బీఆర్ఎస్ పార్టీపై బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎంపీ బండి సంజయ్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ.. తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీని ప్రజలే రద్దు చేశారని వ్యాఖ్యానించారు. గవర్నర్ వ్యవస్థను అవమానపర్చిన మూర్ఖత్వపు పార్టీ బీఆర్ఎస్ అంటూ ధ్వజమెత్తారు. మహిళా గవర్నర్‌ను అసెంబ్లీలో మాట్లాడనీయకుండా అవమానించారని గుర్తుచేశారు. కనీసం గవర్నర్ పర్యటనలకు ప్రొటోకాల్ కూడా పాటించలేదని.. అంతేకాకుండా అధికారులను కూడా గవర్నర్ వద్దకు వెళ్లనీయలేదని మండిపడ్డారు.
దేశంలో ఫెడరల్ వ్యవస్థను బీజేపీ నాశనం చేస్తుంది అని మండిపడ్డారు సీపీఐ, ఆంధ్రప్రదేశ్ కార్యదర్శి రామకృష్ణ.. గవర్నర్ వ్యవస్థ దుర్వినియోగం అవుతుందన్న ఆయన.. గవర్నర్ వ్యవస్థ రద్దు కోసం ఈనెల 29న దేశ వ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు నిర్వహించనున్నట్టు ప్రకటించారు.. విజయవాడలోని రాజ్ భవన్ దగ్గర పెద్దఎత్తున నిరసన చేపడతామన్న ఆయన.. సీబీఐ, ఈడీ వ్యవస్థలు బ్లాక్ మెయిల్స్ గా మారాయని విమర్శించారు. ఎన్ని తప్పులు చేసినా బీజేపీలో ఉంటే ఎటువంటి ఈడీ దాడులు ఉండవని మండిపడ్డారు..…
తెలంగాణ రాజకీయాలు ఇప్పుడు గవర్నర్ తమిళిసై చుట్టూ తిరుగుతున్నాయి.. ప్రభుత్వంపై ప్రత్యక్షంగా, పరోక్షంగా ఆమె చేసిన వ్యాఖ్యలు చర్చగా మారాయి.. ఇక, కొందరు ఆమెను సపోర్ట్ చేస్తుంటే.. అధికార టీఆర్ఎస్ మాత్రం ఆమెను టార్గెట్ చేసి కౌంటర్ ఎటాక్ చేస్తోంది… తాజాగా ఈ వ్యవహారంపై స్పందించిన మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ సంచలన వ్యాఖ్యలు చేశారు.. గవర్నర్‌కి కూడా పరిమితులు ఉంటాయి… ప్రధాని, హోం మంత్రిని కలిసిన తర్వాత మీడియాతో మాట్లాడాల్సిన అవసరం ఏమి వచ్చింది..? అని…