Marri Shashidhar Reddy: కాంగ్రెస్ పార్టీకి క్యాన్సర్ సోకింది.. రేవంత్ తీరు సరిగ్గా లేదు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Marri Shashidhar Reddy: కాంగ్రెస్ పార్టీకి క్యాన్సర్ సోకిందని, రేవంత్ రెడ్డి వ్యవహార శైలి సరిగ్గా లేదని కాంగ్రెస్‌లో కీలక నేత మర్రి శశిధర్ రెడ్డి మండిపడ్డారు. ఢిల్లీలో ఆయన మీడియాతో మాట్లాడారు. టీఆర్ఎస్ ను ఎదుర్కొనే పరిస్థితిలో కాంగ్రెస్ లేదని సంచలన వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ పార్టీకి క్యాన్సర్ సోకిందని అన్నారు. అది నయం చేయలేని స్థితికి చేరుకుందని తెలిపారు. ఒక హోంగార్డు కాంగ్రెస్ పార్టీ నుంచి పోతే పోయేదేమీ లేదని అన్నారు. రేవంత్ రెడ్డి వ్యవహార శైలి సరిగ్గా లేదని ఆరోపించారు. మునుగోడు ఉప ఎన్నికల్లో తాను 10 కోట్లు ఖర్చు పెడతానని చెప్పి ఒక రూపాయి కూడా ఖర్చు పెట్టలేదని అన్నారు. ఇన్చార్జులతో డబ్బు ఖర్చు పెట్టించి వారిని డొల్ల చేశాడని ఆరోపించారు. ఖర్చు పెట్టకపోతే టికెట్లు, పదవులు ఇవ్వనని బెదిరించాడని అన్నారు. కాంగ్రెస్ పార్టీ నాయకులకు రేవంత్ అందుబాటులో ఉండడని మండిపడ్డారు.
Read also: Jaya Jaya Jaya Jaya Hey: తెలుగులో రాబోతున్న మలయాళ చిత్రం!
Also Read
చెంచా గాళ్లను పెట్టి పార్టీని నడిపిస్తున్నాడని ఆగ్రహం వ్యక్తం చేశారు. తన లాగే చాలామంది పార్టీని వీడే అవకాశం ఉందని అన్నారు. 3000 నుంచి 20వేల కు ఓట్లు పెరిగాయని సంబరపడడం అవివేకమన్నారు. వచ్చే ఎన్నికల్లో పదిహేను మందిని గెలిపించుకొని తన సొంత దుకాణం చూసుకోవాలని రేవంత్ భావిస్తున్నారని తెలిపారు. రేవంత్ కు పీసీసీ ఇవ్వొద్దని వారించిన వారిలో నేను ఒకర్ని అంటూ ఆవేదన వ్యక్తం చేశారు. తెలంగాణ పార్టీ పరిస్థితులపై మూణ్ణెళ్ల క్రితమే అధిష్టానానికి చెప్పానని అన్నారు. కాంగ్రెస్ నుంచి మారుతా అని అనుకోలేదని తెలిపారు. Always కాంగ్రెస్ మ్యాన్ ని అనుకున్నా కానీ.. తప్పని పరిస్థితుల్లో తప్పడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. నేను రాజకీయ నాయకుణ్ణి, ఇంకా రిటైర్ కాలేదని మర్రి శశిధర్ రెడ్డి చెప్పుకొచ్చారు.
Andhra Pradesh: మచిలీపట్నం పోర్టు నిర్మాణానికి రూ.3,940 కోట్ల రుణం మంజూరు
తాజావార్తలు
-
Story Board: Fly Dubai విమానంలో అసలేం జరిగింది..?
-
Punjab: కాంగ్రెస్ కొత్త అధ్యక్షుడిగా పర్గత్ సింగ్ నియామకం.. వరంగ్ స్థానంలో మాజీ హాకీ కెప్టెన్‌కు అవకాశం
-
Harish Rao: టీజీ ట్రాన్స్‌కో వాటాల విక్రయంపై రాహుల్ గాంధీకి హరీశ్ రావు లేఖ
-
OTR: తాడేపల్లిలో జగన్ మార్క్ క్లాస్! స్థానిక ఎన్నికల్లో పోటీ చేసి తీరాల్సిందేనా?
-
Off The Record: విజయవాడ మేయర్ సీటుపై వైసీపీ మైండ్ గేమ్?
ట్రెండింగ్
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
-
Breakfast Quesadillas: రోజూ టిఫిన్ గురించి టెన్షన్ వద్దు.. జస్ట్ 20 నిమిషాల్లో రెడీ అయ్యే ఈ బ్రేక్‌ఫాస్ట్‌ను ట్రై చేయండి..