Heavy Rain: వినాయకచవితి వేళ కరుణించిన వరుణుడు.. రాష్ట్రవ్యాప్తంగా దంచికొడుతున్న వర్షాలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Telangana Rains: వినాయకచవితి నాడు వరుణుడు కరుణించాడు. నిన్న రాత్రి నుంచి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా వర్షం దంచికొడుతోంది. వర్షాలు లేక అలమటించి పోతున్న రైతులకు పెద్ద ఉపశమనం లభించింది. నిన్న రాత్రి నుంచి ఎడతెరపి లేకండా వర్షం కురుస్తూనే ఉంది. ఇక, ఇటు రాజధాని హైదరాబాద్‌లోనూ వరుణుడు ప్రతాపం చూయిస్తున్నాడు. నగరంలోని కుత్బుల్లాపూర్, బాలానగర్, అల్వాల్, గాజులరామారం, కూకట్పల్లి, మియాపూర్, అంబర్పేట్, గచ్చిబౌలిలో వర్షం కుమ్మేస్తోంది. జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, రాజేంద్రనగర్, మణికొండ, టోలిచౌకిలోనూ వర్షం కురుస్తోంది. నగరంలోని పలు ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం పడుతోంది. సిటీలోని లోతట్టు ప్రాంతాలు, పలు ప్రాంతాల్లో రహదారులు జలమయ్యాయి. ఈ మేరకు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తు్న్నారు. అత్యవసరమైతే తప్ప బయటకు వెళ్లకుండా జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు చెబుతున్నారు.
ప్రజలు ఈ జాగ్రత్తలు పాటించండి..
ఇక, వర్ష వాతావరణం ఆహ్లాదకరంగా ఉన్నప్పటికీ, కొన్ని చిన్నపాటి నిర్లక్ష్యాలు అనారోగ్యానికి దారితీస్తాయి. అందుకే ఈ సమయంలో ప్రత్యేక జాగ్రత్తలు పాటించడం చాలా అవసరం. వర్షంలో తడవడం వల్ల జలుబు, దగ్గు, జ్వరం వంటి ఇన్ఫెక్షన్లు వచ్చే అవకాశం ఉన్నందున బయటకు వెళ్లేటప్పుడు ఎల్లప్పుడూ గొడుగు లేదా రెయిన్‌కోట్ తప్పనిసరిగా తీసుకెళ్లాలి. తడిసిన దుస్తులలో ఎక్కువ సేపు ఉండకుండా, వెంటనే పొడి దుస్తులు ధరించడం శ్రేయస్కరం. ఈ కాలంలో కలుషిత నీటి ద్వారా రోగాలు వేగంగా వ్యాపిస్తాయి, కాబట్టి కాచి చల్లార్చిన నీటిని మాత్రమే తాగాలి. రోడ్డు పక్కన అమ్మే బహిరంగ ఆహార పదార్థాలను తినకపోవడమే మంచిది. ఇంట్లో వండిన వేడివేడి, సమతుల్య ఆహారాన్ని మాత్రమే తీసుకోవాలి. విద్యుత్ ప్రమాదాల పట్ల చాలా అప్రమత్తంగా ఉండాలి. రోడ్లపై ఉండే వైర్లు, ట్రాన్స్ఫార్మర్లు, కరెంట్ స్తంభాలు, తడిసిన గోడలను అస్సలు తాకకూడదు. ఇంట్లో విద్యుత్ పరికరాలను వాడేటప్పుడు చేతులు పొడిగా ఉండేలా చూసుకోవాలి. వాహనాలు నడిపేవారు రోడ్లపై ఉండే నీటి గుంతల పట్ల జాగ్రత్తగా ఉంటూ, వేగాన్ని తగ్గించి వెళ్లడం సురక్షితం. అలాగే పరిసరాలలో నీరు నిల్వ ఉండకుండా చూసుకుంటే దోమల వ్యాప్తిని అరికట్టి డెంగ్యూ, మలేరియా వంటి వ్యాధుల నుంచి మనల్ని మనం కాపాడుకోవచ్చు.
Also Read
- YS Jagan: వైసీపీ అభ్యర్థులపై అష్ట కుట్రలు.. వీటిని ఎన్నికలంటారా?
- YS Jagan: సుప్రీంకోర్టు అంటే గౌరవం లేదు.. ప్రజలంటే విలువ లేదు!
- స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్ జెన్ 5, యాక్టివ్ కూలింగ్ ఫ్యాన్‌తో OnePlus Ace 7 Pro.. అక్టోబర్ 29న గ్రాండ్ ఎంట్రీ..!
- Online Betting App Scam: ఆన్లైన్ బెట్టింగ్ యాప్‌లపై ఈడీ పంజా.. బయటపడ్డ 200 షెల్ కంపెనీల నెట్వర్క్!
తాజావార్తలు
-
Piyush Goyal: ‘కాలుష్యానికి కారణం మీరే.. భారత్‌పై నిందలేంటి?’.. యూరప్ కపటత్వాన్ని ముఖం మీదే బట్టబయలు..
-
YS Jagan: వైసీపీ అభ్యర్థులపై అష్ట కుట్రలు.. వీటిని ఎన్నికలంటారా?
-
YS Jagan: సుప్రీంకోర్టు అంటే గౌరవం లేదు.. ప్రజలంటే విలువ లేదు!
-
స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్ జెన్ 5, యాక్టివ్ కూలింగ్ ఫ్యాన్‌తో OnePlus Ace 7 Pro.. అక్టోబర్ 29న గ్రాండ్ ఎంట్రీ..!
-
Oppo Pad Mini: భారత్‌లో Oppo Pad Mini లాంచ్.. 144Hz డిస్ప్లే, 8,000mAh బ్యాటరీ, ధర ఎంతంటే?
ట్రెండింగ్
-
Yellow Gas Flame: గ్యాస్ మంట పసుపు లేదా నారింజ రంగులో వస్తోందా? ప్రమాదం పొంచి ఉండొచ్చు జాగ్రత్త సుమీ..!
-
Onion Pesarattu: టిఫిన్స్‌లో రారాజు ‘ఆనియన్ పెసరట్టు’.. పర్ఫెక్ట్ కొలతలతో రెస్టారెంట్ స్టైల్లో సులువుగా చేసుకోండి ఇలా..!
-
SL vs ENG: బ్రూక్ ఫాస్టెస్ట్ డబుల్ సెంచరీ వృథా.. శ్రీలంక రికార్డ్ ఛేజింగ్ విజయం!
-
SA vs AUS: దెబ్బ అదుర్స్ కదూ.. ఆస్ట్రేలియాపై దక్షిణాఫ్రికా ఇన్నింగ్స్ తేడాతో విజయం.!
-
Manuel Otto: లైవ్‌స్ట్రీమ్‌లో నిప్పంటించుకుని ఇన్ఫ్లుయెన్సర్ ఆత్మహత్య