Dhanush : ‘జాబిలమ్మ నీకు అంత కోపమా’ టైటిల్ తో ధనుష్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ గతేడాది నటించిన కెప్టెన్ మిల్లర్ కాస్త నిరాశపరిచింది. కానీ ధనుష్ స్వయంగా హీరోగా నటిస్తూ దర్శకత్వం వహించిన చిత్రం ‘రాయన్’ సూపర్ హిట్ సాధించింది. అంతే కాదు ధనుష్ కెరీర్ లోనే బిగ్గెస్ట్ కలెక్షన్స్ రాబట్టిన సినిమాగా రికార్డు సాధించింది. రాయన్ సక్సెస్ తో ఫుల్ జోష్ మీద ఉన్న ధనుష్ హీరోగా కంటే కూడా దర్శకుడిగానే ఎక్కువ ఫోకస్ చేస్తునట్టు కనిపిస్తుంది. అందులో భాగంగానే తన డైరెక్షన్ లో వరుస సినిమాలు ప్రకటించాడు ధనుష్.
ధనుష్ మేనల్లుడు పవీష్‌ను కోలీవుడ్ లో హీరోగా ఇంట్రడ్యూస్ చేస్తూ రూపొందిస్తున్న లవ్ అండ్ రొమాంటిక్ మూవీ ‘నిలవుక్కు ఎన్మేల్ ఎన్నాడీ కోబం’. ఈ సినిమాకు దర్శకుడిగానే కాకుండా నిర్మాతగానూ వ్యవహరిస్తున్నాడు ధనుష్. ఈ సినిమాను తెలుగులోనూ తీసుకువస్తున్నాడు ధనుష్. అయితే తెలుగులో ఈ NEEK సినిమాకు ‘జాబిలమ్మ నీకు అంత కోపమా’ అనే టైటిల్ ను ఫిక్స్ చేసాడు ధనుష్. సాఫ్ట్ టైటిల్ తో తెలుగులో ఈ సినిమాపై క్రేజ్ ను పెంచేసాడు ధనుష్. తమిళ్ స్టార్ సంగీత దర్శకుడు G.V ప్రకాష్ మ్యూజిక్ అందించిన ఈ సినిమా ఫిబ్రవరి 21 న వరల్డ్ వైడ్ గా రిలీజ్ కానుంది. మొదటి సినిమాతో రివెంజ్ డ్రామా కథ నేపధ్యాన్ని ఎంచుకున్న ధనుష్ ఈ దఫా సున్నితమైన ప్రేమ కథాంశాన్ని ఎంచుకున్నాడు. మరి జాబిలమ్మ నీకు అంత కోపమా తో హిట్ ట్రాక్ ను కంటిన్యూ చేస్తాడో లేదో చూడాలి.
Also Read
తాజావార్తలు
-
Asian Games 2026 : ఆసియా క్రీడలు షురూ.. త్రివర్ణ పతాకంతో మెరిసిన మను భాకర్, పవన్ సెహ్రావత్!
-
DUSU Elections 2026: చెప్పులు లేకుండా ప్రచారం.. ABVP, NSUIలను చిత్తుగా ఓడించిన దీపాంశు షోకీన్..
-
Mumbai: భార్యకు తెలియకుండా ప్రియురాలితో విదేశీ టూర్.. సీన్ కట్ చేస్తే..!
-
DUSU Elections: ఢిల్లీ యూనివర్సిటీలో ABVP విజయం.. జెన్-జీ తర్వాత తొలి తీర్పు
-
Curd in Fridge: ఫ్రిజ్‌లో పెరుగు పెట్టారా? ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు తినొద్దు..
ట్రెండింగ్
-
Pat Cummins: కోహ్లీ, రోహిత్ కాదు.. అతడే వెరీ టఫ్.. వికెట్ ఇవ్వకుండా విసిగించేవాడు!
-
Gautam Gambhir: నా కోచింగ్ కెరీర్లోనే అదే కఠిన నిర్ణయం.. అతడు చాలా ఏడ్చాడు.. గంభీర్ షాకింగ్ కామెంట్స్!
-
iPhone 18 India Sales: ఐఫోన్ 18 కోసం 12 గంటల పాటు స్టోర్ల వద్ద క్యూ.. తొలి రోజే రికార్డ్ స్థాయి అమ్మకాలు..!
-
బడ్జెట్లో Kia Carens Clavis ఆటోమేటిక్.. కొత్త వేరియంట్స్ వచ్చేశాయి.!
-
649cc ఇంజిన్, 14 లీటర్ల ఫ్యూయల్ ట్యాంక్‌తో Kawasaki Vulcan S కొత్త క్రూయిజర్ బైక్ లాంచ్..!