Anil Murder : మెదక్ జిల్లాలో సంచలనం రేపిన కాంగ్రెస్ నాయకుడు అనిల్ హత్యకేసులో కొత్త పరిణామాలు వెలుగుచూశాయి. ఈ నెల 14న వరిగుంతం శివారులో గన్‌తో కాల్పులు జరిపి అనిల్‌ను హత్య చేసిన నిందితులు పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. పోలీసుల ప్రాథమిక దర్యాప్తులో అనిల్ హత్యకు మెదక్ జిల్లా రంగంపేట గ్రామంలోని ఓ ఇంటి స్థలం వివాదమే ప్రధాన కారణమని అనుమానం వ్యక్తమవుతోంది. కొన్ని రోజుల క్రితం ఇంటి స్థలం విషయమై ఇంటి యజమానిని బెదిరించడమే కాకుండా, కుటుంబ సభ్యులను కూడా అనిల్ దూషించినట్టు సమాచారం. దీంతో సదరు వ్యక్తి అనిల్‌పై కక్ష పెంచుకుని హత్యకు పూనుకున్నట్లు పోలీసులు భావిస్తున్నారు.
Wife Kills Husband: బావతో వివాహేతర సంబంధం, భర్తకు నిద్రమాత్రలు ఇచ్చి హత్య..
అనిల్ హత్యను అమలు చేయడానికి ఓ సుపారి బ్యాచ్‌ను ఒప్పందం చేసుకున్నట్లు దర్యాప్తులో తెలిసింది. హత్యకు కొన్ని నిమిషాల ముందు వరకు అనిల్‌తో కారులోనే సూత్రధారి ఉన్నాడని అనుమానం వ్యక్తమవుతోంది. ఈ కేసులో కొందరు సొంత గ్రామస్తుల హస్తం కూడా ఉన్నట్టు ఆరోపణలు వినిపిస్తున్నాయి. పూర్తి వివరాలను రాబోయే రెండురోజుల్లో ఎస్పీ అధికారికంగా ప్రకటించే అవకాశం ఉంది. నిందితుల విచారణ కొనసాగుతుండగా, హత్య వెనుక ఉన్న ముళ్లను విప్పేందుకు పోలీసులు వేగవంతంగా దర్యాప్తు చేస్తున్నారు.
AM Ratnam: హరి హర వీరమల్లు కల్పిత పాత్ర.. ప్రెజర్ ను బాధ్యతగా ఫీల్ అవుతున్నా!