Mallu Bhatti Vikramarka: కేసీఆర్ చెప్పే అబద్దాలు అసహ్యంచుకునే తెలంగాణ ప్రజలు వాళ్లను బండకేసి కొట్టి మరీ ఇందిరమ్మ రాజ్యాన్ని తెచ్చుకున్నారని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క అన్నారు. పాలేరు నియోజకవర్గం కూసుమంచి కార్నర్ మీటింగ్ లో భట్టి మాట్లాడుతూ.. అబద్దాల పునాదులపై బీఆర్ఎస్ పార్టీ నిర్మించబడిందన్నారు. కేసీఆర్ నోరు తెరిస్తే చెప్పేది అబద్దమే అన్నారు. కేసీఆర్ చెప్పే అబద్దాలు అసహ్యంచుకునే తెలంగాణ ప్రజలు వాళ్లను బండకేసి కొట్టి మరీ ఇందిరమ్మ రాజ్యాన్ని తెచ్చుకున్నారని తెలిపారు. అబద్దాలతో, కట్టు కథలతో ఈ దేశాన్ని పాలిస్తున్న నరేంద్ర మోడీ, బీజేపీ ప్రభుత్వానిిక బుద్ధి చెప్పాల్సిన అవసరం ఉందన్నారు. ఈ దేశ సంపదను, వనరులను ప్రజలకు చెందకుండా తన సన్నిహితులపై క్రోని కేపిటలిస్టులకు మోడీ కట్టబెడుతున్నారు.
Read also: Smriti irani: ఐదేళ్లలో స్మృతి ఇరానీ ఆస్తులెంత పెరిగాయంటే..!
దేశ సంపదను ప్రధాని మోడీ, రాష్ట్ర సందను కేసీఆర్ ఈ పదేళ్లలో దోచేశారు. మరోసారి బీజేపీతో బీఆర్ఎస్ చేతులు కలిపి సంపదను దోపిడీ చేసే ప్రయత్నం చేస్తున్నారని తెలిపారు. ఒక వైపు రాజ్యాంగాన్ని, ప్రజాస్వామ్యాన్ని తుంగలో తొక్కే బీజేపీ-మోడీ ఒకవైపు, ప్రజాస్వామ్యాన్ని కాపాడేందుకు, దేశ సందను ప్రజలకు పంచాలనే రాహుల్ గాంధీ మరోవైపు ఈ సార్వత్రిక ఎన్నికల్లో ప్రజలకు దగ్గరకు వచ్చారన్నారు. మనమంతా రాహుల్ గాంధీకి మద్దతుగా కాంగ్రెస్ పార్టీ నిర్ణయించిన ఖమ్మం అభ్యర్తి రామసహాయం రఘురామిరెడ్డికి ఓట్లేసి అత్యధిక మెజారిటీతో గెలిపించాలని కోరుతున్నా అని తెలిపారు.
Read also: Kesineni Nani: గడప గడపకు ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న కేశినేని శ్వేతా
మండుటెండలను సైతం లెక్కచేయకుండా మా కోసం వచ్చిన మీకు హృదయపూర్వక నమస్కారాలు తెలిపారు. నిన్న ఇక్కడకు వచ్చిన మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్.. నోటికి వచ్చిన అబద్దాలన్నీ చెప్పి వెళ్లారని మండిపడ్డారు. అబద్దాల పునాదులపై బతుకుతున్న బీఆర్ఎస్ నాయకులు మాట్లాదుడూ.. కాంగ్రెస్ అధిారంలోకి వస్తే హామీలు అమలు చేయలేరని అబద్దాలు మాట్లాడుతున్నారు. మేము అధికారంలోకి వచ్చిన వెంటనే ఆడబిడ్డలకు ఉచిత బస్సు ప్రయాణం, ఆరోగ్య శ్రీని రూ. 10 లక్షలకు పెంచడం చేశామన్నారు. మార్చి ఒకటో తేదీనుంచి 200 యూనిట్ల కన్నా తక్కువ విద్యుత్ వినియోగించే పేద కుటుంబాలకు జీరో కరెంట్ బిల్లు ఇవ్వడం జరిగిందన్నారు. నిరుపేద, అర్హత కలిగిన అబ్దిదారులకు రూ. 500కే గ్యాస్ ఇస్తున్నామన్నారు.
Read also: Prasanna Vadanam : ఆసక్తి రేకెత్తిస్తున్న “ప్రసన్నవదనం”రిలీజ్ ట్రైలర్..
అంతేకాక ప్రతి నియోజకవర్గంలో నిరుపేదల కోసం 3,500 రెండు గదుల ఇందిరమ్మ ఇండ్లను నిర్మిస్తున్నాం.. వారికి తప్పకుండా అందిస్తామన్నారు. స్థానిక మంత్రిగారు అడుతున్నారు.. మా పాలేరు నియోజకవర్గంలో పేదలు, దళిత, గిరిజనులు అధికంగా ఉంటారు.. మాకు అధికంగా ఇండ్లు మంజూరు చేయాలని కోరారు. తప్ప కుండా అధికంగానే ఇండ్లను మంజూరు చేస్తామన్నారు. కేసీఆర్ తప పదేళ్లలో ఏనాడైనా పంట నష్టాన్ని అంచనా వేసి.. పరిహారాన్ని అందించారా? అని ప్రశ్నించారు. ఇందిరమ్మ రాజ్యంలో ఇప్పుడు జరిగిన పంట నష్టంపై ఎన్యూమరేట్ చేయాలని ఆదేశించాం.
Read also: Sunil Narine: టీమ్ మీటింగ్‌లకు సునీల్ నరైన్ రాడు: శ్రేయస్ అయ్యర్
జరిగిన నష్టంకు సంబంధించిన లెక్కలను కూడా తెప్పించుకున్నాం. తప్పకుండా పరిహారాన్ని అందిస్తాం. బడ్జెట్ లో కూడా కేటాయింపులు చేశామన్నారు. పబ్లిక్ సర్వీస్ కమిషన్ ను ప్రక్షాళన చేశాము. కేలండర్ ప్రకారం నోటిఫికేషన్లు ఇస్తాం.. ఉద్యోగాలను భర్తీ చేస్తామన్నారు. రాష్ట్రంలోని వర్సిటీల్లో విద్యుత్, తాగు నీరు పుష్కలంగా అందుబాటులో ఉంది. విద్యార్థులంతా అక్కడే ఉండి కాంపిటేటివ్ పరీక్షలకు ప్రిపేర్ కావచ్చన్నారు. విద్యుత్ కోతలపై పదేళ్లుగా ముఖ్యమంత్రిగా పనిచేసిన పెద్ద మనిషి అన్నీ అబద్దాలు మాట్లాడుతున్నారు. పవర్ కట్ అంటూ.. జగదీశ్వర్ రెడ్డి, శ్రీనివాస్ గౌడ్ ఇండ్లలో కూర్చుని తప్పుడు ట్వీట్లు చేశారని మండిపడ్డారు.
Hyderabad: గేమింగ్ స్థావరంపై పోలీసుల దాడి.. భారీగా నగదు సీజ్