IND Vs WI: ఏమి ఆట భయ్యా..! ఒకరిని మించి ఒకరు.. కొట్టుడే కొట్టుడు.. భారత్ భారీ స్కోర్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
రాంచీలోని జెఎస్సీఏ ఇంటర్నేషనల్ స్టేడియం కాంప్లెక్స్ వేదికగా భారత్, వెస్టిండీస్ జట్ల మధ్య జరిగిన రెండో టీ20 మ్యాచ్‌లో టీమిండియా బ్యాటర్లు అద్భుతమైన ప్రదర్శనతో హోరెత్తించారు. టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న వెస్టిండీస్ నిర్ణయాన్ని భారత బ్యాటర్లు పూర్తిగా తిప్పికొట్టారు. మ్యాచ్ ఆరంభం నుంచే విండీస్ బౌలర్లపై ఎదురుదాడికి దిగిన టీమిండియా నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి ఏకంగా 249 పరుగుల భారీ స్కోరు సాధించింది.
ఇన్నింగ్స్ ఆరంభంలో ఓపెనర్ అభిషేక్ శర్మ 20 పరుగులు చేసి వెనుదిరిగినప్పటికీ, మరో ఓపెనర్ సంజూ శాంసన్ మాత్రం క్రీజులో నిలదొక్కుకుని విండీస్ బౌలర్లను ఉతికిపారేశాడు. సంజూ శాంసన్ కేవలం 41 బంతుల్లోనే 4 ఫోర్లు, 9 సిక్సర్లతో 82 పరుగులు సాధించి అదరగొట్టాడు. అతనితో పాటు మరో బ్యాటర్ ఇషాన్ కిషన్ కూడా చెలరేగి ఆడి 22 బంతుల్లో 2 ఫోర్లు, 6 సిక్సర్లతో 43 పరుగులు చేసి అద్భుతమైన సహకారం అందించాడు. వీరిద్దరి ధాటికి భారత ఇన్నింగ్స్ వేగంగా దూసుకుపోయింది.
Also Read
- Cyclone Arnab: ‘అర్నబ్’ తుఫాను పేరు వెనుక అసలు కథ ఇదే.. పేరు పెట్టింది మన దేశం కాదు..
- Baloch Liberation Front: 80 మంది పాకిస్థాన్ సైన్యాన్ని హతమార్చాం.. బలోచ్ లిబరేషన్ ఫ్రంట్ సంచలన ప్రకటన..
- Cyclone Arnab: 32 వేల మందితో సీఎం చంద్రబాబు టెలీకాన్ఫరెన్స్.. కీలక ఆదేశాలు జారీ!
- Cyclone Arnab: అర్నబ్ తుఫాన్ బీభత్సం.. కశింకోటలో 26.3 సెం.మీ వర్షపాతం.. అంధకారంలో మచిలీపట్నం!
మధ్యలో వచ్చిన ఆటగాళ్లు కూడా తమ బాధ్యతను సమర్థవంతంగా నిర్వర్తించారు. కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ కేవలం 18 బంతుల్లోనే 1 ఫోర్, 3 సిక్సర్లతో 40 పరుగులు చేసి రాణించాడు. ఇక చివర్లో తిలక్ వర్మ 18 బంతుల్లో 44 పరుగులు, నమన్ ధీర్ లాస్ట్ బాల్ కు ఫోర్ కొట్టాడు. ఎక్స్‌ట్రాల రూపంలో మరో 9 పరుగులు రావడంతో భారత్ 249 పరుగుల భారీ లక్ష్యాన్ని ఉంచింది. వెస్టిండీస్ బౌలర్లలో రోస్టన్ చేజ్ మూడు వికెట్లు పడగొట్టగా, షామర్ స్ప్రింగర్ రెండు వికెట్లు దక్కించుకున్నప్పటికీ భారత బ్యాటర్ల జోరును అణచివేయలేకపోయారు.
తాజావార్తలు
-
Cyclone Arnab: ‘అర్నబ్’ తుఫాను పేరు వెనుక అసలు కథ ఇదే.. పేరు పెట్టింది మన దేశం కాదు..
-
Jio Platforms IPO Listing: నేడు స్టాక్ మార్కెట్లోకి జియో ఎంట్రీ.. GMP రూ.247, లిస్టింగ్ ధర ఎంత ఉండొచ్చు?
-
Israel Election Exit Polls: ఇజ్రాయెల్ ఎన్నికల్లో నెతన్యాహుకు షాక్?.. ఎగ్జిట్ పోల్స్‌లో ప్రతిపక్షానికి ఆధిక్యం
-
Baloch Liberation Front: 80 మంది పాకిస్థాన్ సైన్యాన్ని హతమార్చాం.. బలోచ్ లిబరేషన్ ఫ్రంట్ సంచలన ప్రకటన..
-
Cyclone Arnab: తుఫాను సమయంలో పొంచి ఉన్న 5 ప్రమాదాలు!
ట్రెండింగ్
-
థియేటర్ అనుభవం ఓకే.. కానీ ఆ ధరకు ఎకరం భూమి కొనవచ్చుగా..! 115 అంగుళాల LG QNED evo AI Mini LED TV లాంచ్..
-
లిక్విడ్ కూలింగ్ ఆర్కిటెక్చర్, ప్రెజర్-సెన్స్ ట్రిగ్గర్లు, డైమెన్సిటీ 8400 అల్టిమేట్ ప్రాసెసర్‌తో సరికొత్త సంచలనం Infinix GT 50 Pro లాంచ్.!
-
6000mAh బ్యాటరీ, IP64 రేటింగ్, ఆరేళ్ల అప్డేట్లతో భారత్‌లో Samsung Galaxy A08 విడుదల..!
-
10,000mAh బ్యాటరీ, 1.5K 165Hz OLED డిస్ప్లే, IP66+IP68+IP69+IP69K రేటింగ్‌తో REDMI K100 లాంచ్..!
-
Bloating Before Periods: పీరియడ్స్ ముందు కడుపు ఉబ్బరంగా ఉంటోందా? ఈ లక్షణాలను లైట్ తీసుకోవద్దు..