బీజేపీ రాష్ట్రాలపై కక్ష సాధింపు కోసమే గవర్నర్లను వాడుకుంటున్నారని ఐటీ మంత్రి కేటీఆర్ ఫైర్ అయ్యారు. అత్యున్నత రాజకీయ పదవులు కేంద్రం చేతిలో రాజకీయ సాధనాలుగా మారాయని తెలంగాణ ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ ట్వీట్ చేశారు.
గవర్నర్ తమిలి సై పై సీపీఐ సెక్రెటరీ కూనంనేని సాంబ శివరావు మండిపడ్డారు. హైదరాబాద్ లోని మగ్ధుం భవన్ లో మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. గవర్నర్ ఎంత మేరకు ఉండాలో ఎంత మేరకే ఉండాలన్నారు. ఇది విమోచనో, విలీనమో గవర్నర్ కి ఎందుకు? అని ప్రశ్నించారు. గవర్నర్ వ్యవస్థను పూర్తిగా రద్దు చేయాలని కోరారు. గవర్నర్ తనకు మించిన పనులు చేస్తోందని అన్నారు. గవర్నర్ వ్యవస్థ ప్రజలకు అస్సలు పనికిరాదని విమర్శించారు. సెప్టెంబర్ 17ను విలీన…