Sri Lakshmi Constructions Fraud: శ్రీలక్ష్మీ కన్‌స్ట్రక్షన్స్ ఎండి గుర్రం విజయలక్ష్మీ అరెస్టు.. రిమాండ్కు తరలింపు!
- శ్రీలక్ష్మీ కన్‌స్ట్రక్షన్స్ ఎండి విజయలక్ష్మీ అరెస్టు.. రిమాండ్కు తరలింపు!..
- అమెరికాకు పారిపోతుండగా ఎయిర్ పోర్టులోనే విజయలక్ష్మీ అరెస్ట్..
- విజయలక్ష్మీ అరెస్ట్ వివరాలు వెల్లడించిన మేడ్చల్ ఏసీపీ శ్రీనివాస్ రెడ్డి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Sri Lakshmi Constructions Fraud: మేడ్చల్ జిల్లా దిండిగల్ పరిధిలో మల్లంపేటలోని శ్రీలక్ష్మీ కన్‌స్ట్రక్షన్స్ ఎండీ గుర్రం విజయలక్ష్మిని పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించారు. ప్రభుత్వ స్థలాలు ఆక్రమించి.. అనుమతులు లేకుండా నిర్మాణాలు చేపట్టి.. తమను మోసం చేసి తప్పించుకుని తిరుగుతోందంటూ విజయలక్ష్మీపై పోలీసులకు బాధితులు కంప్లైంట్ చేశారు. ఈ నేపథ్యంలో శంషాబాద్ ఎయిర్ పోర్ట్ నుంచి అమెరికాకు పారిపోతుండగా పట్టుకుని దుండిగల్ పీఎస్ కు తీసుకెళ్లారు. ఈ సందర్భంగా ఎన్ టీవీతో మేడ్చల్ ఏసీపీ శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ.. భావన జీఎల్‌సీ వెంచర్ పేరుతో ప్రభుత్వ భూమి, చెరువులో విల్లాలను నిర్మించారు.. గుర్రం విజయ లక్ష్మీపై దాదాపు 300 మందికి పైగా బాధితులు పోలీసులను ఆశ్రయించారని పేర్కొన్నారు. 2021 నుంచి ఆమెపై ఏడుకు పైగా కేసులు నమోదు అయ్యాయి.. ఇందులో 5 కేసుల్లో కోర్టు నుంచి నాట్ టూ అరెస్టు ఆర్డర్ తెచ్చుకుంది.. మరో రెండు కేసులను బయటికి తెలియకుండా జాగ్రత్త పడ్డాం అని ఏసీపీ శ్రీనివాస్ రెడ్డి చెప్పారు.
Read Also: Bandi Sanjay Kumar: ఎన్నికల కోడ్ సాకుతో రైతు భరోసా పథకాన్ని ఆపేందుకు కుట్ర
Also Read
- Fake IPS Officer: నకిలీ ఐపీఎస్ ముఠా గుట్టురట్టు.. సూడో పోలీస్ వ్యవస్థ ఏర్పాటు చేసి కిడ్నాప్‌లు, వసూళ్లు!
- Terrorist Arrest: మేడ్చల్‌లో ఐఎస్ఐ లింకుల కలకలం.. వ్యక్తి అరెస్ట్.!
- Fire Accident : మంటలతో పెట్రోల్ బంకులోకి దూసుకెళ్లిన ఓమ్నీ వ్యాన్
- Hyderabad: తమపై చట్నీ పడేశాడని దారుణం.. అర్ధరాత్రి కారులో తిప్పుతూ సిగరెట్లతో కాల్చి హత్య..
ఇక, ఈ రెండు కేసులను బేస్ చేసుకొని శ్రీలక్ష్మీ కన్‌స్ట్రక్షన్స్ ఎండీ గుర్రం విజయలక్ష్మీకి లుక్ ఔట్ నోటీసులు జారీ చేసేలా చర్యలు చేపట్టామని ఏసీపీ శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. ఆమె అమెరికన్ సిటిజన్, గ్రీన్ కార్డ్ హోల్డర్ కావడంతో ఎప్పటికైనా అమెరికాకు పారిపోతుందని భావించాం.. ఇదే క్రమంలో బుధవారం అర్ధరాత్రి దాటిన తర్వాత శంషాబాద్ ఎయిర్ పోర్ట్ నుంచి అమెరికాకు వెళ్లేందుకు చెక్ ఇన్ అయ్యింది.. సమాచారం అందుకున్న వెంటనే ఎయిర్ పోర్ట్ లో విజయ లక్ష్మీని అదుపులోకి తీసుకున్నామని వెల్లడించారు. లీగల్ గా ఆమెపై అన్ని రకాల చర్యలు చేపట్టేలా ఎవిడెన్స్ సేకరించాం.. గ్రీన్ కార్డు హోల్డర్ అయినా ఎలాంటి ఇబ్బందులు ఉండవు.. ఒకవేళ ఏదైనా ఇబ్బంది ఉంటే విజయ లక్ష్మీకే ఉంటుంది అన్నారు. ఐదు రోజుల పాటు ఆమెను కస్టడీకి ఇవ్వాలని పిటీషన్ దాఖలు చేశాం.. కస్టడీలోకి తీసుకున్న తర్వాత విల్లా డబ్బులు ఎక్కడికి బదిలీ చేసింది అనేది తేలుస్తామని మేడ్చల్ ఏసీపీ శ్రీనివాస్ రెడ్డి పేర్కొన్నారు.
తాజావార్తలు
-
Ind vs WI : అభిషేక్ శర్మ మెరుపు అర్ధశతకం.. వెస్టిండీస్‌పై భారత్ ఘన విజయం.!
-
CM Revanth Reddy: గోవాలో బీజేపీపై రేవంత్ రెడ్డి ఫైర్.. ‘ప్రాపర్టీ సావంత్’ అంటూ సెటైర్లు!
-
Naresh: సినిమా నచ్చకపోతే గచ్చిబౌలికి రండి.. తేల్చుకుందాం: నరేష్ ఓపెన్ ఛాలెంజ్
-
Ukraine War: రష్యా-ఉక్రెయిన్ మధ్య ‘‘ఎనర్జీ సీజ్-ఫైర్’’.. ట్రంప్ సంచలన ప్రకటన.!
-
Crazy Kalyanam Trailer: రచ్చలేపుతున్న ‘క్రేజీ కల్యాణం’ ట్రైలర్! చూశారా..
ట్రెండింగ్
-
Wife for Hire : అద్దె భార్యలు.. లక్షల నుంచి కోట్ల వరకు ఒప్పందాలు
-
Most Intelligent: 12 ఏళ్ల వయసుకే 180 IQ.. ఐన్‌స్టీన్‌ను మించిన భారతీయ బాలమేధావి..
-
Lunch Recipes: ఇంటికి చుట్టాలొస్తే కంగారేలా.? చిటికెలో సులువుగా చేసుకోగల రకరకాల కమ్మని కూరలు ఇదిగో..!
-
EPFO Update: పీఎఫ్ డబ్బుల డ్రాపై ఈపీఎఫ్ఓ కొత్త రూల్.. ఇకపై ఆ ఫారమ్‌లు పనిచేయవు!
-
Cockroach Control Tips: వంటింట్లో బొద్దింకలు తిరుగుతూ చికాకు తెప్పిస్తున్నాయా.? ఈ చిట్కాతో శాశ్వతంగా సమస్యకు చెక్ పెట్టండి..!