Bhudaan Lands: భూదాన్ భూముల కేసులో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. భూదాన్ ల్యాండ్ కేసులో భూదాన్ బోర్డ్ నోటీసులు జారీ చేసింది. ఎమ్మార్వో తో పాటు నలుగురికి నోటీసులు జారీ చేసింది. ఖాదరునిసా, సంతోష్ కుమార్, విశ్వనాథ్ రెడ్డి, తహసిల్దార్ కు భూదాన్ బోర్డు నోటీసులు పంపింది. డిసెంబర్ 6న భూదాన్ బోర్డు సెక్రటరీ ముందు హాజరు కావాలని నోటీసులో పేర్కొంది.
Read also: CM Revanth Reddy: కుల సర్వేలో కుటుంబ వివరాలు నమోదు చేసుకున్న సీఎం..
జరిగింది ఇదీ..
మేడ్చల్ జిల్లాల్లో అమోయ్ కుమార్ కలెక్టర్‌గా పనిచేసిన సమయంలో జరిగిన భూ లావాదేవీలపై బాధితులు ఈడీ అధికారులకు లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేశారు. దీంతో ఈడీ ఇప్పటికే అమోయ్ కుమార్‌ను పలుమార్లు ప్రశ్నించింది. రూ.కోట్ల విలువైన 42 ఎకరాల భూమిని మార్కెట్ ధర కంటే తక్కువ ధరకు ఇతరులకు కేటాయించడంపై 5 రోజులుగా ప్రశ్నించారు. ఈ మేరకు అధికారులు తొలుత అమోయ్ కుమార్, మహేశ్వరం తహశీల్దార్ వాంగ్మూలాలను నమోదు చేశారు. వారు ఇచ్చిన వాంగ్మూలాల ఆధారంగా అప్పటి ఆర్డీఓ వెంకటాచారికి కూడా నోటీసులు జారీ చేసి విచారించారు. వారు ఇచ్చిన కీలక పత్రాల ఆధారంగా రంగారెడ్డి, మేడ్చల్-మల్కాజిగిరి భూ ఆక్రమణలపై పూర్తి ఆధారాలను ఈడీ సేకరించి డీజీపీకి నివేదిక సమర్పించింది. తాజాగా భూదాన్ భూముల కేసులో అక్రమ లావాదేవీలపై భూదాన్ బోర్డు స్పందించింది. ఈ మేరకు ఈరోజు బోర్డు తహసీల్దార్ జ్యోతితోపాటు మరో నలుగురికి నోటీసులు జారీ చేసింది. డిసెంబర్ 6న విచారణకు హాజరు కావాలని నోటీసుల్లో బోర్డు అధికారులు కోరారు.
BRSV State Secretary: బీఆర్ఎస్‌వీ స్టేట్ సెక్రటరీ నాగారం ప్రసాద్ అరెస్ట్..