CM Revanth Reddy: కుల సర్వేలో భాగంగా ఇవాళ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వివరాలు నమోదు చేసుకున్నారు. సీఎం రేవంత్ రెడ్డి కుటుంబ వివరాలను ఎన్యుమరేటర్, అధికారులు నమోదు చేసుకున్నారు. హైదరాబాద్ కలెక్టర్ అనుదీప్, జీహెచ్ఎంసీ కమిషనర్ ఇంలంబర్తి, సీఎం స్పెషల్ సెక్రటరీ అజిత్ రెడ్డి, తదితరులు ఈకార్యక్రమంలో పాల్గొన్నారు. అనంతరం సర్వే పురోగతిపై అధికారులను వివరాలను అడిగి తెలుసుకున్నారు సీఎం. ప్రజల నుంచి స్పందన ఎలా ఉందని అధికారులను ఆరా తీశారు సీఎం. హైదరాబాద్ పరిధిలో వీవీఐపీలు, ఐఏఎస్, ఐపీఎస్, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఇతర ప్రజా ప్రతినిధుల కోసం ప్రత్యేక డ్రైవ్ నిర్వహించి వివరాలు నమోదు చేయాలని అధికారులను సీఎం ఆదేశించారు. ప్రభుత్వ ఉద్యోగులు ఖచ్చితంగా సర్వేలో వివరాలు నమోదు చేసుకోవాల్సిందిగా ఆదేశాలు జారీ చేయాలని అధికారులను సీఎం ఆదేశించారు. వీలయినంత త్వరగా కుల సర్వే పూర్తి చేసేందుకు చర్యలు తీసుకోవాలని సూచించారు.
Read also: Ponnam Prabhakar: విద్యార్థుల మీద రాజకీయం చేయవద్దు.. మంత్రి పొన్నం ఆగ్రహం..
సామాజిక, ఆర్థిక, విద్య, ఉద్యోగ, రాజకీయ, కులగణన సర్వే బుధవారం నాటికి రాష్ట్ర వ్యాప్తంగా 95 శాతం పూర్తయింది. ఈ సమగ్ర ఇంటింటి సర్వేలో మొత్తం 1,18,02,726 నివాసాలను గుర్తించారు. బుధవారం నాటికి 1,10,98,360 నివాసాలలో సమాచార సేకరణ పూర్తవగా.. కేవలం 7,04,366 నివాసాల సర్వే సమాచారాన్ని మాత్రమే సేకరించాల్సి ఉంది. సేకరించిన వివరాలను అధికారులు కంప్యూటరీకరించడంలో పూర్తి జాగ్రత్తలు తీసుకొంటూ వేగవంతంగా సమాచారాన్ని కంప్యూటరీకరిస్తున్నారు. ఈ ప్రక్రియనంతా సంబందిత ఉన్నతాధికారులు నేరుగా పర్యవేక్షిస్తున్నారు.
BRSV State Secretary: బీఆర్ఎస్‌వీ స్టేట్ సెక్రటరీ నాగారం ప్రసాద్ అరెస్ట్..