Ponnam Prabhakar: హన్మాకొండ జిల్లా హుస్నాబాద్ లో మంత్రి పొన్నం ప్రభాకర్ విజయదశమి వేడుకల్లో పాల్గొన్నారు. ఆయన తన ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో కుటుంబ సభ్యులతో కలిసి శమీ పూజ చేసి ఆయుధాలను పూజించారు. ఈ కార్యక్రమంలో హుస్నాబాద్ ముఖ్య నేతలు, పార్టీ కార్యకర్తలు కూడా పాల్గొన్నారు. ఈ సందర్బంగా ఆయన కొన్ని ప్రసంగించారు. ముందుగా చెడుపై మంచి సాధించిన విజయానికి ప్రతీక విజయదశమి అని, ఈ పండుగ రోజున అందరికీ మంచి విజయాలు కలగాలని ఆయన…
రాష్ట్రంలో స్ధానిక ఎన్నికల నిర్వహణకు సంబందించి ఎలక్షన్ కమిషన్ 10,000 కొత్త ఈవీఎంలను (S-3 మోడల్) కొనుగోలు చేసే ఆలోచనలో ఉంది. ఈ కొత్త మోడల్ ఈవీఎంలతో ఒకే యూనిట్‌ను వివిధ ఫేజ్‌లలో పునరావృతంగా వినియోగించుకోవచ్చు.
Ponnam Prabhakar : తెలంగాణలో బిసి రిజర్వేషన్ల బిల్లును అసెంబ్లీలో మార్చి నెలలో ఆమోదించి గవర్నర్‌కు పంపినట్లు మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. మార్చి 22, 2025న బిల్లును గవర్నర్‌కు పంపించగా, గవర్నర్ మార్చి 30న బిల్ నంబర్ 3, బిల్ నంబర్ 4లను రాష్ట్రపతికి పంపినట్లు ఆయన వెల్లడించారు. జూలై 14న ఆర్డినెన్స్ ముసాయిదాను కూడా గవర్నర్‌కు పంపామని, గవర్నర్ నుండి సానుకూల నిర్ణయం వస్తుందని విశ్వాసం వ్యక్తం చేశారు. గ్రామపంచాయతీలకు పంచాయతీ యాక్ట్ ప్రకారం…
GHMC: హైదరాబాద్ మహానగర పాలక సంస్థ (GHMC) స్టాండింగ్ కమిటీ ఎన్నికల నామినేషన్ దాఖలుకు ఈ రోజు (సోమవారం) చివరి రోజుగా ఉంది. ఫిబ్రవరి 10వ తేదీన ప్రారంభమైన నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ గత ఆరు రోజులుగా కొనసాగుతోంది. ఇప్పటివరకు స్టాండింగ్ కమిటీ ఎన్నికల కోసం కేవలం నాలుగు నామినేషన్లు మాత్రమే దాఖలయ్యాయి. అందులో రెండు నామినేషన్లు భారత రాష్ట్ర సమితి (BRS) పార్టీకి చెందిన కార్పొరేటర్లు దాఖలు చేయగా, మిగిలిన రెండు కాంగ్రెస్ పార్టీకి చెందిన…
NOTA : స్థానిక సంస్థల ఎన్నికల్లో నోటా ను కల్పిత అభ్యర్థిగా పెట్టాలా వద్ద అనే అంశం రాజకీయ పార్టీల్లో మిశ్రమ స్పందన వ్యక్తం అయింది… కాంగ్రెస్ పార్టీ ఈ పద్ధతిని వ్యతిరేకించగా BRS పార్టీ స్వాగతించింది… బీజేపీ మాత్రం రాష్ట్ర ఎన్నికల సంఘం కి ఆ అధికారం లేదని.. రాష్ర్ట ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాల్సి ఉందని చెప్పింది…సిపిఎం నోటా ఉండాలని… కానీ అభ్యర్థిగా గుర్తించోద్దని స్పష్టం చేసింది… గుర్తింపు పొందిన రాజకీయ పార్టీ లతో రాష్ర్ట…
Uttam Kumar Reddy : కరీంనగర్, నిజామాబాద్, ఆదిలాబాద్, మెదక్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలు కాంగ్రెస్ పార్టీకి అత్యంత ప్రతిష్టాత్మకమని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. మంగళవారం ఆయన బంజారాహిల్స్ నివాసంలో పార్టీ శ్రేణులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. అంతకు ముందు, కాంగ్రెస్ ఎమ్మెల్సీ అభ్యర్థి నరేందర్ రెడ్డి నామినేషన్ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ, పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలు రేపటి స్థానిక సంస్థల ఎన్నికలకు రిహార్సల్స్ అవుతాయని…
గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ స్టాండింగ్ కమిటీ ఎన్నికకు నామినేషన్ల ప్రక్రియ ప్రారంభమైంది. ఈరోజు జీహెచ్ఎంసీ రిటర్నింగ్ అధికారి వద్ద నాలుగు నామినేషన్లు దాఖలయ్యాయి. నాలుగు నామినేషన్లలో రెండు కాంగ్రెస్, రెండు బిఆర్ఎస్ నుంచి దాఖలయ్యాయి. బీఆర్ఎస్ నుంచి నామినేషన్ దాఖలు చేసిన కూకట్పల్లి కార్పొరేటర్ జూపల్లి సత్యనారాయణ, అడ్డగుట్ట కార్పొరేటర్ ప్రసన్న లక్ష్మి. కాంగ్రెస్ నుంచి నామినేషన్లు దాఖలు చేసిన హిమాయత్ నగర కార్పొరేటర్ మహాలక్ష్మి గౌడ్, రామచంద్రాపురం కాంగ్రెస్ కార్పొరేటర్ పుష్ప. Also Read:…
Kishan Reddy : బీజేపీలో తరవాత అధ్యక్షుడు ఎవరో బీఆర్‌ఎస్ వాళ్ళు చెప్పగలరా.. బీఆర్‌ఎస్ నెక్ట్స్ ప్రెసిడెంట్ ఎవరో అందరికీ తెలుసు అని వ్యాఖ్యానించారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్రమంత్రి కిషన్ రెడ్డి. ఇవాళ ఆయన మీడియాతో చిట్ చాట్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. బీఆర్‌ఎస్‌లో డైనింగ్ టేబుల్ మీద నిర్ణయాలు జరుగుతాయి…. బీజేపీలో అలా కాదని ఆయన వ్యాఖ్యానించారు. బీజేపీ మండల అధ్యక్షులలో 50 శాతం పైగా బీసీ లు ఉన్నారని, సంస్థాగత…
మహబూబాబాద్ జిల్లా తొర్రూరు పట్టణ కేంద్రంలోని వ్యవసాయ మార్కెట్ నూతన కమిటీ ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమంలో మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి, స్థానిక ఎమ్మెల్యే యశస్వినీ రెడ్డి, ప్రభుత్వా విప్ రామచంద్రు నాయక్, ఎమ్మెల్యే మురళీ నాయక్, ఎంపీలు, బలరాం నాయక్, కడియం కావ్య పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ హాట్ కామెంట్స్ చేశారు. రాష్ట్ర ప్రజలు మార్పు కావాలని ఇందిరమ్మ రాజ్యం తీసుకొచ్చారని అన్నారు.