సాధారణంగా బరువు తగ్గాలంటే కష్టం.. కానీ, పెరగటం కష్టమే కాదనుకుంటారు.
కొందరు వారి ఎత్తు, వయసుకు తగ్గ బరువు ఉండరు. దీంతో వారు బలహీనంగా ఉన్నట్టు కనిపిస్తుంటారు.
తక్కువ బరువు సమస్య అధిగమించడానికి ప్రయత్నిస్తారు. వయసును బట్టి ఎత్తుండాలి. ఎత్తుకు సరిపడా శరీర బరువుండాలి.
ఈ జనరేషన్ వారు తీసుకొనే ఆహారంలో పోషకలోపం, హార్మోన్లలో సమతుల్యత లేకపోవటం వల్లే తక్కువ బరువు ఉంటారు.
టైంకు తినకపోవడం, మానసిక, ఆరోగ్య సమస్యలు తక్కువ బరువుకు మరో కారణం.
రక్తహీనత, దీర్ఘకాలిక జబ్బుల కారణంగా వెయిట్ పెరగలేరు. ముందుగా బరువు పెరుగుదలకు అడ్డంకి ఏంటో తెలుసుకోవాలి.
డాక్టర్ను సంప్రదించి, వారి సూచనలు పాటించాలి.
ఆరోగ్యపరంగా శరీరంలో ఎలాంటి సమస్య లేదని నిర్ధారించుకొని, తినే ఆహారంపై శ్రద్ధ పెట్టాలి.