తెలంగాణలో గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ తీరుపై మండిపడుతున్నాయి వివిధ పక్షాలు. తెలంగాణలో టీఆర్ ఎస్ తో పాటు వామపక్షాల నేతలు కూడా గవర్నర్ వ్యవస్థపై విమర్శనాస్త్రాలు సంధిస్తున్నారు. తాజాగా సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు గవర్నర్ వ్యవస్థ రాజ్యాంగానికి అనుగుణంగా నడవడం లేదన్నారు. గవర్నర్ వ్యవస్థ వల్ల రాజ్యాంగ యేతర పనులకు దోహదం అవుతుందని, ఈ వ్యవస్థను రద్దు చేయాలంటున్నారు. 7 న రాజ్ భవన్ ముట్టడికి ఆయన పిలుపునిచ్చారు. కేంద్రంలో ఏ పార్టీ అధికారంలోకి వస్తే వారికి సంబంధించిన వాళ్ళను నియమించుకుంటున్నారు.
Read Also: Jaison Joseph: ఇండస్ట్రీలో కలకలం..ఇంట్లో శవమై కనిపించిన ప్రముఖ నిర్మాత..
మన గవర్నర్ తమిళనాడు బీజేపీ అధ్యక్షురాలు ఆమెని తీసుకు వచ్చి గవర్నర్ చేశారు. అప్పట్లో ఎన్నికల వ్యవస్థ లేక ముందు వైస్రాయ్ లు ఉండేవారు. క్యాబినెట్ నిర్ణయాన్ని ఆమోదించాలి లేక ఒకేసారి వెనక్కి పంపవచ్చు కానీ రెండవ సారి తప్పక ఆమోదం చేయాలి. తెలంగాణ ప్రభుత్వాన్ని కూడా కూల్చాలని చూస్తున్నారు. ఎన్నికల కమిషన్ నీ కూడా కొలీజియం ద్వారా తీసుకోవడం లేదు అని సుప్రీం కోర్టు చెప్పింది. గవర్నర్ వ్యవస్థ ను రద్దు చేయాలి అని డిమాండ్ చేస్తున్నాం అన్నారు. బీజేపీ నాయకుల మీద ఈడి సీబీఐ దాడులు ఎక్కడైనా జరిగాయా? అని ఆయన ప్రశ్నించారు.
ప్రతిపక్ష పార్టీలు బతకాలి అంటే ఈడి సీబీఐ ప్రక్షాళన జరగాలి ఆ విధంగా సుప్రీం చర్యలు తీసుకోవాలి. షర్మిలకు మోడీ ఫోన్ చేయడం రాజకీయ ప్రయోజనం కోసమే అని ఆరోపించారు. వరవరరావు, సాయి బాబా లను చంపాలని చూస్తారు. అపెండెక్స్ లాంటి గవర్నర్ వ్యవస్థ రద్దు చేయకపోతే ప్రజాస్వామ్య ప్రాణానికే నష్టం వాటిల్లుతుందన్నారు. రైతు ఆత్మహత్యల మీద స్పందించి బాధ్యత తీసుకోవాలన్నారు సీపీఐ నేత కూనంనేని సాంబశివరావు.
Read Also: Margani Bharat: పార్లమెంట్లో బీసీ రిజర్వేషన్లపై ప్రత్యేక చర్చ జరగాలి