KTR : ఒక్క ఓటు కూడా పోవద్దు.!
- ప్రతి బూత్‌లో మెజారిటీ లక్ష్యంగా పనిచేయండి
- అక్టోబర్ 1న ఫైనల్ ఓటర్ లిస్ట్
- డూప్లికేట్ ఓట్లపై ప్రత్యేక దృష్టి
- ఇంటింటికీ వెళ్లి ఓటర్ల ధృవీకరణ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
KTR : ఎన్నికల్లో భారీ విజయం సాధించడమే లక్ష్యంగా పార్టీ శ్రేణులకు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కీలక వ్యూహాలను వివరించారు. ఎన్నికల సమయంలో బూత్ లెవెల్ ఏజెంట్లు (BLA) , పార్టీ కార్యకర్తలు క్షేత్రస్థాయిలో ఎలా అప్రమత్తంగా వ్యవహరించాలో దిశానిర్దేశం చేశారు. ఎంత పెద్ద నాయకుడైనా ముందు తన సొంత బూత్‌లో మెజారిటీని నిరూపించుకోవాలని, అప్పుడే పార్టీ గెలుపు సులువవుతుందని ఆయన స్పష్టం చేశారు.
అక్టోబర్ 1న ఫైనల్ ఓటర్ లిస్ట్.. ప్రతి ఓటూ ముఖ్యం
ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియలో కాలపరిమితిని గుర్తుచేస్తూ.. ఆగస్టు 30 వరకు కొత్త ఓట్ల నమోదు, మార్పులు చేర్పులు , అభ్యంతరాలను స్వీకరించే సమయం ఉందని కేటీఆర్ తెలిపారు. సెప్టెంబర్ 28 నాటికి ఈ ప్రక్రియ అంతా పూర్తయి, అక్టోబర్ 1వ తేదీన ఫైనల్ ఓటర్ లిస్ట్ విడుదలవుతుందని పేర్కొన్నారు. ఈ ఫైనల్ లిస్ట్ రాబోయే ఎమ్మెల్యే, ఎంపీ ఎన్నికలతో పాటు ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలకు కూడా వర్తిస్తుందని, కాబట్టి ఒక్క ఓటు కూడా వృధా కాకుండా ప్రతి బూత్లోనూ కార్యకర్తలు అత్యంత జాగ్రత్తగా వ్యవహరించాలని సూచించారు. ఇందుకోసం ప్రభుత్వ బూత్ లెవెల్ ఆఫీసర్ (BLO) తో కలిసి ఓటరు జాబితాను నిరంతరం సరిచూసుకోవాలని ఆదేశించారు.
Also Read
డూప్లికేట్ ఓట్ల గుర్తింపు.. ‘హ్యాండ్ బుక్’తో ఇంటింటికీ..
అర్హులైన ప్రతి ఒక్కరికీ ఓటు హక్కు కల్పించడంతో పాటు అక్రమ, డూప్లికేట్ ఓట్లను తొలగించడమే పార్టీ ప్రధాన లక్ష్యమని కేటీఆర్ స్పష్టం చేశారు. ఒకే వ్యక్తికి వేర్వేరు నియోజకవర్గాల్లో లేదా ప్రాంతాల్లో ఓట్లు ఉండే అవకాశం ఉందని, ఉదాహరణకు లావణ్య అనే వ్యక్తికి ఐదు చోట్ల ఓట్లు ఉన్నట్లు క్షేత్రస్థాయి పరిశీలనలో తేలిందని ఉదహరించారు. ఇలాంటి అనుమానాస్పద, డూప్లికేట్ ఓట్ల జాబితాను ప్రత్యేకంగా తయారు చేసి పార్టీ నాయకులకు అందజేయాలన్నారు. కార్యకర్తల సౌకర్యార్థం పార్టీ తరపున ‘హ్యాండ్ బుక్’, ‘వర్క్ బుక్’ అందజేస్తామని, వీటి సహాయంతో ప్రతి ఒక్కరూ ఇంటింటికీ తిరిగి ఖచ్చితమైన వివరాలు సేకరించాలని సూచించారు. క్షేత్రస్థాయిలో ప్రజలు , కార్యకర్తలతో పూర్తిస్థాయిలో మమేకమై పనిచేస్తేనే ఎన్నికల్లో భారీ విజయం సాధ్యమవుతుందని కేటీఆర్ పిలుపునిచ్చారు.
తాజావార్తలు
-
MS Dhoni: రెండో టీ20 మ్యాచ్‌కు ఎంఎస్ ధోనీ.. ఆ స్టార్ ఓపెనర్ కోసమేనా?.. వైభవ్ కోసం కాదండోయ్!
-
Air India Fuel Surcharge Hike: విమాన ప్రయాణికులకు షాక్.. పెరగనున్న టికెట్ భారం..? కారణం ఇదే..
-
GV Prakash : బాలీవుడ్లో జీవీ ప్రకాష్‌కు టెస్టింగ్ టైం.. నయూ నవేలికి కంప్లీట్ మ్యూజిక్ ఇచ్చిన కంపోజర్
-
Electric Tractors: రైతులకు గుడ్‌న్యూస్.. డీజిల్ ట్రాక్టర్లతో పోలిస్తే ఈ-ట్రాక్టర్లతో 84% ఖర్చు ఆదా..!
-
Dulquer Salmaan : ఐయామ్ గేమ్ ఫెయిల్యూర్‌పై దుల్కర్ సల్మాన్ రియలైజ్
ట్రెండింగ్
-
Bathroom Design Tips: బాత్రూమ్ ఎంత శుభ్రం చేసినా మళ్లీ తడిగానే ఉంటోందా? కారణం మీ క్లీనింగ్ కాదు.. ఈ సమస్య కావచ్చు!
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్‌జీ కొత్త దారులు
-
CM Vijay: 600 కోట్లు చూపించి 30 కోట్లు దాచారా? సీఎం విజయ్ పిటిషన్‌పై హైకోర్టు కీలక వ్యాఖ్యలు.!