Hyderabad: హైదరాబాద్‌లోని నాచారం ప్రాంతంలో దారుణ ఘటన చోటుచేసుకుంది. ఒంటి మీద చట్నీ పడేశాడని ఓ వ్యక్తిని కొందరు యువకులు కిరాతంగా హతమార్చారు. రెండు గంటల పాటు కారులో తిప్పుతూ.. సిగరెట్లతో కాల్చుతూ చివరికి కత్తితో దారుణంగా హత్య చేశారు. ఈ నలుగురి నిందితులలో ఒక మైనర్ కూడా ఉన్నాడు. నాచారంలో అర్ధరాత్రి 2 గంటలకు కారులో షికారు చేస్తున్న మహమ్మద్ జునైద్(18), షేక్ సైఫుద్దీన్(18), మణికంఠ (21), మరో బాలుడు(16) ఉన్నట్లు గుర్తించారు.
Read Also: Poker Game In Excise PS: చట్టాన్ని ఉల్లంఘించిన పోలీసులు.. చెన్నూరు ఎక్సైజ్ స్టేషన్‌లో పేకాట..
అయితే, ఎల్బీ నగర్ దగ్గర ఉప్పల్ కి చెందిన మురళి కృష్ణ లిఫ్ట్ అడిగాడు. ఎన్జీఆర్ఐ ప్రాంతంలో యువకులతో కలిసి టిఫిన్ చేస్తుండగా.. ఒక యువకుడిపై అనుకోకుండా చట్నీ పడింది. దీంతో మురళి కృష్ణను కారులో బలవంతంగా ఎక్కించుకుని.. లిఫ్ట్ ఇచ్చిన మా మీదే చట్నీ పోస్తావా అంటూ పిడి గుద్దులతో దాడి చేశాడు. రెండు గంటలు కారులో తిప్పుతూ.. సిగరెట్లతో కాల్చుతూ.. కత్తితో మురళి కృష్ణను పొడిచేశారు. నిందితుల నుంచి తప్పించుకునేందుకు కారు దూకి పారిపోతుండగా.. వెంబడించి మరీ దారుణంగా హత్య చేశారు. మురళి కృష్ణ చనిపోయాడని నిర్ధారించుకుని మార్గ మధ్యలో కత్తి పడేసి మల్లాపూర్ కేఎల్ రెడ్డి నగర్ ప్రాంతంలో కారు పార్క్ చేసి నలుగురు యువకులు పారిపోయారు. ఇక, విషయం తెలిసిన పోలీసులు నిందితులను సెల్ ఫోన్ సిగ్నల్ ఆధారంగా పట్టుకుని అరెస్టు చేసి రిమాండుకు తరలించారు.