థ, కియోలిస్, ఎల్ అండ్ టీ మెట్రో అధికారులు టికెటింగ్ సిబ్బందితో చర్చలు జరిపారు. కార్మికులు తమ వేతనాల పెంపు, మెట్రోలో ఉచితంగా యాక్సెస్ ఇవ్వాలనే ప్రధాన డిమాండ్ లపై పట్టుబట్టారు. వేతనాల పెంపునకు సంబంధించి ఏజెన్సీలు కొంత సమయం కోరినట్లు చర్చల్లో పాల్గొన్న TCMO తెలిపింది. తమ డిమాండ్లను నెరవేర్చకుంటే ఇతర కారిడార్లలో టిక్కెట్టు ఇచ్చే సిబ్బందితో కలిసి పోరాటం చేస్తామని తెలిపారు. టికెటింగ్ సిబ్బంది లేకపోవడంతో మెట్రో స్టేషన్లలో స్టేషన్ కంట్రోలర్లు, ఇతర సిబ్బంది టిక్కెట్లు జారీ చేశారు. చర్చలు అసంపూర్తిగా ఉన్నందున ఈరోజు భారీ నిరసనకు పిలుపునిచ్చారు. అయితే మెట్రో స్టేషన్ సిబ్బంది 3రోజులుగా విధులు బహిష్కరిస్తు తమ డిమాండ్ లు పూర్తి చేయాలని చెబుతున్న ఇప్పటి వరకు ప్రభుత్వం స్పందించక పోవడంపై చర్చనీయాంశకంగా మారింది.
Anantapur JNTU: అనంతపురం జేఎన్టీయూలో విద్యార్థి ఆత్మహత్య..
తాజావార్తలు
-
Kash Patel Engaged: FBI డైరెక్టర్ కాష్ పటేల్‌కు ఎంగేజ్మెంట్.. ప్రియురాలు అలెక్సిస్ విల్కిన్స్ ఎవరు?
-
Family Secrets Leak : ఇంటి గుట్టు లంకేశ్వరుడికి ఎరుక.. కుటుంబ రహస్యాలు పొరుగువారికి చేరుతున్నాయా.?
-
Bloody Romeo : రోమియో పక్కన జూలియట్‌గా ప్రీతిముకుందన్?
-
Tirumala Leopard : తిరుమల నడకమార్గంలో చిరుత.. భక్తులకు టీటీడీ అలర్ట్.!
-
Imran Khan Release Protest: ఇమ్రాన్ ఖాన్ విడుదల కోసం భారీ ఉద్యమం.. ఇస్లామాబాద్‌లో 144 సెక్షన్, 2 వేల మంది అరెస్ట్
ట్రెండింగ్
-
World Teachers Day 2026 : చాట్‌జీపీటీ అన్నీ చెప్పేస్తుందా.. మరి టీచర్ ఎందుకు కావాలి.?
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!