Heavy rains in Hyderabad: హైదరాబాద్‌లోని పలు ప్రాంతాల్లో నిన్న (శనివారం) సాయంత్రం మరోసారి భారీ వర్షం కురిసింది, రోడ్లన్నీ జలమయం అయ్యాయి, నగరంలోని పలు చోట్ల ట్రాఫిక్ కు అంతరాయం కలిగింది. అలాగే నగర శివార్లలోని పలు ప్రాంతాలు భారీ వర్షంతో జలమయమయ్యాయి. భారీ వర్షాల కారణంగా రోడ్లు, వీధులు జలమయమయ్యాయి. రానున్న రెండు రోజుల్లో నగరంలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ విభాగం (IMD) వెల్లడించింది. నేడు, రేపు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. ఉరుములు, మెరుపులతో కూడిన గాలివానలను కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. నగరంలో గరిష్ట ఉష్ణోగ్రత 31.2 డిగ్రీల సెల్సియస్ , కనిష్ట ఉష్ణోగ్రత 22 డిగ్రీల సెల్సియస్ గా ఉండి ఆకాశం మేఘావృతమై ఉంటుంది.
తెలంగాణ స్టేట్ డెవలప్‌మెంట్ ప్లానింగ్ సొసైటీ (TSDPS) అందించిన సమాచారం ప్రకారం, షేక్‌పేటలో (11.7 సెం.మీ), మాదాపూర్‌లోని కాకతీయ హిల్స్ (10.9), జూబ్లీహిల్స్ (10.58), హైదర్‌నగర్ (10.58), మాదాపూర్ (10.58), మాదాపూర్ ( 9.5), ఖాజాగూడ (9.45), మియాపూర్ (8.08), CBCID కాలనీ, KPHB (7.85), రాయదుర్గం (7.25). అత్యధిక వర్షపాతం నమోదైంది.
Read also: Kerala: డాక్టర్ల నిర్లక్ష్యం ఐదేళ్లుగా మహిళ కడుపులో కత్తెర.. విచారణకు మంత్రి ఆదేశం
నిన్న కురిసిన భారీ వర్షానికి నగరంలోని ప్రధాన రహదారులు – అమీర్‌పేట్, పంజాగుట్ట, సంజీవ రెడ్డి నగర్, ఎర్రగడ్డ, సనత్‌నగర్, జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, సెరిలింగంపల్లి, మాదాపూర్, రాయ్‌గుర్గ్, కూకప్టపల్లి, నిజాంపేట్, ప్రగతినగర్, రాజేంద్ర నగర్, మర్రెడ్‌పల్లి, మోరోస్, రాణిగుంజ్, ఖాజాగూడ, కార్వాన్, మెహదీపట్నం, గోల్కొండ, ఆసిఫ్‌నగర్, అల్లాపూర్, బేగంబజార్, ఫీల్ఖానా, చిల్కలగూడ, అల్వాల్ తదితర ప్రాంతాలు జలమయమయ్యాయి.
Oxygen cylinder car caught fire: తప్పిన ప్రమాదం.. ఆక్సిజన్ సిలిండర్‌లను తరలిస్తున్న కారులో భారీ పేలుడు..