Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Telangana News Madhu Goud Yaskhi On Bjp Trs Alliance

Madhu Goud Yaskhi: బీజేపీ-టీఆర్ఎస్ కుట్రను గమనించాలి

Published Date :July 5, 2022 , 6:26 pm
By NTV WebDesk
Madhu Goud Yaskhi: బీజేపీ-టీఆర్ఎస్ కుట్రను గమనించాలి
  • Follow Us :
  • google news
  • dailyhunt

బీజేపీ, టీఆర్ఎస్ పార్టీలు కలిసే ఉన్నాయని.. వారి కుట్రను ప్రతిఒక్కరూ గమనించాలని టీపీసీసీ ప్రచారకర్త కమిటీ ఛైర్మన్ మధుయాష్కీ గౌడ్ చెప్పారు. కేసీఆర్ అవినీతి గురించి మాట్లాడుతోన్న బీజేపీ.. ఆయన్ను జైలుకు ఎందుకు పంపడం లేదని నిలదీశారు. సీఎం కేసీఆర్ ఏనాడూ ప్రతిపక్షాల తరఫున కేంద్రం వద్ద మాట్లాడలేదని అన్నారు. 8 ఏళ్లుగా పార్లమెంట్‌లో ప్రధానిని ఏనాడూ కేసీఆర్ ప్రశ్నించలేదన్నారు. ప్రశ్నిస్తున్న వారిపై మాత్రం కాల్పులు జరుపుతున్నారన్నారు.

తెలంగాణ ప్రజల భవిష్యత్ పట్ల కాంగ్రెస్ పోరాడుతోందని చెప్పిన మధుయాష్కీ.. ధరణి చట్టం వల్ల వేలాదిమంది రైతులకు అన్యాయం జరుగుతోందని వ్యాఖ్యానించారు. అసైన్డ్ భూముల్ని కాంగ్రెస్ పార్టీ పేదలకు పంచిందని.. తెలంగాణ ప్రభుత్వం మాత్రం వాటిని లాక్కుంటోందని ఆరోపించారు. మహబూబాబాద్‌లో 5 వేల ఎకరాల అసైన్డ్ భూముల్ని టీఆర్ఎస్ ప్రభుత్వం గిరిజనుల దగ్గర నుండి లాక్కుందన్నారు. రైతు బంధు వస్తోన్న రైతుల దగ్గర నుండి కూడా భూముల్ని తీసుకున్నారని పేర్కొన్నారు. కేసీఆర్ ఉదేశ్యపూర్వకంగానే ధరణి తెచ్చి భూములు లాక్కుంటున్నారని.. రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసి కోట్లు దండుకుంటున్నారని ధ్వజమెత్తారు.

ఇక ఇదే సమయంలో విష్ణువర్ధన్ రెడ్డి ఏర్పాటు చేసిన విందు కార్యక్రమంపై మధుయాష్కీ మాట్లాడారు. తన తండ్రి పీజేఆర్ జ్ఞాపకార్థం కాంగ్రెస్ నేతల్ని విష్ణు పిలిచారని, తండ్రికి తగ్గ తనయుడిగా విష్ణు ఉన్నారన్నారు. తెలంగాణ రాష్ట్రం కోసం పీజేఆర్ పోరాటం చేశారని, హైదరాబాద్‌లో నిరుపేదలకు ఇళ్ల స్థలాలిచ్చారని గుర్తు చేసుకున్నారు.
విష్ణుని చూసి కాంగ్రెస్ యువత ముందుకు రావాలని, రాహుల్ గాంధీ నాయక్వత్వంలో అందరూ కలిసి పని చేయాలని పిలుపునిచ్చారు. కాంగ్రెస్‌లోకి రావడానికి చాలా మంది ఉత్సాహం చూపిస్తున్నారని, పార్టీని నమ్మి పని చేసిన వారికి అన్యాయం జరగదని మధుయాష్కీ గౌడ్ భరోసానిచ్చారు.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • bjp
  • Madhu Goud Yaskhi
  • P. Vishnuvardhan Reddy
  • telangana Congress
  • TRS

తాజావార్తలు

  • Hyderabad: వనస్థలిపురంలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఇద్దరు యువకులు మృతి

  • Adivi Sesh: ‘డెకాయిట్’ నా కల.. రెండేళ్ల కష్టానికి ప్రతిరూపం: అడివి శేష్

  • Venkatesh: సుప్రియ కోసం కాదు.. ఆయన కోసమే ఈవెంట్‌కు వచ్చా.. విక్టరీ వెంకటేష్

  • Dacoit Movie: ఇక నా వల్ల కాదు, తెలుగు సినిమా చేయను.. డైరెక్టర్‌కు మృణాల్ ఠాకూర్ ఫోన్!

  • OTR: రామచంద్రపురంలో షాడో ఎమ్మెల్యేలా మంత్రి తండ్రి.?

ట్రెండింగ్‌

  • Vellulli Karam Recipe: వేడివేడి అన్నంలో నెయ్యితో ‘వెల్లుల్లి కారం’ కలిపి తింటే.. ఆ రుచే వేరప్ప..!

  • Vitamin B12 Rich Soups: విటమిన్ B12 లోపం..? ఈ సూప్‌లు తాగితే నరాలు మళ్లీ యాక్టివ్.!

  • Fatty Liver: ఇక ఫ్యాటీ లివర్ సమస్యకు చెక్.. కాలేయ ఆరోగ్యాన్ని కాపాడే 5 అద్భుత సూత్రాలు..!

  • 144Hz రిఫ్రెష్ రేట్, 7000mAh “టైటాన్ బ్యాటరీ”తో భారత్‌లో Realme NARZO 100 Lite 5G లాంచ్..!

  • JIO Offer: రూ. 339లకే 31 రోజుల వాలిడిటీతో రూ. 35 వేల విలువైన గూగుల్ జెమిని ప్రో ఫ్రీ!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions