US-New York: ఐదేళ్ల చిన్నారి ముందే కాల్పులు.. ట్రంప్ అధికారులతో మేయర్ మమ్దానీ వాగ్వాదం!
- న్యూయార్క్ నగరంలో వలసదారులపై కాల్పులు
- ట్రంప్ అధికారులతో మేయర్ మమ్దానీ వాగ్వాదం!
- మేయర్ తీరును తప్పుపట్టిన ట్రంప్ అధికారులు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
అమెరికాలో వలసదారులపై చర్యలు మరోసారి వివాదాస్పదంగా మారాయి. న్యూయార్క్ నగరంలో ఇమిగ్రేషన్ అండ్ కస్టమ్స్ ఎన్ఫోర్స్మెంట్ (ICE) అధికారి జరిపిన కాల్పుల్లో ఆస్కార్ బెల్గల్ అనే వ్యక్తి గాయపడటంతో రాజకీయ దుమారం రేగింది. ఐదేళ్ల చిన్నారి కారులో ఉండగానే కాల్పులు జరగడంపై న్యూయార్క్ నగర మేయర్ జొహ్రాన్ మమ్దానీ సహా పలువురు అధికారులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. అయితే అమెరికా హోంల్యాండ్ సెక్యూరిటీ కార్యదర్శి మార్క్వేన్ ముల్లిన్ మాత్రం కాల్పులు జరిపిన అధికారిని సమర్థించారు. నిందితుడిని ప్రమాదకరమైన నేరస్థుడిగా అభివర్ణిస్తూ.. అతడిని విడిచిపెట్టాలని మేయర్ కోరుతున్నారని ఆరోపించారు.
శుక్రవారం నిర్వహించిన మీడియా సమావేశంలో ముల్లిన్ ఈ ఘటనపై మాట్లాడారు. ఆస్కార్ బెల్గల్ కేసుకు ఇంత ప్రాధాన్యం ఇవ్వడం సిగ్గుచేటని, అతడు ఒక నేరస్థుడని వ్యాఖ్యానించారు. బెల్గల్పై న్యూయార్క్ పోలీస్ డిపార్ట్మెంట్ (NYPD) కేసు నమోదు చేసి విచారణ చేపట్టాలనుకుంటే.. అతడిని ఆ శాఖకు అప్పగించేందుకు అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అంగీకరించారని ముల్లిన్ తెలిపారు. ఈ విషయాన్ని మేయర్ మమ్దానీకి తెలియజేయగా.. బెల్గల్ను అదుపులోకి తీసుకోబోమని ఆయన చెప్పినట్లు ముల్లిన్ పేర్కొన్నారు. ఐసీ అధికారులు నగరం నుంచి వెళ్లిపోవాలని, ప్రమాదకరమైన నేరస్థుడిని తిరిగి వీధుల్లోకి వదిలేయాలని మేయర్ కోరుకుంటున్నారని ఆరోపించారు. ఈ వాదనలపై మమ్దానీ కార్యాలయం వెంటనే స్పందించలేదు.
Also Read
- Ilhan Omar: సోదరుడితో పెళ్లి ఆరోపణలు.. అమెరికా ఎంపీ ఇల్హాన్ ఒమర్‌పై విచారణ!
- Israel Elections: ఇజ్రాయిల్ ఎన్నికల్లో జోక్యం.. ‘‘మమ్మల్ని బలిపశువు చేయొద్దు’’ అని ఖతార్ కౌంటర్..
- ChatGPT: ప్రాణాలు తీసిన ChatGPT వైద్యం.. మూర్ఛ వ్యాధితో మహిళ మృతి.. ఓపెన్ఏఐపై దావా..
- Bangladesh: హసీనా ప్రభుత్వం కూలకముందే యూనస్‌తో చర్చలు.. పక్కా ప్లాన్‌తో రెజిమ్ ఛేంజ్?
గురువారం ట్రంప్‌తో పాటు ముల్లిన్తో సుమారు రెండు గంటలపాటు ఫోన్లో మాట్లాడినట్లు మమ్దానీ తెలిపారు. బెల్గల్ను విడుదల చేయించేందుకు చేసిన ప్రయత్నాలు విఫలమయ్యాయని పేర్కొన్నారు. అనంతరం నగరంలో ఐసీ చేపడుతున్న అన్ని వలసదారుల అమలు చర్యలను నిలిపివేయాలని ట్రంప్‌ను కోరినట్లు వెల్లడించారు. ఐదేళ్ల చిన్నారి ఉన్న కారుపై ఫెడరల్ అధికారులు ఇన్ని రౌండ్లు కాల్చడానికి ఎలాంటి సమర్థన లేదని మమ్దానీ విమర్శించారు. ఐసీ వ్యవస్థ మూలాల నుంచే అవినీతిమయంగా ఉందంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఈ ఘటనపై నిరసనకారులు కూడా ఆగ్రహం వ్యక్తం చేశారు.
28 ఏళ్ల డొమినికన్ వ్యక్తి బెల్గల్ను న్యూయార్క్ నగరం వెలుపల ఉన్న నిర్బంధ కేంద్రానికి తరలించినట్లు ఐసీ ఎన్ఫోర్స్మెంట్ అండ్ రిమూవల్ ఆపరేషన్స్ విభాగం అధిపతి మార్కోస్ చార్లెస్ తెలిపారు. అతడికి గతంలో నేరారోపణలు ఉండటం, పారిపోయే ప్రమాదం ఉందని భావించడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు. గురువారం మధ్యాహ్నం ఐసీ అధికారులు తమ వాహనాలతో బెల్గల్ కారును అడ్డుకున్నారని చార్లెస్ వివరించారు. కారు నుంచి దిగాలని ఆదేశించినప్పటికీ అతడు నిరాకరించాడని, ఆ తర్వాత కారును వేగంగా ముందుకు నడిపి రెండు ఐసీ వాహనాలను ఢీకొట్టాడని ఆరోపించారు. అనంతరం ఇతర అధికారుల వైపు కారును నడిపాడని తెలిపారు. తమ ప్రాణాలకు, సహచర అధికారుల ప్రాణాలకు, అక్కడున్న ప్రజల భద్రతకు ముప్పు ఉందని భావించి అధికారులు కాల్పులు జరిపారని చార్లెస్ సమర్థించారు.
న్యూయార్క్ పోలీస్ కమిషనర్ జెస్సికా టిష్ తెలిపిన వివరాల ప్రకారం.. ఈ ఘటనలో కనీసం ఏడు రౌండ్లు కాల్పులు జరగగా, బెల్గల్ మెడకు బుల్లెట్ గాయమైంది. కారులో ఉన్న ఐదేళ్ల చిన్నారికి శారీరకంగా ఎలాంటి గాయాలు కాలేదు. టిష్ వెల్లడించిన ప్రాథమిక వివరాలు ఐసీ వాదనలోని కొన్ని అంశాలతో సరిపోలుతున్నాయి. ఒక ఫెడరల్ అధికారి తుపాకీతో డ్రైవర్ వైపు కిటికీ దగ్గరకు వెళ్లగా, మరో అధికారి కారు ముందు ఎడమ హెడ్‌లైట్ సమీపంలో నిలబడ్డారని ఆమె తెలిపారు. ఆ తర్వాత కారు ముందుకు కదిలిందని చెప్పారు. అయితే కాల్పుల ఘటనను న్యూయార్క్ పోలీసుల కెమెరాలు రికార్డు చేయలేదని టిష్ వెల్లడించారు. ఘటనాస్థలంలో ఉన్న ఐసీ వాహనం ముందు ఎడమవైపు దెబ్బతిన్నట్లు గుర్తించామని తెలిపారు.
బెల్గల్పై గతంలోనూ కేసులు
బెల్గల్పై న్యూయార్క్‌లో దోపిడీ, భారీ విలువైన వస్తువుల చోరీ, ప్రాణాంతక ఆయుధంతో దొంగతనానికి సంబంధించిన ఆరోపణలు ఉన్నాయని చార్లెస్ తెలిపారు. 2023లో దోపిడీ కేసులో అరెస్టయిన తర్వాత నాలుగో డిగ్రీ గ్రాండ్ లార్సెనీ నేరాన్ని అతడు అంగీకరించినట్లు పోలీస్ కమిషనర్ టిష్ చెప్పారు. 2025లో డ్రగ్స్ విక్రయానికి సంబంధించిన మరో కేసు పెండింగ్‌లో ఉందని తెలిపారు. అమెరికాలో అక్రమంగా ఉంటున్నాడని, ట్రినిటారియోస్ గ్యాంగ్‌తో సంబంధాలు ఉన్నాయని హోంల్యాండ్ సెక్యూరిటీ విభాగం గురువారం పేర్కొంది. అయితే ఈ ఆరోపణలకు సంబంధించిన పూర్తి వివరాలను వెల్లడించలేదు.
న్యూయార్క్ నగరంలోని వలసదారుల అనుకూల విధానాలను కూడా ముల్లిన్ తప్పుబట్టారు. ఇలాంటి విధానాలు నేర కార్యకలాపాలు పెరగడానికి అనుకూల వాతావరణాన్ని సృష్టిస్తున్నాయని ఆరోపించారు. 2025 జనవరి నుంచి న్యూయార్క్‌కు సంబంధించి 14,766 నిర్బంధ అభ్యర్థనలను ట్రంప్ ప్రభుత్వం పంపినట్లు ముల్లిన్ తెలిపారు. నేరారోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తులను అదుపులో ఉంచి, తర్వాత వారిని వలస అధికారులకు అప్పగించాలన్నది ఈ అభ్యర్థనల ఉద్దేశమని వివరించారు. అయితే న్యూయార్క్ నగరంలోని ‘సాంక్చువరీ’ విధానాల ప్రకారం.. స్థానిక అధికారులు ఫెడరల్ వలస అధికారులతో సహకరించడంపై కొన్ని పరిమితులు ఉన్నాయి. వలసదారుల సమాజాలు స్థానిక ప్రభుత్వంపై నమ్మకం కోల్పోకుండా ఉండేందుకే ఈ విధానాలు అమలు చేస్తున్నామని నగర అధికారులు చెబుతున్నారు.
తాజావార్తలు
-
Arnab Cyclone Damages : అర్నబ్ తుఫాన్ బీభత్సం కొబ్బరి రైతులకు కోలుకోలేని దెబ్బ
-
Samantha: 9వ నెలలోనూ సమంత తగ్గేదేలే.. జిమ్‌లో కసరత్తు వీడియో వైరల్!
-
Stroke: తీవ్రమైన తలనొప్పి, తల తిరగడం, శరీరంలో తిమ్మిర్లు.. స్ట్రోక్‌కి సంకేతాలా?
-
Rahul Gandhi: ‘‘ఢిల్లీ ర్యాలీకి ప్రజలు రాకుండా అడ్డంకులు’’.. కేంద్రంపై రాహుల్ ఆరోపణలు..
-
Under-19: అండర్-19 ఆసియా కప్‌కు భారత జట్టు ప్రకటన.. జట్టులో సచిన్, ద్రవిడ్, సెహ్వాగ్ వారసులు..
ట్రెండింగ్
-
Nitish Kumar Reddy: ఆహా నితీష్ రెడ్డి.. విధి ఆడింది రా నీతో వింతనాటకం!
-
Green Moong Dal Laddu: ఫిట్నెస్ ప్రియుల కోసం స్పెషల్ రెసిపీ.. చక్కెర, బెల్లం లేకుండానే తియ్యని పెసరపప్పు లడ్డూలు..
-
Shreyas Iyer Record: టాస్‌లలో ‘రారాజు’ శ్రేయస్ అయ్యర్!
-
Ryan Rickelton: ‘మీ అమ్మ సింగిలా?’.. అభిమాని ప్లకార్డుతో షాకైన స్టార్ క్రికెటర్!
-
మరో లగ్జరీ ప్రీమియం ఫోల్డబుల్.. 200MP కెమెరా, శాటిలైట్ కాలింగ్‌తో Samsung W27 లాంచ్..!