Sri Lakshmi Constructions Fraud: మేడ్చల్ జిల్లా దిండిగల్ పరిధిలో మల్లంపేటలోని శ్రీలక్ష్మీ కన్‌స్ట్రక్షన్స్ ఎండీ గుర్రం విజయలక్ష్మిని పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించారు. ప్రభుత్వ స్థలాలు ఆక్రమించి.. అనుమతులు లేకుండా నిర్మాణాలు చేపట్టి.. తమను మోసం చేసి తప్పించుకుని తిరుగుతోందంటూ విజయలక్ష్మీపై పోలీసులకు బాధితులు కంప్లైంట్ చేశారు. ఈ నేపథ్యంలో శంషాబాద్ ఎయిర్ పోర్ట్ నుంచి అమెరికాకు పారిపోతుండగా పట్టుకుని దుండిగల్ పీఎస్ కు తీసుకెళ్లారు.